Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raja music muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

పవన్‌కళ్యాణ్‌ కారు సంగతి

Pawan Kalyan Car

ఖరీదైన కార్లంటే ఎవరికి మోజుండదు.? సినీ, రాజకీయ ప్రముఖులకి సరికొత్త మోడల్స్‌లో వచ్చే కొత్త కొత్త కార్లంటే భలే మోజు. సినీ హీరో పవన్‌కళ్యాణ్‌కి కూడా కొత్త కార్లు అంటే మోజెక్కువే. వ్యక్తిగతంగా మెర్సిడెస్‌ బెంజ్‌ బ్రాండ్‌ని పవన్‌కళ్యాణ్‌ ఇష్టపడ్తాడు. అయితే, ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది పవన్‌కళ్యాణ్‌కి సంబంధించి. అదేంటంటే పవన్‌కళ్యాణ్‌కి ఖరీదైన ఎస్‌యూవీ కార్లు వున్నా, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేసేటప్పుడు మాత్రం సాదా సీదా కారునే ఉపయోగిస్తాడట. ఇది వరకు ఐ10 కారుని వాడిన పవన్‌కళ్యాణ్‌, ఇప్పుడు ఐ20కి మారాడట. షూటింగ్‌ స్పాట్‌కి కూడా పవన్‌ ఐ20లోనే వస్తుండడం సినిమా యూనిట్‌ని ఆశ్చర్యపరిచే విషయం.

డ్రైవర్‌ని పెట్టుకుని ఎస్‌యూవీలలో వెళ్ళే పవన్‌, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ విషయంలో చిన్న చిన్న కార్లనే ప్రిఫర్‌ చేయడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనమని ఆయన్ని చిన్న చిన్న కార్లలో చూసేవారంటున్నారు. డ్రస్సింగ్‌ విషయంలోనూ, ఇతరత్రా అంశాల విషయంలోనూ సింప్లిసిటీనీ, తద్వారా తనదైన ప్రత్యేకతను చాటుకునే పవన్‌, కార్ల విషయంలోనూ సింప్లిసిటీ పాటించడమంటే గొప్ప విషయమే కదా. అందుకే అతను ‘పవర్‌ స్టార్‌’ అయ్యాడు.

మరిన్ని సినిమా కబుర్లు
savings of film artists