Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Boochamma Boochodu  movie release on august 1st

ఈ సంచికలో >> సినిమా >>

ఆగస్ట్ 8 న వస్తున్న నువ్వలా నేనిలా !!

nuvvalaa nenila movie release on august 8th

ఇటీవల ఆడియో విడుదల జరుపుకున్న నువ్వలా నేనిలా చిత్రాన్ని ఆగస్ట్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వరుణ్ సందేశ్-పూర్ణ జంటగా మేం వయసుకు వచ్చాం ఫేం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో అమోఘ క్రియేషన్స్ పతాకం పై ఇందూరి రాజశేఖర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం తెలిసిందే. సాయి కార్తీక్ సంగీత సారధ్యం వహించిన నువ్వలా నేనిలా చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్ మార్కెట్ చేస్తోంది.

నిర్మాత ఇందూరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ నువ్వలా... నేనిలా పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. సాయి కార్తీక్ కెరీర్ లో ది బెస్ట్ ఆడియో అని అందరూ అంటున్నారు. అలాగే ట్రైలర్స్ కు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఆగస్ట్ 8న మా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్స్ ను ఇష్టపడే వాళ్ళందరికీ విపరీతంగా నచ్చే సినిమా నువ్వలా నేనిలా అన్నారు

సోనియా బిర్జీ, వెన్నెల కిషోర్, సనా, ధన రాజ్, ఉత్తేజ్, అరుణ్ కుమార్, గిరి, అదుర్స్ రఘు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ : అమోఘ క్రియేషన్స్, ఎడిటర్ : శ్రవణ్, ఆర్ట్ : వర్మ, మాటలు : ఉదయ్ భాగవతుల, ప్రెస్ రిలేషన్స్ : ధీరజ అప్పాజీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : విష్ణు సూర్య. జి, సంగీతం : సాయి కార్తీక్, చాయాగ్రహణం : వి.ఎస్. జ్ఞాన శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పాలకుర్తి శ్రీధర్ గౌడ్, నిర్మాత : ఇందూరి రాజశేఖర్ రెడ్డి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : త్రినాధరావు నక్కిన!!

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam