Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
our upcoming movie going to auction - Ram Gopal Varma

ఈ సంచికలో >> సినిమా >>

ఆగస్ట్ 15న యంగ్ టైగర్ ఎన్ టీఆర్ రభస

young tiger NTR  rabhasa on august 15th

యంగ్ టైగర్ యన్టీఆర్ కథానాయకుడిగా ’కందిరీగ ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రభస. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని ఆగస్ట్ 15న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో జరగనుంది.
ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, మా "రభస" చిత్రం ఆడియోను సినీ ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో ఆగస్ట్ 15న శిల్పకళావేదికలో చాలా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యబోతున్నాం. థమన్ సారథ్యంలో అన్ని పాటలూ చాలా ఎక్స్ లెంట్ గా వచ్చాయి. ఎన్టీఆర్, థమన్ కాంబినేషన్ లో ’రభస’ మరో మ్యూజికల్ హిట్ అవుతుంది. అలాగే, ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. యాక్షన్ ఎన్టర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రమ్ మా బేనర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది." అన్నారు.

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ "యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న మా ’రభస’ చిత్రం లో ఎన్టీఆర్ ను కొత్త డైమెన్షన్ లో ప్రజెంట్ చెయ్యబోతున్నాం. ఎన్టీఆర్ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయి. థమన్ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మ్యూజికల్ గా కూడా ఈ చిత్రం చాలా హైలెవల్ లో ఉంటుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాట పాడడం ఓ హైలైట్ అని చెప్పవచ్చు. ఆగస్ట్ 15న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విశేషంగా అలరిస్తుంది." అన్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మానందం, ఆలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాష్ రెడ్డి, షాయాజీషిండే, అజయ్, నాగినీడు, శ్రావణ్, భరత్, రవిప్రకాష్, ప్రభాకర్, సురేఖావాణి, ప్రగతి, సత్యకష్ణ, మీనా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్.థమన్. ఫోటోగ్రఫీ: శ్యాంనాయుడు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్: రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, శేఖర్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, విజయ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్. వెంకటరత్నం (వెంకట్), సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వమ్ : సంతోష్ శ్రీనివాస్.

మరిన్ని సినిమా కబుర్లు
her worth 1.5 crore?