Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with  madhura sridhar

ఈ సంచికలో >> సినిమా >>

'మాయ' చిత్ర సమీక్ష

Maaya Telugu Movie Review

చిత్రం: మాయ
తారాగణం: హర్షవర్ధన్‌ రాణే, అవంతిక, సుష్మా రాజ్‌, నందిని రాయ్‌, నాగబాబు, అనితా చౌదరి, వేణు తదితరులు
ఛాయాగ్రహణం: బాల్‌ రెడ్డి
సంగీతం: శేఖర్‌ చంద్ర
నిర్మాణం: షిర్డీ సాయి కంబైన్స్‌
దర్శకత్వం: నీలకంఠ
నిర్మాతలు: మధుర శ్రీధర్‌రెడ్డి, ఎం.వి.కె. రెడ్డి
విడుదల తేదీ: 1 ఆగస్ట్‌ 2014

కుప్తంగా చెప్పాలంటే

జరగబోయేది ముందే తెలిసిపోతుంటుంది మేఘన (అవంతిక) అనే అమ్మాయికి. అలా తన తల్లి మరణం గురించి ముందే తెలుసుకుంటుందామె. దాంతోపాటు మరో ఘటన కూడా అలానే జరుగుతుంది. ఇదిలా ఉండగానే ఫేమస్‌ డిజైనర్‌ సిద్దార్ధ (హర్షవర్ధన్‌)తో పరిచయం ఏర్పడుతుంది మేఘనకి. మేఘన, సిద్దార్ధ ప్రేమలో పడతారు. అయితే తన స్నేహితురాలు (పూజ) గురించి ఓ విషయం తెలుస్తుంది మేఘనకి. అది ఏంటి? పూజకి ఏమయ్యింది? జరగబోయేది ముందే తెలిసిపోవడం వల్ల మేఘన ఎలాంటి మానసిక వేదన అనుభవిస్తుంది? మేఘన ` సిద్దార్ధ ఒక్కటయ్యారా? మేఘనకు సిద్దార్ధ ఎలా చేదోడువాదోడుగా నిలుస్తాడు? అనే అంశాలు తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే

హర్షవర్ధన్‌రాణే తెరపై మంచి స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో కన్పించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మంచి ఫిజిక్‌తో, నటనతో ఆకట్టుకుంటాడు. నటుడిగా మంచి మార్కులేయించుకున్నాడు. అవంతిక క్యూట్‌గా వుంది. నటన పరంగానూ ఆమెకు మంచి మార్కులే పడతాయి. పాత్రకు తగ్గట్టుగా హావభావాలు ప్రదర్శించింది.

సుష్మా రాజ్‌ హాట్‌గా కనిపించింది. సినిమాలో కొన్నిసార్లు అనుష్కను గుర్తుకు తెస్తుంది. నందిని రాయ్‌ ఓకే. నాగబాబు, అనితా చౌదరి తదితరులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. వేణు నవ్వులు పండిరచాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర నటించారు.

మ్యూజిక్‌ బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. కాస్ట్యూమ్స్‌ బావున్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా వుంది. డైలాగ్స్‌ బావున్నాయి. ఆసక్తికరమైన స్టోరీ లైన్‌కి తగ్గట్టుగా మంచి స్క్రీన్‌ప్లే అందించడంతో సినిమా వేగంగా సాగిపోతుంది. షార్ప్‌ ఎడిటింగ్‌ కూడా సినిమా వేగంగా నడవడానికి కారణంగా చెప్పవచ్చు. ప్రెజెంటేషన్‌, నెరేషన్‌ బావున్నాయి. అవసరమైనంతమేర ఖర్చు చేయడంతో సినిమా కూడా రిచ్‌గా తెరకెక్కింది.

జరగబోయేది ముందే తెలిసిపోతే.. అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి హాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ. ఆ సినిమాలతో పోలిక రాకుండా, దర్శకుడు సినిమాని మలచిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్టాఫ్‌ సోసోగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సినిమాపై నమ్మకాన్ని పెంచుతుంది. సెకెండాఫ్‌ నుంచి సినిమాలో ప్రేక్షకులు లీనమైపోతారు. సినిమాకి కావాల్సినంత పేస్‌ సెకెండాఫ్‌లో కొనసాగింది. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందే సినిమాల్ని ఇష్టపడేవారికి మంచి ఫీస్ట్‌ ఈ సినిమా అవుతుందనడం నిస్సందేహం. అర్బన్‌ ఆడియన్స్‌ని కట్టిపడేసే లక్షణాలున్నాయి సినిమాకి. ఓవరాల్‌గా సినిమా చూసేవారికి మంచి అనుభూతిని  పమిగుల్చుతుంది.

 ఒక్క  మాటలో చెప్పాలంటే: మాయ.. ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka