Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Maharshi Chalam

ఈ సంచికలో >> శీర్షికలు >>

జాతకచక్రం (మే 25 నుండి 31 వరకు) - శ్రీ నంద

'గోతెలుగు.కామ్' పాఠకుల ప్రశ్నలకు శ్రీ నంద గారు సమాధానాలిస్తారు. మీ యొక్క ప్రశ్నలను(ఒక్కటి మాత్రమే) మీ పేరు, పుట్టిన తేది, సమయం, పుట్టిన ఊరు జతచేసి 'goteluguastro@gmail.com ' కి పంపగలరు. 
 


నేను 30-5-1984 న జన్మించాను. నా పూర్తి జాతకమును తెలుపగలరు - ఏలూరి సుజాత, పిడుగురాళ్ళ
ఏలూరి సుజాత మీరు జన్మసమయం వ్రాయలేదు కావున న్యూమరాలజీ ప్రకారం తెలుపుతున్నాను. మీరు రెండురకాలైన విధానాలను కలిగి ఉండటం చేత సమస్యలు కలుగుతున్నవి. ఒకే నిర్ణయం పైన ఉండటంలో ఇబ్బందులు పడుతారు. మీయొక్క పేరులో ఒక  "A" అనే అక్షరాన్ని పేరుచివర్లో పెట్టుకోండి తద్వార మీ యొక్క ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఎక్కడ ఐన సరే పేరును SUJATHAA అనే వాడండి. 2014 వ సంవత్సరం మీకు అనుకూలమైన కాలం కాబట్టి సరైన ప్రణాలికా ప్రకారం వెళ్ళండి. ఏదైనా పనిని ఆరంభించాలంటే 3, 21, 30, 12, 24, 15, 6 లలో ఆరంభించండి మేలుజరుగుతుంది. దైవకార్యములలో పాల్గొనుట మంచిది. గట్టిగా ప్రయత్నం చేయండి మీరు అనుకున్న పనులు సాగుతాయి. ప్రస్థుతం మీరు చేపట్టిన పనులలో ఇబ్బందులు కలుగుట చేత సమస్యలను ఎదుర్కొంటారు. స్వతంత్రభావాలు కలిగి ఉంటారు. కష్టాన్ని అలవాటు చేసుకోండి విజయాలను సాదించగలుగుతారు. గొంతు,శ్వాసకు సంభందించిన అనారోగ్య సమస్యలు భాదించుటకు అవకాశం కలదు జాగ్రత్త. కొంత గర్వాన్ని కలిగి ఉంటారు అదుపులో ఉంచుకొనుట మంచిది. దుర్గాదేవికి పూజలు చేయుట, తరుచు రుద్రాభిషేకం చేయుట మూలన మేలుజరుగుతుంది.

నాకు  ఉద్యోగం ఎప్పుడు రావొచ్చు మరియు పెళ్లి ఎప్పుడు జరుగును - శివ కుమార్, మంచిర్యాల
శివకుమార్ గారు మీరు ఆరుద్రానక్షత్రం,మిథునరాశిలో జన్మించారు. ప్రస్తుతం మీకు గురుమహర్దశ,గురుమహర్దశలో శుక్ర అంతర్దశ నడుస్తుంది. గత రెండు సంవత్సరాలుగా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నవి. మీయొక్క ఆలోచనలకు బాగా ప్రాముఖ్యతను ఇస్తారు. గత కొంతకాలంగా ఖర్చులు బాగా అవుతాయి. కుటుంభంలో మార్పులు జరిగి ఉంటవి. లగ్నాదిపతి లగ్నంలో ఉండటం చేత మీరు ఇతరులలో మంచి గుర్తింపును కలిగి ఉంటారు. అందంగా ఉంటారు కూడా. 2015 ఆగస్ట్ వరకు మీకు గురులో శుక్ర అంతర్దశ ఈ సంశయం కాస్తా జాగ్రత్తగా ఉండాలి అలాగే కష్టపడితే గాని ఉద్యోగం రాదు వచ్చిన ఉద్యోగంతో అడ్జెస్ట్ కండి. 2015 ఆగష్టు తర్వాత గురులో రవి అంతర్దశలో మీకు అనుకూలమైన కాలం. మీరు జూన్ లో ప్రయత్నం చేయండి ఉద్యోగ అవకాశాలు కలవు. వివాహం మాత్రం 2013 సెప్టెంబర్ నుండి డిసెంబర్ లోపు అయ్యే అవకాశాలు కలవు. మీకు ఆశించిన ఫలితాలు రావడానికి లక్ష్మీదేవికి అభిషేకాలు చేయడం మంచిది. వరుసగా 16 గురువారాలు శివాలయం వెళ్ళండి 16 ప్రదక్షణలు చేయండి. మీ ఆలోచనల్లో కొంత అశ్రద్ద ఉండేఅవకాశం కలదు. పెద్దల సూచనలు పాటించుట మంచిది. శనికి నువ్వులు దానం చేయుట 19000 జపాలు చేయడం మంచిది.

నా యెక్క పూర్తి జాతకం ను నిర్మొహమాటం గా చెప్పగలరు - లక్ష్మీనరసింహారావు, కందుకూరు
లక్ష్మీనరసింహారావు గారు మీరు భరణినక్షత్రం,మేషరాశికి సంభందించిన వారు. మీయొక్క ఆలోచనలు పైకి గంభీరంగానే ఉన్నను లోపల భయాన్ని కలిగి ఉంటారు. మీరు తప్పక చేయాలి అనుకున్న పనులను ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నా పూర్తిచేస్తారు. మీయొక్క మతాతీరు అవతలివారిని ఇబ్బంది పెట్టేదిగా ఉండుటకు అవకాశం కలదు అనగా గంభీరంగా ఉంటుంది.మీది మీతాత తరంలో పెద్దకుటుంభం అయినాను ప్రస్తుతం చిన్న కుటుంభం అనిచెప్పుకొవచును. స్వల్పంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య విషయంలో తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనప్రమాదాలు లేదా శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కలదు. ప్రస్తుతం మీకు రాహుమహర్దశ లో బుధ అంతర్దశ జరుగుతున్నది,చేపట్టే పనులు బాగనే సాగుతున్నప్పటికిని కొన్ని విషయాల్లో మీ ఆలోచనల మూలాన వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం కలదు. సెప్టెంబర్ 2014 వరకు బుధ అంతర్దశ ఉంటుంది. తదుపరి కేతు అంతర్దశ. 2013 జూన్ నుండి ఆగష్టు వరకు వాహనముల విషయంలో లేదా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉనదని. ప్రమాదకరమైన వస్తువులతో పనిచేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండటం మంచిది. మీకు వ్యాపారం పనికి రాదు నష్టాన్ని చవిచూస్తారు కావున ఉద్యోగం చేయడం మంచిది. శ్రమిస్తే మంచిఫలితాలను పొందుటకు అవకాశం కలదు. ఖరీదైన ఆలోచనలు చేయకండి అందరితోను మంచిగా ఉండటం సూచన. పంచమ సప్తమాదిపతుల మధ్య పరివర్తన యోగం ఉంది మీ ఆలోచనలు చక్కగా ఉంటే సమాజంలో మంచి ఫలితాలు పొందుతారు. ఒకసారి లక్ష్మీనరసింహాస్వామికి పూజ చేయండి. తరచు మంగలవారాలు హనుమాన్ ఆలయం వెళ్ళడం మేలు చేస్తుంది. ఒక సారిలి 1.25  kg కందులు అలాగే ఎర్రరవిక బట్టను దానం ఇవ్వండి.

నా జాతకం ఎలాగ ఉండునో తెలుపగలరు - వీరాస్వామి, వినుకొండ
వీరాస్వామిగారు మీరు ఉత్తరాషాడ నక్షత్రం మకరరాశికి చెందినవారు. ప్రస్తుతం రాహుమహర్దశ నడుస్తుంది,రాహులో ఖుజ అంతర్దశ నడుస్తుంది. 2013 అక్టోబర్ వరకు ఉంది. తదుపరి గురుమహర్దశ బాగానే ఉంటుంది. అనుకోనివిధంగా కలిసి వస్తుంది. మీకు మంచితనం ఇతరులకు సేవచేయాలన్న ఆలోచన ఉంటుంది. కాకపోతే కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మూలాన మంచి జరుగుతుంది. కుటుంబంలో ఖర్చులు బాగా ఉంటవి. సంపాదన కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరపు ఖర్చులు తగ్గించుకొనుట మేలు. మీయొక్క మాటను అందరు వినాలన్న తలంపును కలిగి ఉంటారు. పనుల విషయంలో ఆరంభంలో ఉన్నా శ్రద్ద చివరివరకు ఉండకపోవచ్చును. పట్టుదలతో పనులను చేయండి మంహి ఫలితాలను పొందుతారు. రవి బుదుల మధ్య పరివర్తన యోగం ఉంది కుటుంభంలో మంచి ఆలోచనలు చేయండి ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రస్తుతం ఒక మూడు మంగళవారాలు సుబ్రమణ్య అభిషేకం చేయడం మేలు జరుగుతుంది. 2013 అక్టోబర్ నుండి మీకు వీలై నప్పుడు ఆసుపత్రుల్లో సేవాకార్యక్రమాలు చేయడం మేలు చేస్తుంది. తప్పక లాభాలను పొందుతారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయం వెళ్ళడం అలవాటుగా చేసుకోండి.

నా యెక్క పూర్తి జాతకం ను నిర్మొహమాటం గా చెప్పగలరు. విధుమౌళి, సిద్ధిపేట
మౌళిమీరు పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశికి సంభందించిన వారు ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తుంది. మీకు కాలసర్పయోగం ఉంది ఒకసారి వెంటనే శ్రీకాళహస్తికి వెళ్ళిరండి అక్కడ రాహుకేతువులకు పూజచేయండి. అలాగే సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు రహుకేతువులకు పూజలు చేయించుకొనుట మంచిది. మీకు ఎ  పనైనా సరే కొంత ఆలస్యంగా జారుగుతుంది కావున వెంటనే ఫలితాలను ఆశించకండి. వ్యాపరంలో రాణింపు ఉంటుంది కాకపోతే డిసెంబర్ 2013 వరకు పెద్దగా అనుకూలైన కాలం కాదు కావున ఓపికతో ఉండాలి. 2014 జనవరి నుండి బాగుంది ఉద్యోగంలో లేదా వ్యాపరంలో రాణింపు ఉంటుంది. ఇనుము,సిమెంట్,మేనేజ్మెంట్ రంగాలు కలిసివస్థాయి. వరుసగా 7 మంగలవారాలు హనుమాన్ ఆలయం వెళ్ళండి 7 ప్రదక్షణలు చేయండి. చివరి మంగళవారం ఆకుపూజ చేయండి మంచిది. కోపాన్ని తగ్గించుకొనుట వివదములకు దూరంగా ఉండటం సూచన. వాహనముల విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు అయ్యే అవకాశం కలదు. 2014 నుండి బాగుంటుంది. శత్రువుల పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

నా యెక్క పూర్తి జాతకం ను చెప్పండి - నాగరాజు, ఒంగోలు
నాగరాజు మీరు పుష్యమి నక్షత్రం కర్కాటకరాశిలో జన్మించారు. ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తుంది. మీరు చాలావరకు ఇతరుల పైన ఆదారపాడుతారు. తల్లి మాటను బాగా విను అవకాశం కలదు. అంతర్గతంగా ఏదో తెలియని భయం ఉంటుంది భయటకు మాత్రం దైర్యంగా కనభడుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటవి అనుకోని సంఘటనలు జరుగుటకు అవకాశం కలదు. మీరు ఆశించిన ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయి. జాగ్రత్తగా ఆలోచించి పనులు చేపట్టాలి. ఆర్థికంగా బాగానే ఉంటుంది కాకపోతే సంతృప్తి ఉండకపోవచ్చును. 2014 మార్చ్ నుండి ఆర్థికంగా బాగాఉంటుంది. అభివృద్ధి అవకాశాలు కలవు శ్రమించుట చేత లాభాలను పొందుటకు అవకాశం కలదు.  2014 జూన్ తర్వాత వివాహం అయ్యే అవకాశాలు బాగున్నవి. 2014 జూన్ నుండి బుధలో శని అంతర్దశ ప్రారంభమవుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి చక్కటి ప్రణాలికను ఏర్పరుచుకుంటే సొంతఇంటి అవకాశాలు కలవు ప్రయత్నించుట మేలు. కాకపోతే శ్రమను బాగా పొందుతారు. మీరు పెసర్లు 1.25 kg లు దానం ఇచ్చుట ప్రతిరోజు విష్ణుసహస్ర నామం చదవండి. తరచు గణపతికి అభిషేకాలు చేయండి మంచిది.

నా యెక్క భవిష్యత్తు గురించి తెలుపగలరు - వేదవ్యాస్, కల్వకుర్తి
వేదవ్యాస్ మీరు పూర్వాషాడ నక్షత్రం, ధనుస్సు రాశిలో జన్మించారు. చాల విషయాల్లో మంహ్చి ఆలోచనలు చేస్తారు కాకపోతే మొదట కొన్ని సార్లు నిగిటివ్ ఆలోచనలతో కాదు అని మొదలు పెడతారు అలా చేయకండి. ఆత్మన్యున్యతా భావం ఉండే అవకాశం కలదు యోగ, ధ్యానం చేయుట మూలాన మేలుజరుగుతుంది. పనులను చేపట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయుట ఉత్తమం. ప్రభుత్వరంగంలో బాగా రాణిస్తారు ప్రభుత్వఉద్యోగంలో  అవకాశాలు కూడా బాగున్నవి. కాంపిటేషన్ రంగంలో బాగా రాణిస్తారు. గ్రహాలన్నీ తక్కువ గళ్ళలో ఉన్నవి ఎలా ఉండడం కూడా చాల మంచిది యోగంగా చెప్పుకోవచ్చును. ద్వితియంలో నీచభంగరాజయోగం ఉంది. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా సంపాదన బాగానే ఉంటుంది. ఏదైనా ఆస్తులను కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులు చేయాలి. వాహనప్రమాదాలు జరుగుటకు అవకాశాలు కలవు జాగ్రత్తగా ఉండటం మంచిది. గొంతుకి లేదా తొడలకు సంభందించిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. జూలై 2013 నుండి బాగుంటుంది. ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండటం సూచన ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు. శనివారాలు శనికి ప్రదక్షణలు చేయుట శనికి 1. 25kg నల్లనువ్వులు దానం ఇచ్చుట చేయండి. దుర్గాదేవికి కుంకుమ అర్చన చేయండి మేలు జరుగుతుంది.  
 

వార ఫలాలు (మే 25  - మే 31)

 


మేష రాశి
ఈవారం ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఒడిదుడుకులు తప్పకపోవచ్చును. వారం ఆరంభంలో బాగున్న మధ్యలో ఇబ్బందులు కలుగుతాయి. మీయొక్క ఆలోచనల్లో పరిణతి అవసరం. వ్యతిరేక వర్గానికి పైచేయిసాదించే అవకాశం ఇవ్వకండి. చాలావరకు మానసికంగా ఆలోచించ వలసి రావోచ్చును. ప్రతికూలమైన వాతావరణం ఏర్పడు సూచనలు కలవు. ఆ కారణంచేత అనారోగ్య సమస్యలు తలెత్తు సూచనలు ఉన్నవి, జాగ్రత్త వహించండి. సరైన సమయానికి భోజనం చేయడం, మితంగా భుజించుట శుభ్రమైన ఆహారాన్ని తీసుకొనుట సూచన. వారం ఆరంభం నుంచి మధ్యవరకు వివిధ కారణముల చేత ఖర్చులు పెరిగినను వారం చివర్లో అధికారుల మన్ననలను పొందుట అలాగే కొద్దిగా ధనలాభం కలుగుట చేత ఊరట పొందుతారు. వ్యాపారస్థులు నూతన నిర్ణయాలను చాలావరకు తీసుకోకపోవడం అనేది సూచన శ్రమను కలిగి ఉంటారు కొన్నివిషయాల్లో మాటలను పొదుపుగా వాడండి. కుటుంభసభ్యులతో చాలావరకు నిదానంగా వ్యవహరించండి. సర్దుబాటుగా ఉండటం అనేది మేలుచేస్తుంది. గట్టిగా శ్రద్ధతో పనిచేస్తేనే ఫలితాలు వచ్చుటకు అవకాశం కలదు. అనుకున్న పనులను పూర్తిచేయుటకు కొంత అధికమైన శ్రమను చేయాలి. దూరప్రదేశాలకు అనుకూలమైన కాలంగానే చెప్పుకోవచ్చును. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. మరిన్ని మంచి ఫలితాల కోసం దుర్గాదేవి స్తోత్రం చదవడం అలాగే ప్రతిరోజు దేవాలయాన్ని సందర్సించుట, విష్ణుసహస్రనామం చదవండి.

వృషభ రాశి
ఈ వారం బాగానే ఆరంభమవుతుంది.  వారం ప్రారంభంలో మంచి ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. కుటుంబంలో మార్పులు కలుగుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. ధనలాభంను కలిగి ఉంటారు. మీ ఆలోచనలు ఇతరులకు ఉపయోగపడుట చేత సమాజంలో గుర్తింపును తెచ్చుకోగాలుగుతారు. సమయానికి భోజనం చేయుట అన్నది మాత్రం అవసరం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించకపోతే వారం చివరలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారం ఆరంభంలో కలిగిన అనుకూలమైన అంశాలను చివరి వరకు కొనసాగించే ప్రయత్నం చేయండి. సంచారం మాత్రం అధికంగా చేస్తారు.  ప్రయాణాల్లో మాత్రం వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించుట నిదానంగా వ్యవహరించుట సూచన. వారం ఆరంభంలో బంధువులతో మాములుగా ఉన్న చివరలో మీమధ్య సయోధ్య కుదిరే అవకాశం కలదు. నూతనంగా ఏర్పడు పరిచయాల మూలన లాభంను పొందుటకు అవకాశం కలదు. వ్యాపారస్థులు బాగాఅలొచించి ముందుకు వెళితే క్రయవిక్రయాల మూలాన లాభాన్ని పొందుతారు. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. ప్రయత్నాలలో ముందుకు వెళ్తారు. సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. మంచిపేరును కలిగి ఉంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుటకు అవకాశం కలదు. మరిన్ని ఫలితాల కోసం సుబ్రమణ్య ఆరాధన, కేతువునకు ప్రదక్షణలు చేయుట అలాగే హనుమాన్ చాలీసా పారాయణ మేలుచేస్తుంది.   

మిథున రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చును.  కాకపోతే మీయొక్క ఆలోచన విధానం కూడా ఫలితాలను నిర్దేశిస్తుంది. మాటను పొదుపుగా వాడాలి. అందరిని కలుపుకొని పనులను చేయుట మూలాన మంచిఫలితాలే కలుగుతాయి. సమాజంలో చక్కని గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేయుటకు అవకాశం కలదు. ప్రయాణాలను మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది. మీయొక్క ఆప్తులకు అనారోగ్య సూచనలు కలవు. ఈ విషయంలో కొంత బాధను పొందుటకు అవకాశం కలదు. వారం ఆరంభంలో పనులు నిదానంగా ఆరంభించి, రానురాను వేగాన్ని పెంచుట మూలాన ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు విధానాలు కలిగి ఉన్నా, ఆరోగ్యాన్ని అశ్రద్ద చేసినను ఖర్చులు పెరుగుటకు సూచనలు కలవు. వారం చివర్లో బాగానే ఉంటుంది. ధార్మిక సంభంద పనులలో పాల్గొనుట మూలాన తప్పక మేలు జరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటం అవసరం. కొత్తవారితో సమయాన్ని గడుపుతారు. కుటుంబ సౌఖ్యంను పొందుతారు. కోపాన్ని తగ్గించుకొనుట మంచిది. మంచి ఫలితాల కోసం శివాభిషేకం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం ప్రతిరోజు చదవడం, తులసి ఆరాధన మంచిది. 

కర్కాటక రాశి
ఈవారం అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. వారికి అనుగుణంగా నడుచుకొనుట మూలాన మంచి ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. రాజకీయ వ్యహరాల్లో పాల్గొంటారు. ముందుకు వెళ్ళగలరు. వారం ఆరంభంలో మాత్రం మీయొక్క మాటలను పొదుపుగా వాడండి. రాను రాను పదునైనా ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. బంధుమిత్రులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను ఆరంభిస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట మూలాన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. వ్యాపారస్థులకు బాగానే ఉంటుంది కాకపోతే వారం చివర్లో మాత్రం విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండటం, అశ్రద్ద వహించకపోవడం అనేది సూచన. భోజనసౌఖ్యాన్ని కలిగి ఉంటారు నచ్చిన ఆహారాన్ని భుజిస్తారు. కాకపోతే చక్కటి ఆహారాన్ని తీసుకొనే ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో ఖర్చులను పొందుతారు స్థానచలనంకు అవకాశం కలదు జాగ్రత్త. వారం చివరలో జాగ్రత్తగా లేకపోతే అనారోగ్య సమస్యలు కలుగుతాయి మనోవిచారంను పొందుతారు. అకారణంగా భయాన్ని పొందుతారు. ఇతరుల సహకారంతో ముందుకు వెళ్ళండి. ఉత్తమ ఫలితాలకోసం లక్ష్మీఆరాధన, గణపతికి అభిషేకం, గోవుకు పచ్చిగడ్డిని తినిపించుట మంచిది. 

సింహ రాశి
ఈవారం మంచిఫలితాలను పొందుటకు అవకాశం కలదు. సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం చేత విజయాలను సొంతం చేసుకోవచ్చును. రాజకీయ వ్యవహరాల్లో ముందుకు వెళ్తారు. మీరు ఊహించిన పనులు జరుగుతాయి. సంతోషాన్ని పొందుతారు. అధికారుల మూలన లాభాన్ని కలిగి ఉంటారు. వారికి అనుకూలంగా ఉన్నచో మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు. శరీరసౌఖ్యాన్ని పొందుతారు. మాటలను మాత్రం పొదుపుగా వాడటం అవసరం. అకారణంగా ఇతరులను నిందించకపోవడం ఉత్తమం. మానసికంగా ఆలోచనల్లో పరిణతి అవసరం. పెద్దల సూచనలు పాటించుట మరింత మంచిది. ఇష్టమైన వారిని కలుస్తారు. చెపట్టే పనులు వేగంగానే పూర్తిఅవుటకు అవకాశం ఉంది. కాని వారం మధ్యలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం సూచన. సంచారం చేయుట మూలాన అలసిపోతారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని అధిగమిస్తారు. ఆర్థికంగా లాభాలను పొందుటకు అవకాశం కలదు. చేసే పనిలో భారాన్ని మాత్రం పొందు అవకాశం కలదు. శ్రమను పొందినప్పటికిని ఫలితాలు వస్తాయి. మీయొక్క బుద్ధిబలంచేత చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. చక్కటి ఫలితాలను పొందుటకు వేంకటేశ్వరస్వామి ఆరాధన, అన్నపూర్ణాష్టకం చదవడం అలాగే లలితా అమ్మవారిని పూజించుట చేయండి.     

కన్యా రాశి
ఈవారం అన్నిపనుల్లోను జాగ్రత్తగా ఉండటం, బాగా ఆలోచించి పనులను చేపట్టడం మంచిది. ధనవ్యయాన్ని పొందుటకు అవకాశం కలదు. ఊహించిన దానికన్నా ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు. ఇష్టమైన వారిని కలుస్తారు. నూతన ఆలోచనలు చేస్తారు. కాకపోతే వాటిని అమలు చేయడానికి కొంత సమస్యం తీసుకోండి, మేలుజరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకొనుట, మాటలను జాగ్రత్తగా వాడటం సూచన. మానసికంగా ఆందోళనను కలిగి ఉంటారు. స్వల్పంగా ఆరోగ్య సమస్యలను కలిగిఉంటారు. ఒకవార్త మీలో నిరుత్సాహంను పెంచు సూచనలు కలవు జాగ్రత్త. స్థానచలనం కలిగి ఉంటారు. ప్రయాణాలు చేస్తారు కాకపోతే పెద్దగా కలిసి  రాకపోవచ్చును. మీయొక్క ఆలోచనలు ఇతరులకు నచ్చక పోవచ్చును. కుటుంబంలో నిదానంగా ఉండటం సూచన, వారు చెప్పిన ఆలోచనలను అంగీకరించే ప్రయత్నం చేయండి. భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. గృహంపైన శ్రద్ధను కనబరుస్తారు. పెద్దల సూచనలు పాటించుట మూలాన పనులు ముందుకు సాగుతాయి. నూతన వస్త్రప్రాప్తిని కలిగి ఉంటారు. మీయొక్క వ్యతిరేకవర్గం గురించిన ఆలోచనలు పెరుగుతాయి. వారి మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును నిదానంగా ఉండండి. కలహములకు దూరంగా ఉండటం నిదానంగా పనులను ముందుకు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మంచిఫలితాల కోసం దుర్గాఅష్టోత్తరం చదవడం, సుబ్రమణ్య అభిషేకం చేయుట, గోపూజ మంచిది.   

తులా రాశి
ఈ వారం మీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. శత్రువులు వృద్దిచెందుతారు. కష్టములు పెరుగుటకు అవకాశం కలదు. చేసే పనిలో సరైన ఆలోచనను కలిగిఉండండి. వారం ఆరంభంలో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అలాగే మీయొక్క మాటతీరును అదుపులో ఉంచుకోండి. ఇష్టమైన వారిని కలుస్తారు. వారం మధ్యనుండి బాగుంటుంది. ఉత్సాహంతో నూతన పనులను ఆరంభిస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి సకాలంలో పూర్తిచేస్తారు. వారంచివర్లో మీ ఆలోచనల మూలాన మానసికంగా ఆందోళనను పొందుటకు అవకాశం కలదు. ప్రయత్నాలలో స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు అదికంగా చేయుట మూలాన శారీరకంగా అలసిపోతారు. గతంలో తీసుకున్న రునముల మూలాన ఇబ్బందులను పొందుతారు. అవసరమైతేనే ప్రయాణాలు చేయుట మేలుచేస్తుంది. అసత్యప్రవర్తనను కలిగి ఉంటారు.  మీ ఆలోచనలు కొంత ఇబ్బందులు కలిగించేవిగా ఉంటవి. మీయొక్క ఆలోచనలు ఇతరులను ఇబ్బందిపెట్టేవిగా ఉంటాయి. అధికారుల మూలాన సమస్యలు పొందుతారు. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట మేలు. అందరిని కలుపుకొని వెళ్ళుట సూచన. వినోదముల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. గురుభక్తిని కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. గట్టిగా ప్రయత్నం చేయుట మూలాన పనులు ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో విరోధములు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. మరిన్ని ఫలితాల కోసం నవగ్రహాల ప్రదక్షణ చేయుట, దక్షిణామూర్తిని ఆరాధన చేయుట అలాగే ప్రతిరోజు లలితా సహస్రనామం చదవడం మంచిది.

వృశ్చిక రాశి
ఈవారం మృష్టాన్న భోజన ప్రాప్తిని కలిగి ఉంటారు.  ఉత్సాహంను కలిగి ఉండి పనులను చేపడుతారు. ఇష్టమైన వారిని కలుస్తారు. మనోదైర్యంను కలిగి ఉండి నూతన పనుల్లోముందుకు వెళ్తారు. మీకు ఆరోగ్య పరంగా బాగానే ఉంటుంది. పనుల్లో మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. ఆలోచనల్లో నిదానంగా ఉండటం సూచన. తొందరపాటు పనికి రాదు. వివాదములు కలుగుటకు అవకాశం కలదు. చేపట్టిన పనుల్లో ఉత్సాహంను అలాగే కొనసాగించుట మేలు మొదట్లో ఉన్న ఉత్సాహం చివరి వరకు కొనసాగించుట ఉత్తమం. కుటుంబంలో మీ ఆలోచనలను రుద్దకండి. అవతల వారి ఆలోచనలు వినడం మూలాన కలహములు తగ్గుటకు అవకాశం కలదు. అధికారుల మూలాన పనిభారంను పొందుటకు అవకాశం కలదు. శరీరం బలహీనపడే అవకాశం కలదు. మీ మాటల్లో అస్పష్టత ఉండుటకు అవకాశం కలదు. ఏ విషయంలో తగిన విధంగా ఉండటం మంచిది. రాజకీయ వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. నూతన ఆలోచనలు చేస్తారు. ఆదిశగా ముందుకు వెళ్తారు. అకారణంగా భయాన్ని పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. విలాసములకు అలవాటుపడే అవకాశం కలదు జాగ్రత్త. చేసేపనుల్లో శ్రమను పొందుటకు అవకాశం కలదు. బాగా ఆలోచించి పనులను చేపట్టుట సూచన. ధార్మికకార్యములలో పాల్గొంటారు. అందుచేత ప్రశాంతతను పొందుటకు అవకాశం కలదు. ఉత్తమ ఫలితాల కోసం దుర్గా ఆరాధన చేయుట, శివాభిషేకం చేయండి అలాగే ప్రతిరోజు లింగాష్టకం చదవడం మేలు.       

ధనస్సు రాశి
ఈ వారం మంచిఫలితాలను పొందుటకు అవకాశం కలదు. నూతన ఉత్సాహంను కలిగి ఉండి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లి నూతన పనులను ఆరంభిస్తారు. మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగిఉంటారు. వారం ఆరంభంలో మానసికంగా ఇబ్బందులను పొందుతారు. వారం మధ్యలో సంతోషాన్ని పొందుతారు. ఆర్థికంగా లాభాలను పొందుటకు అవకాశం కలదు. కాకపోతే మాటలను జాగ్రత్తగా వాడటం సూచన. ఇష్టమైన వారిని కలుస్తారు. ధనలాభంను పొందుతారు. నూతనవస్త్ర ప్రాప్తిని పొందుటకు అవకాశం కలదు. ఇతరులకు సేవచేయుట మూలాన పేరును, సంతృప్తిని కలిగి ఉంటారు. మీకు సంతోషాన్ని కలిగించే వార్తను పొందుటకు అవకాశం కలదు. విద్యాసంభందమైన చర్చలలో పాల్గొంటారు వినోదములలొ పాల్గొనుటకు అవకాశం కలదు. చర్చలలో పాల్గొను సమయంలో నిదానంగా ఆలోచించి వ్యవహరించుట మేలు. అధికారుల మూలాన భయాన్ని పొందుటకు అవకాశం కలదు.  కావున వారితో జాగ్రత్తగా ఉండటం సూచన. ఉద్యోగంలో నిదానంగా ఉండటం సూచన అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది. కుటుంబంలో శ్రమను పొందుతారు అకారణంగా భయాన్ని పొందుతారు. అనారోగ్యం మూలన బాధను పొందుటకు అవకాశం కలదు. ప్రయత్నకార్యములలో విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. మంచి ఫలితాల కోసం గణపతిని ఆరాధన చేయుట, నవగ్రహ ప్రదక్షణ చేయుట అలాగే హనుమాన్ పూజ చేయుట మంచిది.   

మకర రాశి
ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి చేయుపనిలో ధనవ్యయాన్ని పొందుటకు అవకాశం కలదు. చంచల మనస్సును కలిగి ఉండుట చేత సరైన నిర్ణయాలు తీసుకోవడం సూచన. వారం ఆరంభంలో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.  శ్రమను పొందుతారు. మంచి ఆలోచనలకు ప్రయత్నం చేయుట మూలాన వారం మధ్యనుంచి అనుకున్న పనులను పూర్తిచేస్తారు సంతోషాన్ని పొందుతారు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. కాకపోతే మీయొక్క మాటలను జాగ్రత్తగా వాడండి. మీకునచ్చినవారిని కలుస్తారు వారితో సమాలోచనలు చేస్తారు. సమయానికి భోజనం చేయుట మంచిది. విచారంను పొందుటకు అవకాశం కలదు. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం కలదు. చర్చలలో పాల్గొన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థికపరమైన విషయల్లో బాగానే ఉంటుంది. ధనధాన్య సంవృద్దిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో అభివృద్దిని కలిగి ఉంటారు. అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది. మీకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటారు. భోజన సౌఖ్యాని పొందుతారు. కాకపోతే నచ్చిన వారితోనే వివాదములు కలుగుటకు అవకాశం కలదు. కావున జాగ్రత్తగా ఉండండి. చేసే పనుల్లో శ్రమను కూడా పొందుటకు అవకాశం కలదు. మరిన్ని ఫలితాల కోసం రాఘవేంద్రస్వామి ఆరాధన, గోవిందనామాలు చదవండి. అలాగే గోమాతకు నమస్కారం చేయండి.     

కుంభ రాశి
ఈవారం మీరు ఇష్టమైన పనులను చేపడుతారు. ప్రయత్నాలలో ముందుకు వెళ్తారు. బంధువుల యెడల ప్రీతిని కలిగిఉంటారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. వారం చివరలో బంధువులతో ఇబ్బందులు కలుగవచ్చును, కావున నిదానంగా ఉండండి సర్దుకుపోవడం మంచిది. ఇబ్బందులను పొందినప్పటికిని సరైన ఆలోచనలు కలిగి ఉన్నచో పనులను పూర్తిచేయగలుగుతారు. అనారోగ్య సమస్యలు భాదించుటకు అవకాశం కలదు. కావున జాగ్రత్తగా ఉండటం సూచన. ధనధాన్య సంవృద్దిని కలిగి ఉంటారు. ప్రయత్నాలో తోటివారి సహాకారం చేత పనులను ముందుకు కొనసాగించగలుగుతారు. అధికారుల వలన ఇబ్బందులను పొందినప్పటికిని చివరకు మీ సరైన ఆలోచనలచేత ముందుకు కొనసాగుతారు. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట అలాగే ఫలితాలను ఆశించక పోవడం మంచిది. మీయొక్క వ్యతిరేక వర్గం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో నష్టం వచ్చుటకు అవకాశం కలదు కావున జాగ్రత్త. దైవకార్యములలో పాల్గొనుట మూలన మేలుజరుగుతుంది. పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వారితో మీయొక్క ఆలోచనలు ముందుకు సాగుతాయి. పనులు పెరుగుతాయి. వాటిని శ్రద్ధతో ఆచరించండి. ఉత్తమ ఫలితాల కోసం వేంకటేశ్వరఆరాధన, గణపతి అష్టోత్తరం చదవండి అలాగే అమ్మవారికి కుంకుమ అర్చన చేయండి. 

మీన రాశి
ఈవారం బంధుమిత్రులను కలుస్తారు. వారితో సమయాన్నిసంతోషంగా గడుపుతారు. కుటుంబంలో సంతాన సౌఖ్యంను పొందుతారు. ప్రయత్నాలలో విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. వారం ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు కలిగినను రానురాను ఇష్టమైన పనులను చేపడుతారు. భోజనసౌఖ్యాన్ని కలిగి ఉంటారు. బంధువుల గృహంలో ఉంటారు. మీకు నచ్చిన ఆహారపదార్థములను భుజిస్తారు. వారం చివర్లో కొద్దిగా మానసికంగా ఇబ్బందులను పొందుతారు. కావున పూజలలో పాల్గొనుట మూలాన మేలు జరుగుతుంది. నూతనవస్త్ర ప్రాప్తిని కలిగి ఉంటారు. ఆరోగ్యంను కలిగి ఉంటారు. అధికారుల మూలాన సమస్యలను పొందుతారు. చంచల బుద్దిని కలిగి ఉంటారు. ధనధాన్య సంవృద్దిని పొందుతారు. మాతృసౌఖ్యంను కలిగి ఉంటారు. మాతృ సంబంధ బంధువులను కలుస్తారు. కలహములకు దూరంగా ఉండటం అనేది సూచన. మీయొక్క వ్యతిరేకవర్గం నుండి సమస్యలు కలుగుతాయి. కావున నిదానంగా వారిని ఎదుర్కోండి. పెద్దల పరిచయాలను పొందుతారు. నూతన పరిచయాల మూలాన లాభంను పొందుతారు. గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. ఆకస్మిక అపాయంను పొందుటకు అవకాశం కలదు. కావున ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. మంచి ఫలితాల కోసం శివాభిషేకం చేయండి, ప్రతిరోజు విష్ణుసహస్రనామం పారాయణ చేయండి.   

మరిన్ని శీర్షికలు
Annamayya 'Pada' Seva