Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Boochamma Boochodu  movie release on august 1st

ఈ సంచికలో >> సినిమా >>

ఆగస్ట్ చివరి వారంలో రానున్న పాచిక

pachika movie comes august last week

నా సామిరంగ ఫేం దిలీప్ కుమార్ హీరోగా, దివ్యాసింగ్ హీరోయిన్ గా ఫిల్మ్ ట్రేడ్ గైడ్ సమర్పణలో విజ్ డం ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్ & వి.ఆర్. డి.డి. ఫిల్మ్ సమ్యుక్తంగా తెలుగు, తమిళ్, భాషల్లో నిర్మిస్తున్న చిత్రం పాచిక. శశి శంకర్ దర్శకుడు., కోవై సరళ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ చివరి వారం లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. నాసామిరంగా ఫేం దిలీప్ కుమార్ హీరోగా నటిస్తున్న పాచిక చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, తమిళ, భాషల్లో నిర్మిస్తున్నాము. కథ, కథనం, దిలీప్ కుమార్ నటన, దివ్యాసింగ్ అందచందాలు సినిమాకి ప్రధానాకర్ష్ణగా నిలుస్తాయి.ముఖ్యంగా కోవై సరళ పాత్ర, ఆమె నటన అద్భుతమని చెప్పాలి. ఇటీవలి కాలంలో కాంచన తర్వాత ఆమె ఈ చిత్రంలోనే పూర్తి స్థాయినిడివిలో నటించింది.

ఇక సినిమాని ఎంతో గ్రాండ్ గా, రిచ్ గా ఉండడానికికి ఆర్. ఎఫ్.సి. పొల్లాచ్చి, గోవా, పాండిచ్చేరి, కేరళ లోని తదితర అందమైన లోకేషన్లలో భారీగా చిత్రీకరించాము. దర్శకుడు శశికిరణ్ మళయాళంలో చాలా చిత్రాలు చేశాడు. సూర్య, జ్యోతిక నటించిన సుందరాంగుడు చిత్రం ద్వారా తెలుగులో కూడా సుపరిచితులే. ఈచిత్రాన్ని చాలా బాగా తీర్చి దిద్దారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఆగస్ట్ చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము అన్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam