Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
savings of film artists

ఈ సంచికలో >> సినిమా >>

నమీబియా టెంట్‌లో శర్వానంద్‌

tent by sarwanand in namebia

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా, అది సంచలనంగానే వుంటుంది. ఆయన కావాలనే సంచలనాల కోసం పాకులాడతారో, లేక ఆయన ఏం చేసినా ఆయన ప్రమేయం లేకుండానే అది సంచలనమైపోతుందో చెప్పడమూ కష్టమే.

అసలు విషయంలోకి వస్తే, వర్మ ‘సత్య`2’ సినిమాని ఆఫ్రికాలోని నమీబియాలో జరగబోతోంది. ఏకంగా 15 రోజులపాటు షూటింగ్‌ అక్కడ. నమీబియా.. అంటే ఎక్కడో సిటీకి దగ్గర్లో అనుకోవద్దు. అది పూర్తిగా మనుషుల జాడకు దూరంగా వుండే ప్రాంతం, సముద్ర తీరం. సముద్రంలో కొట్టుకొచ్చిన పాత పడవలు, సముద్రంలో కొట్టుకు వచ్చే మృతదేహాలు స్కెలిటెన్లుగా మారిపోయిన ప్రాంతమట.

సరిగ్గా మంచి నీళ్ళూ దొరకని ప్రాంతం కావడంతోపాటు, స్థానికంగా వుండేవారి సహాయం తీసుకుని, వారితోనే వంటలు చేయించుకుని, కనీస అవసరాలకు లోటు లేకుండా ఏర్పాట్లు చేశారట. ఎండ తీవ్రత కూడా అక్కడ ఎక్కువే వుంటుందని సమాచారం. సింపుల్‌గా ఆ ప్రాంతాన్ని స్కెలిటన్‌ కోస్ట్ అంటారు.

చిన్న చిన్న టెంట్లు వేసుకుని, వాటిల్లోనే పదిహేను రోజులపాటు బిక్కు బిక్కుమంటూ వుండాలి. అంత ప్రత్యేకత అక్కడేముందో తెలియాలంటే ‘సత్య`2’ సినిమా వచ్చేవరకూ ఆగాలి. వర్మ ఏం చేసినా, దానికో లెక్క వుంటుంది. ఆ లెక్కేంటోగానీ, సినిమా బృందానికి మాత్రం చుక్కలు కన్పించడం ఖాయం.

మరిన్ని సినిమా కబుర్లు
suneel to mahesh