Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
varalaksmi vratam

ఈ సంచికలో >> శీర్షికలు >>

దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________
  ఫ్రాన్స్ లోని బ్రెస్ట్ అనే ఊరికి చెందిన పియర్రే మోర్ లేన్ అనే ఓ దొంగ, ఓ దుకాణం లో మీసాలు కత్తిరించే కత్తెరను కొని డబ్బు చెల్లించాడు. అతను మీసాలు కట్ చేసుకునే లోపల మిగిలిన కస్టమర్స్ అంతా వెళ్ళిపోయారు. వెంటనే అతను తుపాకీ చూపించి దుకాణాన్ని దోచుకున్నాడు. అయితే అతను తేలిగ్గా పట్టుబడ్డాడు. అతను తన సాక్స్ లో దాచుకున్న నోట్లతో ఆ కత్తెరని కొన్నాడని పోలీసులు తెలుసుకుని పోలీసు కుక్కలకి ఆ నోట్లని వాసన చూపిస్తే అవి మైలు దూరం లో వున్న ఓ సినిమా హాల్లో సినిమా చూస్తున్న మోర్లేన్ ని పట్టించాయి. .

 


. కేలిఫోర్నియా లోని ఓ ఫుడ్ మార్కెట్ లో ఇద్దరు దొంగలు ఓ దుకాణం లోకి వెళ్ళి తుపాకులు చూపించి దొంగతనం చేసారు. అయితే ఆ తర్వాత ఓ దొంగ తమ కారుని స్టార్ట్ చేసి, తన సహ దొంగ ఆ కారెక్కకుండానే వేగంగా వెళ్ళిపోయాడు. ఆ కారు వెంట అరుస్తూ పరిగెత్తే ఆ దొంగని ఆ మార్కెట్ లోని వారు పట్టుకుని పోలీసులకి అప్పగించడంతో పారిపోయిన దొంగ పేరు, చిరునామా కూడా పోలీసులకి తెలిసాయి. 

మరిన్ని శీర్షికలు
kakoolu