Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
left megastar only

ఈ సంచికలో >> సినిమా >>

రవితేజ.. వాట్‌ ఏ ‘పవర్‌’

ravi teja what a power

డైరెక్టర్‌ ఎవరు? నిర్మాత ఎవరు? డైలాగ్స్‌ ఎవరు రాశారు? ఇవన్నీ కాదు, డైలాగ్‌ చెప్పిందెవరన్నదే ఇక్కడ ముఖ్యం. అదే రవితేజ పవర్‌. సినీ అభిమానులతో మాస్‌ మహరాజ్‌ అన్పించుకున్న రవితేజ ‘పవర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తొలి టీజర్‌తోనే రవితేజ ‘పవర్‌’ బయటపడిరది. రెండో టీజర్‌, దాంతోపాటు సినిమా స్టిల్స్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి.రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘పవర్‌’పై భారీ అంచనాలున్నాయిప్పుడు. ఒక్కసారిగా ఈ సినిమా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ట్రెండ్‌ చూసి ఆశ్చర్యపోతున్నా రంట సినిమా పరిశ్రమలో. పోలీస్‌ గెటప్‌లో, అది కూడా పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా రవితేజ ఈ సినిమాలో కన్పిస్తాడు.‘మాస్‌ అంటే బస్‌ పాస్‌ కాదురా’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్‌ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళిపోయింది. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ఎప్పుడు తమ ముందు కొస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ‘మాస్‌ మహరాజ్‌’ అభిమానులు. రవితేజ సినిమాల్లోనే ‘పవర్‌’ అత్యంత భారీ వసూళ్ళు సాధిస్తుందని వారు నమ్ముతున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
three as one