Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సినిమా అంటే పిచ్చి ప్రేమ - మధుర శ్రీధర్

interview with  madhura sridhar
శ్రీధర్ అన్నా, శ్రీధర రెడ్డి అన్నా ఎవరికీ తెలియదు కానీ, మధుర శ్రీధర్ అంటే చాలు సినిమా జనాలకు, సినిమా అభిమానులకు ఇట్టే పరిచయం జరిగిపోతుంది. అంతటి సుపరిచితమైన పేరు. అలా అని పదుల కొద్దీ సినిమాలూ తీయలేదు..మూడు సినిమాలకు దర్శకుడు..రెండు సినిమాలకు నిర్మాత..కొన్నాళ్ల పాటు ఓ సినిమా పత్రిక నడిపారు..అడియో కంపెనీ నిర్వహిస్తున్నారు. అంతే. కానీ ఎందుకింత పాపులర్ అంటే, సినిమా పట్ల ఆయనకున్న ఫ్యాజన్..ప్రేమ..పిచ్చి..అన్నీ..ఇంకో పక్క సినిమా వాళ్లతో, మీడియా జనాలతో విపరీతమైన స్నేహం..అంతే.. ఇవే క్వాలిఫికేషన్లు. సింప్లిసిటీ ఆయన కేరాఫ్ అడ్రస్. అలాంటి మధురమైన వ్యక్తి,,తొలిసారిగా, తాను కేవలం నిర్మాతగా వుంటూ. అవార్డు విన్నింగ్ డైరక్టర్ నీలకంఠతో వైవిధ్యమైన సినిమాను అందిస్తున్నారు. ఈ సందర్భంగా మధుర శ్రీధర్ తో ఈ వారం ఇంటర్వూ.

సినిమాలంటే మీకెందుకంత పిచ్చి?
నిజమే..పిచ్చే..ఇది ఇవాల్టి నిన్నటి వ్వవహారం కాదు. ఆరో తరగతి నాటిది..
నిజంగా..
అవును..బంతీ చేమంతీ..ముద్దాడు కున్నాయి. అంటూ తెరపై పాట చూసిన నాటిది..ఎప్పటికైనా సినిమా కు డైరక్షన్ చేసేయాలన్నంత కసి అప్పుడే పడిపోయింది. ఆ తరువాత శివ..తెలుగునాట, చొక్కాకు బొత్తాలు కూడా సరిగ్గా లేని వాడు కూడా సినిమా పై పిచ్చి ప్రేమను పెంచుకునేలా చేసిన సినిమా. నాలో సినిమా పట్ల పిచ్చిని మరింత పెంచేసిన సినిమా.

అందుకనేనా..ఐఐటి స్టూడెంట్ అయి వుండీ, అన్ని కంపెనీల్లో, అంత చక్కని ఉద్యోగాలు వదిలేసి మరీ ఇక్కడికి వచ్చారు?
అవును..విప్రో, ఇన్ఫోసిస్ ఇలా టాప్ కంపెనీలన్నింటిలో పనిచేసా..వదిలేసే నాటికే నా జీతం లక్షల్లోవుంది. అయినా ఇటే నా పయనం.
నిజానికి ఇక్కడంతా టెన్షన్లే కదా..అక్కడున్నంత హాయి ఇక్కడ వుండదు కదా..
నిజమే..కానీ ఇది ఓ ప్రపంచం. దీన్ని ఇష్టపడడం ప్రారంభించాక మరేదీ నచ్చదు..నాకైనా..మరెవరికైనా.

ఇప్పటిదాకా ఎలా వుంది పయనం?
ఏదీ..అలా అలా పడుతూ లేస్తూ సాగుతోంది. ఎప్పటికైనా ఇక్కడ పదుగురి మదిలో నిలిచిపోయే..హిట్...చెప్పుకునే రేంజ్ సినిమా ఒకటి తీయాలి.

మాయ...అలాంటి సినిమా అవుతుందా? అందునా మీరు తొలిసారి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు?
అయ్యే అవకాశం వున్న సినిమానే. వైవిధ్యమైన విషయం. సత్తా వున్న దర్శకుడు. నిర్మాణంలో కూడా రాజీపడలేదు.

ఈ సినిమా కోసం మీ సినిమా పక్కన పెట్టినట్లున్నారు. పైగా మాయ సినిమా కాస్త లేట్ అయినట్లుంది?
సిజి వర్క్ వల్ల కాస్త ఆలస్యం. అయినా, లేడీస్ అండ్ జంటిల్ మన్ కూడా రెడీ అయిపోతోంది.

లేడీస్ అండ్ జంటిల్ మన్ కోసం చేసిన ప్రోమో సాంగ్ కు మాంచి పాపులారిటీ వచ్చినట్లుంది?
నిజమే..సినిమా కూడా ఇంతవరకు టచ్ చేయనిలైన్..సొషల్ నెట్ వర్క్ ల నేపథ్యంలో సాగే కథ.

ఆ సాంగ్ ప్రభావంతోనేనా, మాయకు కూడా థోతీ సాంగ్ చేసారు? కానీ అంతగా అతికినట్లు లేదు?
అంతకన్నా ఏం చేయాలి? మాయ సబ్జెక్ట్ వేరు..ఆ జోనర్ వేరు. అందులోంచి ప్రోమో కోసం ఏదీ తీయలేం..చేయలేం. కానీ సినిమాకు ప్రచారం అయితే అవసరం కదా..ఏదో ఒకటి చేయాలి. పైగా నటీనటులను జనాలకు దగ్గర చేయాలి. అందుకే ఆలోచించి థోతీ సాంగ్ చేసాం. మీరన్నట్లు సినిమాకు సంబందం లేకున్నా, పాటయితే ఇంటర్నెట్లో బాగానే జనాలకు చేరువయింది. సినిమాకు రాబట్టాల్సిన పబ్లిసిటీ రాబట్టింది.

సినిమాలతో పాటు మీడియా పై దృష్టిపెట్టారు కదా..సినిమా పత్రిక కొన్నాళ్లు రన్ చేసారు..ఎందుకు వదిలేసారు?
అది స్నేహితుల సరదాతో తీసుకున్నాను. కానీ అది నాకు వీలయ్యేది కాదని వదిలేసాను.నిజానికి మీడియా అంతా నాకు ఫ్రెండ్స్ వున్నారు. కానీ నా గమ్యంవేరు..సినిమా ..సినిమా అదే నా లక్ష్యం.ఆర్జీవీ అంటే మీకు మరీ అంత ప్రేమా..ప్రతీదీ బాగానేవుందంటారు..దొంగల ముఠా, ఐస్ క్రీమ్ తో సహా. చాలా మంది పొరపాటు పడుతున్నారు. నేను ట్వీట్ చేసింది శివ, దొంగల ముఠా, ఐస్ క్రీమ్ తెలుగు సినిమాలను సాంకేతికంగా మలుపు తిప్పిన సినిమాలు అని. స్టడీ కామ్, 5డి, ఇప్పుడు ఇప్పుడు ఫ్లో కామ్..ఈ మూడూ సినిమాలను సాంకేతికంగా మార్చిన సంగతులు కాదని ఎవరూ అనలేరు కదా.

ఆర్జీవీ చెప్పిన కోపరేటివ్ పద్దతిలో మీరూ సినిమాలు తీస్తారా?
ఇప్పటిదాకా నేను ఈ రంగంలో నిల్చున్నానంటే నా స్నేహితులు, సన్నిహితుల కోపరేట్ చేయబట్టి...కోపరేషన్ అందించబట్టే కదా..అందువల్ల నేను ఇప్పటికే ఆ ట్రాక్ లో వున్నట్లే?

మాయ ఎలా వుంటుంది?
ఇదో సైంటిఫిక్ థ్రిల్లర్. అలా అని మరీ అర్థం కాని వ్యవహారాలేమీ వుండవు. చాలా ఆసక్తికరంగా సాగుతాయి..కథ కథనాలు.

సినిమా బడ్జెట్ ఓకెనా?
నేను అనుకున్న రేంజ్ లోనే తీయగలిగాను..అందువల్ల పెద్దగా రిస్క్ ఏమీలేదు. మంచి విజయం సాధిస్తామన్న నమ్మకం వుంది.

ఆల్ ది బెస్ట్
థాంక్యూ

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
Maaya Telugu Movie Review