Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
varma internet bussines

ఈ సంచికలో >> సినిమా >>

హరీష్‌తో పవన్‌కి ‘లెక్క’ కుదిరిందా?

deal settled between harish and pawan

‘నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది..’ పవన్‌కళ్యాణ్‌తో సూపర్బ్‌ డైలాగ్‌ పలికించిన హరీష్‌ శంకర్‌కి మరో సూపర్బ్‌ అవకాశం పవన్‌కళ్యాణ్‌ ఇచ్చాడనే వార్త పవన్‌ అభిమానుల్లోనూ సంతోషం నింపింది. బాక్సాఫీస్‌కి దిమ్మ తిరిగే హిట్‌ తమ అభిమాన నటుడు ఎప్పుడు ఇస్తాడు? అని ఎదురుచూసిన అభిమానులకి ‘గబ్బర్‌సింగ్‌’ రూపంలో ఆ పండుగ ఎదురైందంటే ఆ క్రెడిట్‌లో చాలావరకు హరీష్‌ శంకర్‌కీ దక్కుతుంది.

‘గబ్బర్‌సింగ్‌’ సినిమాతో దర్శకుడిగా తన రేంజ్‌ పెంచుకున్న హరీష్‌ శంకర్‌కీ, ఆ సినిమాలో హీరోగా నటించిన పవన్‌కళ్యాణ్‌కీ లెక్క సరిగ్గా కుదిరినట్టుంది. అందుకే సంపత్‌ నందితో చేయాలనుకున్న ‘గబ్బర్‌సింగ్‌`2’ సినిమాని పవన్‌, హరీష్‌ చేతిలో పెట్టాడని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. ‘రచ్చ’ సినిమాతో కమర్షియల్‌ డైరెక్టర్‌గా తన టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకున్న సంపత్‌ నందికి ఇది నిరాశ కలిగించే వార్త అని చెప్పాల్సి ఉంటుంది.

అయితే ఇప్పటివరకూ ‘గబ్బర్‌సింగ్‌`2’ సినిమాకి దర్శకుడు సంపత్‌ నంది కాదు అని అధికారిక ప్రకటన రాలేదు. హరీష్‌ శంకర్‌ చేయొచ్చన్న సంకేతాలూ చిత్ర యూనిట్‌ నుంచి రాలేదు. దాంతో పవన్‌కీ హరీష్‌కీ లెక్క కుదిరి ‘గబ్బర్‌సింగ్‌`2’ ప్రాజెక్ట్‌ చేతులు మారింది అని ఖచ్చితంగా చెప్పజాలమన్నమాట.

మరిన్ని సినిమా కబుర్లు
politics? movies? confused...