Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Telugu Chatuvu Book Review

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (ఆగష్టు 1 నుండి ఆగష్టు 7 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభం దూకుడును ప్రదర్శిస్తారు నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానేఉంటుంది మిత్రుల నుండి సహాకారం పొందుటకు అవకాశం కలదు. కుటుంభంలో సభ్యుల నుండి సూచనలు వస్తాయి వాటిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశం నుండి వార్తలు వినే అవకాశం కలదు. వారం చివరలో అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకొండి మంచిది. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది అధికారులతో చర్చలలో పాల్గొంటారు మీయొక్క ఆలోచనలు వారికి తెలియజేస్తారు.      

 

వృషభ రాశి

 ఈవారం మొత్తంమీద ఆరంభంలో స్వల్ప జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులను మల్లి మల్లి చేయవలసి రావోచ్చును జాగ్రత్త. బంధుమిత్రులను కలుస్తారు వారినుండి నూతన విషయాలను తెలుసుకుంటారు. చిననాటిమిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు నూతన విషయలను తెలుసుకుంటారు. సోదరులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడుట మంచిది వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చిన సూచనలు పాటించే ప్రయత్నం చేయుట ఉత్తమం. కొన్ని కొన్ని విషయాల్లో కటినమైన నిర్ణయాలు తీసుకోవడం మూలాన మేలుజరుగుతుంది. కుటుంభంలో సర్దుబాటుమంచిది జీవితభాగస్వామి వలన నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది


మిథున రాశి

ఈవారం మొత్తంమీద మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారులనుండి అభినందనలు పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో చేసిన ఆలోచనల వలన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయకండి మంచిది లేకపోతే వాటిలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. ఒకవార్త మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది ప్రనలికబద్దంగా లేకపోతే నూతన సమస్యలు వచ్చి పడుతాయి. మాటలు మాత్రం పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. వారం చివరలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు.           

 

కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద అధికారులనుండి నూతనవిషయాలను తెలుసుకుంటారు వారితో చర్చలు చేయుటకు అవకాశం కలదు. చేపట్టినపనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్త అవసరం. వాహానముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. స్త్రీ సంభందమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయకండి సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. దూరప్రదేశం నుండి వార్తలు వినుటకు అవకాశం ఉంది గతకొంత కాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు వస్తాయి. విలువైన వస్తువులను పోగొటుకొనే అవకాశం కలదు కావున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలతో సంప్రదింపులు జరుపుటకు అవకాశం కలదు బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట మంచిది.  

 

సింహ రాశి

ఈవారం మొత్తంమీద కుటుంభసభ్యులతో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది దైవసంభందమైన పనులకు సమయాన్ని కేటాయిస్తారు. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపించే అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే అవకాశం ఉంది. మొండితనం మూలన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండుట మంచిది. అర్తికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది కావున అనవసరమైన ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. పెద్దలనుండి పనిభారం పొందుటకు అవకాశం కలదు

 

కన్యా రాశి

ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను చిన్న చిన్న సమస్యలు పొందినప్పటికిని విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది వాటికి అధికమైన సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగపరమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు వేయుటకు అవకాశం ఉంది. మాతతీరును మార్చుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. ఇష్టమైన పనులకు సమయాన్ని ఇస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది సంతృప్తిని పొందుటకు అవకాశం కలదు. వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది అయినను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం కలదు. నిదానంగా వ్యవహరించుట సూచన. ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు.

 

తులా రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారంలో ఓడిడుడులను ఎదుర్కొంటారు ఓపికతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. మానసికంగా దృడంగా ఉండుట సూచన ధనమునకు సంభందించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. తీర్థయాత్రలకు వెళ్ళుటకు అవకాశం కలదు వాటికి సమయాన్ని కేటాయిస్తారు కుటుంభసభ్యులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది

 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభం బాగుంటుంది చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది సంతృప్తికరమైన ఫలితాలు వచ్చుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నిదానం అవసరం. వారం మధ్యలో అనవసరమైన ఖర్చులు పొందుటకు అవకాశం ఉంది వాటిమూలన స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. వారంచివరలో సంతోషాన్ని పొందుటకు అవకాశం ఉంది తలపెట్టిన పనులలో లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. పెద్దలను కలుస్తారు వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకోనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచనచేయుట మంచిది.  

   

ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు వాటిని మలుచేసే దిశగా అడుగులు వేసేఅవకాశం ఉంది. ఆరంభం బగుంటుంది కాకపోతే ఒకేసారి అన్నిపనులు ప్రారంభించాలనే తొందరపాటు నిర్ణయాలు తీఉస్కొవ్దమ్ మూలన వారం చివరలో పనిఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులను కలిసి వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది సమయాన్ని వారితో గడుపుతారు. విందులకు,వినోదాలకు సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలను ఆరంభించే ముందు సాధ్యసాధ్యాలు ఆలోచించి ముందుకు వెళ్ళుట ఉత్తమం. ఊహించనిఖర్చులను పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయాణాల మూలాన స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు.       

 

మకర రాశి

ఈవారం మొత్తంమీద పెద్దలతో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది వారి నుండి నూతన సమాచరం అందుకొనే అవకాశం ఉంది. కుటుంభంలో సభ్యుల ఆలోచనలు నచ్చకపోవచ్చును సర్దుబాటు విధానం ఆవలంభించుట సూచన. ఉద్యోగంలో చేపట్టిన ఆలోచనలు మార్పును కలుగజేస్తాయి. తలపెట్టిన పనులను నిదానంగా పూర్తిచేసే అవకాశం ఉంది ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అధికారులనుండి లబ్దిని కలుగజేసే వార్తలను వినే అవకాశం ఉంది. వ్యాపారంలో బాగుంటుంది కాకపోతే వ్యక్తుల మధ్య మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట సూచన. బంధుమిత్రులను కలిసి వారితో సరదగా సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది.       


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద కుటుంభసభ్యుల ఆలోచనలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు కొన్ని  కొన్ని విషయాల్లో విభేదించే అవకాశం ఉంది. ఆరంభంలో మాత్రం స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకొనుట మంచిది. సంతానపరమైన విషయాల్లో సంతోషాన్ని పొందుతారు సమయాన్ని వారితో గడుపుటకు అవకాశం ఉంది. నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో వచ్చు మార్పులు కొంత నిరుత్సాహాన్ని కలుగజేసిన తేరుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును దూరప్రదేశ ప్రయాణాలు మాత్రం కలిసి వస్తాయి. చిననాటి మిత్రులను కలుస్తారు. స్త్రీ సంభందమైన విషయాలకు సమయాన్ని ఇచ్చుటకు అవకాశం ఉంది.        

.      

మీన రాశి

ఈవారం మొత్తంమీద  శుభాకార్యములలో పాల్గొనే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను ఆరంభంలో బాగానే పూర్తిచేస్తారు కాకపోతే రానురాను పని ఒత్తిడి తప్పక పోవచ్చును. స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు మాత్రం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. ఉద్యోగంలో తోటివారి సహాకారం కోసం చేయుప్రయత్నాలు మిశ్రమఫలితాలను కలుగజేయుటకు అవకాశం కలదు.  కుటుంభంలో సంతోషకరమైన వార్తలను వినే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతృప్తిని పొందుటకు అవకాశం కలదు. దైవసంభందమైన విషయాల్లో పాల్గొంటారు. మిత్రులను కలుస్తారు వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Ankle Tendon Pain and Ayurvedic Treatment by Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ay)