Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cs rao chathura navalalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కార్టూన్ గొప్పది: - -

cartoon is great: tannikella bharani

"కార్టూన్ కు సమాజాన్ని కదిలించే అద్భుతమైన శక్తి ఉంది. ఛొటా భీం అనే యానిమేషన్ చిత్రం విడుదలవుతోందని తెలిసి పెద్ద పెద్ద సినిమాలే తమ విడుదలలు వాయిదా వేసుకున్నాయంటే బొమ్మకున్న శక్తి ఏమిటో తెలుస్తుంది" అని ప్రముఖ కవి, రచయిత, నటుడు, దర్శకుడు అయిన శ్రీ తనికెళ్ళ భరణి శ్రీ తలిసెట్టి రామారావు జయంతి సభలో అన్నారు.

శ్రీ తలిసెట్టి రామారావు తొలి తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. సోమవారం (20 మే 2013) న ఆయన జయంతి సభలో రవీంద్రభారతిలో సమైక్య భారతి, హాస్యానందం, ఆంధ్రప్రదేశ్ క్రోక్విల్ అకాడమి, ముఖి మీడియా ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్టూనిస్టుల పండుగ లో ముఖ్య అతిధిగా విచ్చేసిన తనికెళ్ళ భరణి పై విధంగా అన్నారు.

ఇదే సందర్భంలో నిర్వహించిన కార్టూన్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసారు.

ఈ కార్యక్రమంలో డా|| కే వి రమణాచారి, శంఖు, ఆర్కే గోనెల, మిమిక్రీ శ్రీనివాస్, హాస్యానందం రాము తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ చిత్రకారుడు శ్రీ బాలికి అభినందన సత్కారం కూడా చేసారు.

మరిన్ని శీర్షికలు
Krantadarsi