Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

సిక్స్‌ ప్యాక్‌తో కొత్త కుర్రాడు

entry with six pack

ఎలాగోలా తెరపై కన్పించేద్దాం అనుకోవడంలేదు ఇప్పుడు కొత్తగా సినిమాల్లోకి వస్తున్న ‘వారసులు’. ఏదో ఒక ప్రత్యేకతతో తొలి సినిమా విడుదలకు ముందు సినీ పరిశ్రమ, ప్రేక్షకుల దృష్టిని తమవైపు మరల్చుకోవాలనే ఆలోచనతో ‘వారసులు’ ఉండటం ఆహ్వానించదగ్గ విషయం. సీనియర్‌ నటుడు నరేష్‌ తనయుడైన నవీన్‌ కూడా అంతే. నటనలో శిక్షణ తీసుకోవడంతోపాటు, సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌తో తెరంగేట్రం చేస్తున్నాడు.మలయాళ నటి మేనక కుమార్తె కీర్తి సురేష్‌, నవీన్‌ పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల కుమారుడైన నరేష్‌, తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు. కామెడీ హీరోగా పలు సినిమాల్లో ఆయన నటించారు. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొత్త ఇన్నింగ్స్‌లో స్పీడ్‌గానే దూసుకుపోతున్నారు. ఆయన కుమారుడు నవీన్‌, హీరోగా రాణించాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు.

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్‌ స్టార్‌ అనిపించుకున్న సీనియర్‌ హీరో కృష్ణ, నవీన్‌ తొలి సినిమాకి క్లాప్‌ కొట్టారు. మహేష్‌బాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరై, నరేష్‌కి విషెస్‌ చెప్పారు. సిక్స్‌ ప్యాక్‌తో తెరపైకొస్తోన్న నవీన్‌, నటుడిగా కూడా ప్రూవ్‌ చేసుకుంటే తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటాడు.

మరిన్ని సినిమా కబుర్లు
Running Raja Running