Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ravi teja what a power

ఈ సంచికలో >> సినిమా >>

ఆ ముగ్గురూ ఒక్కటయ్యారు

three as one

హిందీ హీరోల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువే. అన్ని భాషల సినీ పరిశ్రమల్లోనూ ఉంటుందిది. ఆరోగ్యకరమైన పోరు ఉండడం కూడా సినిమా పరిశ్రమకు మంచిదే అవుతుంది. తద్వారా మంచి సినిమాలొస్తాయి. కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. పోటా పోటీగా హీరోలు సినిమాలు చేస్తే, సినీ రంగం ఎక్కువమందికి ఉపాధి కల్పించగలుగుతుంది కూడా.కాని కొన్నిసార్లు ఆధిపత్య పోరు పెడతోవ పడ్తుంది. కక్షలూ కార్పణ్యాలూ పెరిగిపోతాయి. హీరోల మధ్య కాదు, వారి మధ్య ఏవో గొడవలున్నాయనుకుని అభిమానులే తమ మధ్య గీత గీసుకుంటారు. అందరం సినిమా అభిమానులం అన్న విషయం మర్చిపోయి, ఆ హీరో అభిమానిని నేను, ఇంకో హీరో అభిమానివి నువ్వు.. నీకూ నాకూ పడదు అనే స్థాయికి గొడవలు వెళ్తాయి. అది ఎప్పుడూ మంచిది కాదు. అందుకనే ‘ఆ హీరోతో నాకు గొడవల్లేవు’ అని చెబుతుంటారు హీరోలు.అలా హిందీ హీరోలు సల్మాన్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌ తాము స్నేహితులమనీ, శతృవులం కాదని ప్రకటించుకున్నారు. షారుక్‌ కింగ్‌ ఆఫ్‌ ది బాలీవుడ్‌ అని సల్మాన్‌ఖాన్‌ అనగా, సల్మాన్‌ నాకు మంచి ఫ్రెండ్‌ అని షారుక్‌ అన్నాడు. అజయ్‌ దేవగన్‌ కూడా, షారుక్‌తో తనకు స్నేహం ఉందని చెప్పాడు. హీరోలే ఇలా చెప్పాక అభిమానులెందుకు గొడవ పెట్టుకుంటారు? అభిమానులూ కలిసిపోయారు. అంతా సుఖాంతమే ఇప్పటికైతే.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam