Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
young tiger NTR  rabhasa on august 15th

ఈ సంచికలో >> సినిమా >>

ఆమెకు కోటిన్నర పలుకుతోందా?

her worth 1.5 crore?

హీరోయిన్‌ త్రిషకి పెద్దగా అవకాశాల్లేవిప్పుడు. తమిళంలోనూ, తెలుగులోనూ అగ్రహీరోలతో నటించిన త్రిష ఒకానొక దశలో కోటి రూపాయల పారితోషికం అందుకుంది. ఓ తెలుగు సినిమా కోసం ఆమెకు కోటిన్నర ఇచ్చారనే ప్రచారం కూడా కొన్నేళ్ళ క్రితం జరిగిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు త్రిష కెరీర్‌ గొప్పగా ఏం లేదుగానీ, ఆమె కోటిన్నర డిమాండ్‌ చేస్తోందని చెన్నయ్‌ సినీ వర్గాలంటున్నాయి.

ఓ సినిమా కోసం నిర్మాత త్రిషను సంప్రదిస్తే కోటిన్నర తన రెమ్యునరేషన్‌ అని చెప్పిందట ఆమె. దాంతో అవాక్కయిన నిర్మాత, అంత చెల్లించుకోలేను అని చెప్పేసరికి, కోటి పాతిక అయితే చేస్తానని త్రిష కొంచెం దిగొచ్చిందట. అది కూడా ఎక్కువేనని భావించిన ఆ నిర్మాత, త్రిషకి దూరంగా వెళ్ళాపోయాడంట.

హిందీ సినిమాలో అవకాశం రావడంతోనే ఎగిరి గంతేసి, అప్పటిదాకా దక్షిణాదిలో ఉన్న అవకాశాల్ని పక్కన పెట్టడం వల్ల త్రిష కెరీర్‌ ఇఫ్పుడిలా డీలా పడిరదని చెప్పుకుంటున్నారు తెలుగు, తమిళ సినీ వర్గాల్లో. సినిమాలు పెద్దగా లేకున్నా నయనతార రేటు మాత్రం కోటిన్నర పలుకుతోంది. ఆమె సెలక్టివ్‌గా సినిమాలు చేయడం, ఆ సినిమాలు విడుదలకు ముందు బిజినెస్‌ బాగా అవుతుండడం వల్లనే ఆమెకు ఆ రేటు అట. త్రిష అలా కాదు కదా.

మరిన్ని సినిమా కబుర్లు
varma internet bussines