Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Sharwanand

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : గాలిపటం

Movie Review - Galipatam

చిత్రం: గాలిపటం
తారాగణం: ఆది, ఎరికా, రాహుల్‌ రవీంద్రన్‌, క్రిస్టినా అకీవా, పోసాని కృష్ణమురళి, రంజిత్‌, భార్గవి, ప్రగతి, సప్తగిరి, శివ నారాయణ, హేమ, వెన్నెల రామారావు తదితరులు
ఛాయాగ్రహణం: కె. బుజ్జి
సంగీతం: భీమ్స్‌ సెసిరోలియో
నిర్మాణం: లాస్‌ ఏంజిల్స్‌ టాకీస్‌, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌
దర్శకత్వం: నవీన్‌ గాంధీ
నిర్మాతలు: సంపత్‌ నంది, కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌
విడుదల తేదీ: 08 ఆగస్ట్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
కార్తి (ఆది), స్వాతి (ఎరికా) భార్యా భర్తలు. కానీ వారి వైవాహిక జీవితం గొడవలతోనే నిండిపోతుంది. దాంతో ఇద్దరం విడిపోదామనే నిర్ణయానికి వస్తారు. ఈ క్రమంలో కార్తికి పరిణీతి (క్రిస్టినా)లో ప్రేమ కన్పిస్తుంది. అలాగే స్వాతి, తనను ప్రేమిస్తోన్న అరవ్‌ (రాహుల్‌)లో మంచి ప్రేమికుడ్ని చూస్తుంది. విడిపోదామనే నిర్ణయానికి వచ్చిన కార్తి, స్వాతి తమ తమ లవర్స్‌ని కలిసి భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవాలనుకుందామనుకుంటారు. కార్తి, స్వాతి, అరవ్‌, పరిణీతి కలిశాక ఏం జరిగింది.? భార్యాభర్తలైన కార్తి, స్వాతి విడిపోయారా? అన్నది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
కార్తి పాత్రలో ఆది ఒదిగిపోయాడు. ఎరికా ఆకట్టుకుంటుంది. కొంచెం వెయిట్‌ మీద ఆమె కాన్సన్‌ట్రేషన్‌ చేస్తే మంచిది. తొలి చిత్రమైనా వున్నంతలో బాగానే చేసింది. కెమెరా ముందు కాన్ఫిడెంట్‌గా కన్పించింది క్రిస్టినా. అవసరమైనంతమేరకు నటనను ప్రదర్శించింది. రాహుల్‌ రవీంద్రన్‌ సహజత్వం ఉట్టిపడేలా అరవ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. రంజిత్‌ ఓకే. భార్గవి, ప్రగతి మామూలే. సప్తగిరి కాసిని నవ్వులు పూయించాడు. ఇతర పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర ఫర్వాలేదన్పించారు.

ఆసక్తికరమైన కథాంశంతో, ఆకట్టుకునే విధంగా సినిమాని రూపొందించాడు దర్శకుడు. డైలాగ్స్‌ బావున్నాయి. సెటైర్స్‌ బాగానే పండాయి. స్క్రిప్ట్‌ డిఫరెంట్‌గా వుంది. స్క్రీన్‌ప్లే స్మూత్‌గా వుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్‌ బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా వుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, కాస్ట్యూమ్స్‌ సహజంగా వున్నాయి.

యువతను ఆకట్టుకోవాలన్న లక్ష్యంతోనే సినిమా తెరకెక్కించినట్లు అన్పిస్తుంది. ఫస్టాఫ్‌ రొమాంటిక్‌గా, సరదా సరదాగా, అక్కడక్కడా చిన్న చిన్న గొడవలతో అలా అలా సాగిపోతుంది. ఇంటర్వెల్‌ తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు. కథలో బోల్డన్ని మలుపులు. అవసరమైన చోట నవ్వులు, అంతలోనే సెంటిమెంట్‌, అంతలోనే సీరియస్‌నెస్‌తో కథ ముందుకు వెళుతుంది. అయితే 16 నుంచి 22 ఏళ్ళ మధ్య వయస్కుల్నే టార్గెట్‌గా చేసుకుని సినిమా తీయడంతో, మెచ్యూర్డ్‌ ఆడియన్స్‌కి సినిమా ఎక్కడం కొంచెం కష్టమే. యంగ్‌ జనరేషన్‌ తీసుకునే సంచలన నిర్ణయాల్ని సినిమాలో చూపించాడు దర్శకుడు. ఆ జనరేషన్‌కి సినిమా నచ్చేయొచ్చు. వారు సినిమాను ఎలా ఆదరిస్తారన్నదానిపైనే సినిమా సక్సెస్‌ ఆధారపడి వుంటుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే: ఇది ‘రెబల్‌’ గాలి పటం

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka