Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
master blaster & master beauty will attend PVP square inauguration

ఈ సంచికలో >> సినిమా >>

ప్రామిసింగ్‌ ‘అనుక్షణం’

promising anukshanam

విష్ణు హీరోగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ ‘అనుక్షణం’ అనే సినిమా రూపొందిస్తున్నారు. నాలుగైదు టైటిల్స్‌ పరిశీలించిన అనంతరం ‘అనుక్షణం’ టైటిల్‌నే ఫైనల్‌ చేశారు. ‘అమ్మాయిలూ జాగ్రత్త’ అనే క్యాప్షన్‌ కూడా పెట్టారు. ‘హైద్రాబాద్‌ ప్రజలు గ్యాంగ్‌స్టర్లకీ, టెర్రిస్టులకీ భయపడలేదుగానీ ఓ క్యాబ్‌ డ్రైవర్‌ అంటే హడలిపోతున్నారు’ అంటూ ట్రైలర్‌లోనే సినిమాపై ఆసక్తి రేకెత్తించారు.

ట్రైలర్‌ చూశాక సినిమాపై వర్మ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ట్రైలర్‌ని అద్భుతంగా రూపొందించారంటే, సినిమా ఇంకా అద్భుతంగా ఉండే ఉంటుందని సినిమా వర్గాల్లోనూ చర్చించుకుంటున్నారు. ట్రైలర్‌ టాక్‌ని బట్టి సినిమా ప్రామిసింగ్‌గా ఉంటుందనే అభిప్రాయం సినీ అభిమానుల్లో కలగజేయడంలో సఫలమయ్యారు వర్మ.

మంచు ఫ్యామిలీ హీరోలతో ఇదివరకే వర్మ ‘రౌడీ’ అనే సినిమా తీశారు. అందులో మోహన్‌బాబు, విష్ణు నటించారు. ఈ ‘అనుక్షణం’లో విష్ణు మాత్రమే నటిస్తున్నాడు. విష్ణు గెటప్‌ని కూడా డిఫరెంట్‌గా దర్శకుడు తీర్చిదిద్దాడు. ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తి పెంచిన వర్మ, సినిమాతో ఎలాంటి సంచలనాలకు తెరలేపుతాడో.

మరిన్ని సినిమా కబుర్లు
pathashaala will release on october 2nd