Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
26th episode

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ.ఏ.ఎస్ పాస్

 జరిగిన కథ : కిట్టు ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ బయలుదేరుతాడు. అధికారులడిగే ప్రశ్నలకి సమాయుక్తం కావడంలో అబ్యర్ధులందరిదీ  ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలి. బాత్రూం కెళ్ళి తలుపేసుకుని చాలా సేపటివరకూ బయటకు రాని కిట్టు కోసం బాత్రూం తలుపులు బాదగా బయటకొచ్చిన కిట్టును చూసి ఆశ్చర్యపోతారు అందరూ.

నీ హాబీ...

బాడీ బిల్డింగ్ సర్..

ఈ సిక్కులు ఆటలకూ, బాడీ బిల్డింగ్ కూ పెట్టింది పేరు. ఏం అడుగుతాడో ఏమో ఈ ముసలాయన... కిట్టు లోలోపల అనుకుంటున్నాడు.

 ఏరోబిక్స్ కూ ' మామూలు ఎక్సర్సైజులకు తేడా ఏమిటి?

" ఏరోబిక్స్ లో పాటలు పెట్టుకుని ఎగురుతుంటుంటారు. దాంట్లో ఏముంది నా బొంద... బరువులు లేపి, డంబెల్స్ కొడితే తల ప్రాణం తోకకు వస్తుంది. మనసులో అనుకున్నాడు. కిట్టు పైకి వెంటనే అన్నాడు సర్... ఏరోబిక్స్ లో గాలి ఫ్రీగా పీలిస్తూ శరీరం మొత్తం కదిలిస్తూ వ్యాయామం చేస్తారు. బాడీబిల్డింగ్ చేసేవాళ్ళు బరువు ఎత్తేటప్పుడు ఊపిరి బిగించి, బరువులు ఎత్తుతారు. ఆ తరువాత నెమ్మదిగా ఊపిరి వదులుతూ కిందికి దించుతారు. దీని వలన ఊపిరి పీలచడం సమంగా లేక వయసు అయిపోయిన తర్వాత ఆస్మా ( తెలుగులో ఉబ్బసం ) బారిన పడతారు... అన్నాడు కిట్టు...

మిగిలిన వాళ్ళు కూడా వింటున్నారు...

ముసలాయన అన్నాడు... ఏరోబిక్స్ గుండెకి మంచిది ... మిగిలిన వ్యాయామాలు కండరాలకు మంచివి.

ఎస్.. సర్.. అన్నాడు కిట్టు.

మళ్ళీ బాణం వేసారు ముసలాయన

పాకెట్ హెర్ఫ్యూలిస్ అని ఎవర్నంటారు.?

సర్.. మనోహర్ ఐక్ అనే బెంగాలీ ఆయన ఉన్నాడు. ఆయన చాలా పొట్టిగా ఉంటాడు. బాడీబిల్డింగ్ పోటీల్లో అంతర్జాతీయం గా పేరు సంపాదించాడు. విదేశీయులంతా ఆయన్ను మెచ్చుకుని హెర్క్యూలిస్ అని బిరుదిచ్చారు. సర్... అన్నాడు కిట్టు...

ఇండియన్ హెర్క్యూలిస్ అని ఎవర్నంటారు?

బాడీ బిల్డింగ్ అని పెట్టినప్పుడే అనుమానించాడు. కిట్టు... తెలుగు వస్తాదుల గురించి అడగవచ్చని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయీ లింకులు. ఆర్నాల్డ్ శివాజీనగర్ ( ఆర్నార్డ్ ష్వార్ జెనెగర్ ) గురించి ఇక అడగరు. అతను ఎంత ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డరైనా సరే... ఎందుకంటే తెలిసిన వాడూ, తెలియని వాడూ కూడా బాడీ బిల్డింగ్ అంటే ఆర్నాల్డ్ శివాజీ నగర్ పేరే చెబుతాడు.

ఈ విషయం ముసలాయనకి తెలుసు. అందుకని అది తప్ప వేరేది అడుగుతున్నాడు.కిట్టు అందుకున్నాడు.

కోడీ రామకృష్ణ నాయుడు గారు, శ్రీకాకుళం కు చెందిన వారు. .. ఉక్కు సంకెళ్ళను ఛాతికి బిగించి, కండలను కొండలా పెంచి ఆ ఉక్కు సంకెళ్ళను పగలగొట్టే వారాయన... ఒకటిన్నర టన్నుల నుండి మూడున్నర టన్నుల బరువు ఛాతిపై మోసేవాడాయన.. ఆయన బల ప్రదర్షనకి మెచ్చిన ఇంగ్లాండ్ రాజు, రాణి ఆయనకి ఇచ్చిన బిరుదు ఇండియన్ హెర్క్యూలిస్ అని ముగించాడు కిట్టు. లంక్ల్ కో కొద్ర్... ఇదేమిటి? కొద్దిగా ఆలోచించాడు కిట్టు

ఓహ్... లం క ల కోడే రు చిగచ్చం నుండి పాలకొల్లు వెల్లే దారిలో వస్తుంది. ఈ పంజాబీ ముసలాయనకి మన ఊర్ల పేర్లు నోరు తిరిగి చావవు కదా... సర్.. లంకల కోడేరు అన్నాడు కిట్టు.

ఓకే ఓకే .. టెల్ మీ..

సర్.. ముగ్గురు అన్నదమ్ములున్నారు. సయ్యపు రాజు సూర్య నారాయణ రాజు, సయ్యపు రాజు బండ్రా వెంకట రాజు , మూడో పెద్దన్నయ్య గాంధీ గారికి బాడీగార్డ్ గా వ్యవహరించారు సార్... వీళ్ళకో సిస్టరుండేదనీ, వీళ్ళతో కుస్తీ పట్టడానికి వచ్చిన వారికి ఆమె భోజనం పెట్టి నువ్వులు పక్కన వేసిందనీ వేసిందనీ, అవెందుకు ? అంటే ఇలా పిండి ఆ నూనెను పప్పులో వేసుకోవాలనీ అంటూ ఆమె పిండి వేసిందనీ, చెల్లెలే ఇలా వుంటే.. అన్నల సంగతి ఏమిటని జడుసుకుని ఆ వచ్చిన వాడు పారిపోయాడట... అని చెబుదామని కిట్టు... వీళ్ళకో సిస్టర్ వుండేదట సార్ అనగానే... ముసలాయన చెయ్యి పైకెత్తి ఆపేసారు.. ఇక చాల్లే అన్నట్లుగా కథలు చెప్పుకుంటుంటారు. అ పల్లెటూరి కబుర్లు కథలే సహాయం చేసాయి కిట్టుకి జై.. పెన్నాడ అగ్రహారం. పెన్నాడకి జై... అనుకుంటున్నాడు కిట్టు....

కరాటే కనిపెట్టిందెవరు?

వెంటనే పుసుక్కున బ్రూస్లీ అని నోటికి వచ్చేస్తుంది అందరికీ.. జై బాలమిత్రా.. జై బొమ్మరిల్లు.. జై చందమామ... బోధిధర్ముడు బోధిధర్ముడనే బౌద్ధ సన్యాసి, భారతీయుడు కనిపెట్టాడు కరాటేని. ఈ అడువుల వెంట వెళ్తొన్న బౌద్ద సన్యాసులపై దొంగలు దాడిచేసి గాయపరిచేవారు... వారి బారి నుండి తమను తాము రక్షించుకోవడానికి బౌద్ధ సన్యాసి బోధిధర్ముడు కనిపెట్టిన విద్య కరాటే. కరాటే అనగా వట్టి చేతులు ఎదుటివారిని గాయపరచడానికి రాలేదది. కేవలం ఆత్మరక్షణ కోసం వచ్చిందా విద్య.. అన్నాడు కిట్టు.

లాటిస్ మస్ డార్సీని సింపుల్గా ల్యాట్స్ అంటారు. ఇది మన ప్రక్కటెముకలు (రిబ్స్) దగ్గర వుండే కండరం .... సాధారణంగా దీనిని ఎవరూ ఉపయోగించారు.

అందుకని అది అందరిలోనూ ప్రస్పుటం గా  కనిపించదు. ఏదన్నా అవయవాల్ని మనం వాడకుండా వదిలేస్తే అది కుచించుకు పోయి కొన్ని తరాల తర్వాత ఏకంగా మాయమైపోతుందని లామార్కు గారు చెప్పారు. వ్యాయామం చేసే వాళ్ళు ఈ కండరానికి పని కల్పించి, దాన్ని అభివృద్ధి చేస్తారు. ముసలాయన కిట్టు చెప్పేది వింటూ ఉన్నారు. తరువాత నిద్ర లోకి జారుతున్నట్ట్లుగా జారుకుంటూ పక్కనున్న ఆయనకు సైగ చేసాడు...

ఆ పక్కనున్న ఆయన కిట్టు వైపు చూసాడు. ... కిట్టు ఆయనతో చూపులు కలిపాడు...

మన దేశం లో ఎన్ని ఆటవిక తెగలు ( టైల్స్ ) ఉన్నాయి?

ఆరువందల నలభై కి పైగా... సర్..

ఆయన ఆంత్రోపాలజిస్ట్ ( మానవ శాశ్తగ్నుడు ) అన్నమాట ... అనుకున్నాడు కిట్టు...

నీవు గ్రామం నుండి వచ్చినట్టుగా ఇక్కడుంది అన్నారాయన.

అవును సార్.. పెన్నాడ అగ్రహారం .. అన్నాడు కిట్టు..

గ్రామాల్లో పొడుపు కథలు వేసుకునేవారా?

అవును వెంటన్ గుర్తుకొచ్చాయి చిన్నప్పటి పొడుపు కథలు...

కిట్టుగాడు తండ్రి గరగర తల్లి పీచు పీచు

బిడ్డలు రత్న మాణిక్యాలు...

చెప్పుకో చూద్దాం...'

'పనసపండు

' ఆకాశాన అరవై ఆరు కొడవళ్లు - చింతకాయలు

తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది - ఉత్తరం

కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడే కావు - కనురెప్పలు

చిటారు కొమ్మన మిఠాయి పొట్లం - తేనెపట్టు

ప్రశ్నిస్తున్న ఆయన మళ్లా అన్నారు..

. నేను కొన్ని పొడుపు కఠలు అడుగుతాను...

చిన్నప్పట్నుంచీ అడవిలో పుట్టి, అడవిలో పెరిగిన వాడివిగా నిన్ను నువ్వు ఊహించుకుని, సమాధానాలు చెప్పు..

. ఎస్ సర్.. బ్రతికి ఉన్న మనిషి చేతులు కదుపుతాడు కానీ, కదలలేడు...

'అడవిలో ఎక్కువగా ఉండేవి చెట్లే... జె.సి.బోస్ గారు చెట్లకు ప్రాణం వుందని చెప్పారు... కిట్టుకి సమాధానం లభించింది వెంటనే అన్నాడు..

'చెట్టు... సర్... కొమ్మలు కదులుతాయి. అవే చేతులు... కానీ, కదలలేదు...' ఔననలేదు... కాదనలేదాయన...

మళ్లీ ప్రశ్న వేశాడు..

'ముసలివాడు... జటాజుటాలు పెంచుకుని వున్నాడు... ఎవడు వాడు?'

అడవుల్లో తిరిగే సన్యాసులా? వీళ్లూ జుట్టు విపరీతంగా పెంచుకుని జటాజుటాలతొ వుంటారు కదా!... కాదు... ఇంకోటేదో వుండాలి... శరవేగంతొ ఆలోచిస్తున్నాడు కిట్టు... చెట్లు చేమలు... పెన్నాడలో తిరిగిన పొలాలు... ఊరి చివర చెట్లు... సడన్ గా తట్టింది కిట్టుకి... ఊడలు తిరిగి, ముసలివాని ముఖంలా ముడతలు పడ్డ పెద్ద కాండంతో వుండే మర్రిచెట్టు. దాని దగ్గరకు వెళ్లాలంటే భయపడేవారు కిట్టు, కిట్టు ఫ్రెండ్స్... దయ్యాలు కాపురముంటాయట వాటిపైన అనుకునేవారు. ఇక ఆలస్యం చేయకుండా చెప్పాడు కిట్టు.

జటాజుటాలంటే ఊడలు సర్...

మర్రిచెట్టు అది...

మళ్లీ ప్రశ్న వచ్చింది...

బారెడు తోకగల వడ్రంగి పిట్ట...

వడ్రంగిపిట్ట చకచకా చెట్టును చెక్కేస్తుంది ముక్కుతొ..

. చెట్టు కొట్టేది గొడ్డలి... బారెడు తోక దాని కామ (కామ అంటే గొడ్డలిని పట్టి వుంచే పొడవాటి కర్ర) ఇంకో ప్రశ్న 'చెరువులో వెయ్యి

చందమామలు ' కిట్టుకి వెంటనే బుర్రలో... గుళ్లో సూరన్న, ఆ గుడి, చెట్టుమీద కోతి కొమ్మచ్చి, పక్కనే చెరువు, చెరువులోని తామర ఆకులు, కలువపూలు, ఆ పక్కనే కొమర్రాజులు, వారి ట్రాక్టర్లు గుర్తొచ్చాయి.

చెరువులో దిగితే తామర తూడుల మధ్య ఇరుక్కుపోవడమే... చెరువునిండా కలువపూలు... వాటికి చిన్న చిన్న కాయలుగా వుండేవి... అవి కోసుకు తినేవారు... కొమర్రాజుల ఇళ్లు , ఆ పక్కనే వుండేవి. కొమర్రాజుల దగ్గర పెద్ద పెద్ద ట్రాక్టర్లు వుండేవి. పెద్ద పెద్ద లారీలు మట్టిలోనో, బురదలోనో కూరుకుపోతే, కొమర్రాజుల ట్రాక్టర్లు చాలా తేలిగ్గా బయటకు లాగి పారేసేవి. చాలా గొప్పగా చెప్పుకునేవారు

కిట్టు అండ్ ఫ్రెండ్స్...

సులభంగా చెప్పాడు కిట్టు... కలువపూలు...

ఇంకో బాణం... వెనకాల వంద కన్నులున్న బాలుడు ఎవరు?

కిట్టు ఆలోచనలో పడ్డాడు... వెయ్యి కన్నులు కలవాడు ఇంద్రుడు... వంద కన్నుల వాడెవడు?

అందులోనూ అడవుల్లో తిరిగేవాడు... సరే, చెట్లు ఏమన్నా వున్నాయా? కన్ను షేపులో వున్న చెట్టేమిటి? ఏ చెట్టూ గుర్తు రావడం లేదు... పోనీ, జంతువులు? పక్షులు? అడవుల్లో ఈ మూడు తప్ప వేరేమీ వుండవు... సమాధానం ఈ మూడింట్లోంచే రావాలి. పోనీ, పక్షి? పుస్తకాల్లో పెట్టుకునే నెమలి ఈక గుర్తొచ్చింది కిట్టుకి. అది పిల్లల్ని పెడుతుందని నమ్మేవాడు కిట్టు... పెల్లల్ని పెట్టిందొ, లేదో చెక్ చేసుకునేవాడు. నెమలీక కన్ను షేపులోనే వుంటుంది...

ఏమైతే అయ్యింది... ఒక రాయి వేద్దాం అనుకున్నాడు కిట్టు...

సర్... నెమలి అన్నాడు కిట్టు...

ఔననలేదు, కాదనలేదు ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ గారు ఆ తర్వాత ఇలా అన్నారు... 'ఒకవేళ నేనడిగిన ఈ ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పలేదనుకో, తప్పు చెప్పావనుకో... దాన్నిబట్టి నిన్ను జ్ఞానం లేనివాడు అని... అనవచ్చునా...?'

ఈ ప్రశ్నకి సమాధానం చాలా తేలిక.

జై మునిరత్నంరెడ్డి గారికి... జై...

'అడవుల్లో వుండే తెగలను చులకనగా చూసేవాళ్లను తెగ తిట్టేవాడాయన. మామూలుగా కాదు... పెద్ద కంఠంతో శాపనార్థాలు పెట్టేవాడాయన

సర్... పట్టణాల్లో వుండేవాళ్లు ఇంగ్లీషులో చదువులు చదివి తామే జ్ఞానవంతులమనీ, పల్లెల్లోనూ, అడవుల్లోనూ వుండేవాళ్లు జ్ఞానశూన్యులనీ అనుకుంటారు. వీళ్లు రాసే పరీక్షలు ఇంగ్లీష్, లెక్కలు... అడవిలో నివసించే వారికి పెడితే వాల్లు సున్నా తెచ్చుకుంటారు... ఇందాక మీరడిగిన ప్రశ్నలు ఈ పట్టణవాసులను అడిగితే రెండు సున్నాలు తెచ్చుకుంటారు. దీనివల్ల తెలిసేదేమిటంటే పల్లెవాసులు, వన్యవాసులు కూడా తెలివైనవాళ్లే... వాళ్ల తెలివితేతల్ని ఏ రకమైన ప్రశ్నలతో పరిశీలించాలో అలాగే పరిశీలించాలి... అంతేగానీ, వాళ్లకు సంబంధం లేని, మనం గొప్ప అనుకునే ప్రశ్నలతో వాళ్లని బేరీజు వేసి, చేతగాని వాళ్లనడం చాలా పెద్ద పొరపాటు... అని చెప్పాడు కిట్టు...

ఆ తరువాతి కాలంలో ఒక ఘటన జరిగింది... 'ఒక టీవీ ఛానెల్ వాళ్లు 'వన్యవాసుల గురించి 'ఎ ' అండ్ 'పి ' అనగా 'అంతూపొంతూ' తెలియకపోయినా ఒక ప్రయోగం చేశారు. అదేమిటంటే, వన్యవాసి యువకులను తెచ్చి చదువుకున్న నాగరీకులమనుకునే వాళ్ల మధ్యలో పెట్టి వన్యవాసులను వెర్రి మొర్రి ప్రశ్నలు వేసి వాళ్లని ఇబ్బంది పెట్టి పంపించేశారు. అది తప్పన్న వాళ్ల దగ్గర తమ ఘన కార్యాన్ని సమర్థించుకున్నారు. ఆ టీవీ ఛానెల్ వాళ్లు ఇంకా బతికి వున్నారంటే, దాని అర్థం 'మునిరెడ్డిగారు ' ఆ ఎపిసోడ్ చూడలేదన్నమాట.

ఆయన గనక చూసి వుంటే ఆ టీవీ ఛానెల్ వాళ్లని గుపాకీతో పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి వుండేవాళ్లు...'

ఈలోగా ఇంకో ప్రశ్న..

ఆంత్రోపాలజీలో రకరకాల వివాహ బంధాలున్నాయి... అవేమిటొ చెప్పి, వాటిని రామాయణ, మహాభారతాలను ఉదాహరణగా తీసుకుని వివరించండి...

సర్... మొత్తం పన్నెండు రకాల వివాహ బంధాలున్నాయి. వాటన్నిటికీ రామాయణ, మహాభారత ఉదాహరణలు ఇవ్వలేను. కానీ, ముఖ్యమైనవి చెప్పగలను. మొదటగా ఏకపత్నీ, ఏకభర్తృ వివాహం. దీనికి చక్కని ఉదాహరణ. రెండవది బహు భర్తృత్వము. ద్రౌపదీ, పాండవులు దీనికి ఉదాహరణ. ఈ బహు భర్తృత్వములో ఐదుగురు సోదరులు ఒక్క ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. కుంతీదేవి బహుభర్తలతో కలసి జీవించకపోయినా... ఆమెది ఒకరకమైన బహు భర్తృత్వమే. సూర్యుడి ద్వారా కర్ణుడిని, ఇంద్రుడి ద్వారా అర్జునుడిని, యముడి ద్వారా ధర్మరాజునీ, వాయుదేవుడి ద్వారా భీముడినీ పొందింది. అశ్వనీ దేవతల ద్వారా మాద్రి నకుల, సహదేవులను పొందింది. మూడవది బహు భార్యాత్వము. శ్రీకృష్ణ భగవానుడు పదహారువేల మంది భార్యలను కలిగి, దీనికి ఉదాహరణగా నిలిచాడు. బహు భార్యాత్వములో ఇంకో రకమున్నది. ద్రౌపది గాక ధర్మరాజుకు దేవకి అనే భార్య, అర్జునుడికి శశిరేఖ, భీముడికి హిడింబి, నకులుడికి కరేణుమతి, సహదేవుడికి విజయ అనే భార్యలున్నారు. ఇంతకు మించి నేను చెప్పలేను సర్...' అన్నాడు కిట్టు.

మనసులో అనుకున్నాడు కిట్టు అప్పుడెప్పుడో అంగట్లో కూర్చుని చదివిన తూకం పుస్తకాలు, చందమామలాంటివి, అద్దె పుస్తకాలు చదవబట్టి ఇదైనా చెప్పగలిగాను. లేకుంటే గోవిందా... గోవిందా... ఇంక ఆంత్రోపాలజీ (మానవశాస్త్రం) ప్రొఫెసర్ గారు కిట్టుని వదలి తన పక్కన వున్న ఆయన వైపు చూసి తలాడించారు...

ఆయన వైపు చూశాడు కిట్టు... చూడగానే కిట్టుకి అర్థమైపోయింది... ఆయన సద్బ్రాహ్మణుడు... అనగా తెలుగు పండితుడు... పండితులవారు కిట్టువైపు చూసి చిరునవ్వు నవ్వారు... ఒక మంచి పద్యం చదువు అన్నారు. పద్యమా, చదవాలా? కిట్టు అనుమానంగా చూశాడు... ఔను... ఒక పద్యం వినిపించు అన్నారాయన... కిట్టుకి 'ఉప్పుకప్పురంబు ' గుర్తుకొచ్చింది. ఛ... మరీ అదేంటి? కొంచెం ఆలోచించాడు... గంభీరంగా వుండాలి పద్యం... కిట్టుకి ప్రాణప్రదమైన పద్యమొకటుంది. అల్లసానివాని అల్లిక అది. జిగి బిగి వున్న పద్యమది... ఆ పద్యాన్ని చదువుతుంటే... సంస్కృతం రానివాడు కూడా 'ఎదో జలపాతాలు, లోయలు, లేళ్లు, నెమళ్ల ' గురించే చెప్తున్నట్లున్నావు అనాలి. అలాంటి పద్యమది. జై దేవులపల్లి రామకృష్ణశాస్త్రి...     

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్