Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
entry with six pack

ఈ సంచికలో >> సినిమా >>

రన్నింగ్‌ రాజా రన్నింగ్‌

Running Raja Running

ఎన్నాళ్ళు ఎదురు చూస్తేనేం, సరైన హిట్‌ దొరకడంతో గత పరాజయాల ఆవేదన ఒక్కసారిగా మటుమాయమైపోయింది శర్వానంద్‌కి. నటనలో ఎప్పుడూ అతనికి మైనస్‌ మార్కులు పడలేదు. కానీ, సరైన విజయమే ఆయన్ను వరించలేదు. కొన్ని సినిమాలు విజయవంతమైనా, ఆ సినిమాల క్రెడిట్‌ ఆయనకు దక్కకపోవడం శోచనీయం.‘గమ్యం’ సినిమా హిట్టయ్యింది. ఆ క్రెడిట్‌ అల్లరి నరేష్‌కి వెళ్ళింది. ‘ప్రస్థానం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ శర్వానంద్‌కి రావాల్సిన పేరు రాలేదు. ‘వెన్నెల’ సినిమా కూడా హిట్టే. అందులోనూ అతని నటనకు వంక పెట్టలేం. ‘అమ్మ చెప్పింది’ సినిమా నుంచి చేసిన ప్రతి సినిమాలోనూ నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు శర్వానంద్‌.‘రన్‌ రాజా రన్‌’ ఇప్పుడు శర్వానంద్‌లో చాలా ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా కలెక్షన్స్‌ చూస్తోంటే రన్నింగ్‌ రాజా రన్నింగ్‌ అనకుండా ఉండలేకపోతున్నారు. ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందించిన ఈ సినిమా శర్వానంద్‌ కెరీర్‌కి మంచి బూస్టప్‌ ఇచ్చిందని చెప్పవచ్చును. ఈ దూకుడు శర్వానంద్‌ ఇకపై కూడా కొనసాగించాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
left megastar only