Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
junior varma praveen sree

ఈ సంచికలో >> సినిమా >>

ప్రభాస్‌కి తల్లిగా శ్రీదేవేనా?

is sridevi as mother of prabhas

ట్రెండ్‌ మారింది.. హీరో తల్లి అనగానే గ్లామరస్‌ ఫేస్‌ కోసం చూస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా వచ్చిన ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్‌ తల్లిగా నటించిన నదియా, ఆ సినిమాలో హీరోయిన్ల అందంతో పోటీ పడిరదంటే అది అతిశయోక్తి కాదేమో. ప్రభాస్‌కి అక్కలా వుంది.. అని నదియా గురించి పలువురూ చర్చించుకున్నారు.

‘మిర్చి’ విషయం అలా వుంచితే, ప్రభాస్‌ కొత్త సినిమా ‘బాహుబలి’లో ప్రభాస్‌ తల్లిగా శ్రీదేవి పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఆమెతోపాటుగా శోభన పేరు కూడా వార్తల్లోకెక్కుతోంది. వీరిద్దరిలో ఎవరు ఫైనల్‌ అవుతారోగానీ, టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాలో నటించడం గొప్పగానే భావించాల్సి వుంటుంది శ్రీదేవి అయినా, శోభన అయినా.

చాలా కాలం తర్వాత సినిమాల్లో రీ`ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ సినిమాలో సాదాసీదాగా కన్పించింది. మధ్యతరగతి మహిళగా.. ఆమె తన పాత్రకు తగ్గట్టుగా కన్పించింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ హిస్టారికల్‌ సినిమా కావడంతో.. ఇందులో ప్రభాస్‌ తల్లి పాత్ర ఎలా వుంటుందన్నదానిపై ఓ క్లారిటీ లేదు. శ్రీదేవి, శోభన.. ఇద్దరూ నటనలో తమకు తామే సాటి. శోభనతో పోల్చితే శ్రీదేవికి ఫాలోయింగ్‌ ఎక్కువ. ఇంతకీ జక్కన్న ఎవరికి  ఓటేస్తాడో.

మరిన్ని సినిమా కబుర్లు