Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ:
ఏకాంబర్, నూకరత్నాన్ని థియేటర్ ఓనర్ రంగారావు గారి దగ్గరకు తీసుకువస్తాడు. రంగారావు గారు కోటి రూపాయల చిట్టీ కడతారనేసరికి నూకరత్నం ఆనందాశ్చర్యాలకు లోనవుతుంది......... ఇంకా చదవండి.....

ఇది భయం కాదు బాబూ! బాధ్యత. నా మీద నాకున్న గౌరవం. అది పోతే బ్రతికినా చచ్చినట్టే కదా! అంది తల దించుకుని.

"సార్.... అంటూ హోటల్ కి వెళ్ళి ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఏకాంబర్. పక్కనే కుర్చీలో కూర్చుంది నూకరత్నం.

'ఏం తీసుకుంటావ్?" నూకరత్నాన్ని అడిగాడు ఏకాంబర్.

"మాకు లేదా?" వెనుక నుండి అడిగేసరికి ఏకాంబర్. నూకరత్నం. ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి చూసారు.

ఎవరో ఇద్దరు వ్యక్తులు టిప్ టాప్ గా తయారయి వున్నారు. ఇద్దరూ టక్ చేసుకుని దొరబాబుల్లా వున్నారు.

ఆ వ్యక్తి మెడలో లెదర్ బ్యాగ్ వేలాడుతోంది.

ఆ ఇద్దర్నీ ఆశ్చర్యం గా చూసాడు ఏకాంబర్. అంతలో వాళ్ళెవరో గ్రహించి చిన్నగా నవ్వేసాడు. నమస్తే సార్... ! మేమిక్కడ వున్నామని ఎలా తెలిసింది సార్. ఆశ్చర్యం గా అడిగింది .

"మీరు అట్నుండి నడిచి వస్తూ ఈ హోటల్ లో దూరడం బైక్ మీద వస్తూనే చూసాం. నవ్వుతూ చెప్పాడు బ్రాంచి మేనేజర్ కరీం.

ఏకాంబర్ కూడా కుర్చీలోనుండి లేచి నిలబడి వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

'బై ది బై " నా పేరు ఏకాంబర్ సార్! నేను జీవిత భీమా ఏజెంటు గా చేస్తున్నాను." తనని తాను వాళ్ళిద్దరికీ పరిచయం చేసుకున్నాడు.
రండి సార్ టిఫిన్ చేద్దాం! వాళ్ళిద్దరినీ ఆహ్వానిస్తూ అంది నూకరత్నం.

లేదు లేదు మేమిప్పుడే తినేసి వచ్చాం. మీరు కానివ్వండి మేము బయట వెయిట్ చేస్తాం. అన్నారు రీజనల్ మేనేజర్.

మాకూ ఆకలి లేదు సార్! మీ కోసం రోడ్డు మీద నిలబడలేక ఈ హోటల్ కి వచ్చాం. పదండి వెళ్దాం.' అంటూ ఏకాంబర్ హోటల్ లోనుండి బయటకు వచ్చేసాడు. అతని వెనుకే నడిచింది నూకరత్నం.

నలుగురూ అరక్షణం లో జగదాంబ థియేటర్ దగ్గరకు వెళ్ళారు. థియేటర్ ఓనర్ రంగారావు గారు థియేటర్ ఆవరణలో ఎవరితోనో పచ్చాపాటి మాట్లాడుతూనే ఏకాంబర్ రావడం గమణించి ఆయనే వారిని పలకరించారు.

రండి!..రండి! ఏకాంబర్! వాళ్ళొచ్చినట్టున్నారు కదా! పదండి నా కేబిన్ లో కూర్చుందాం!" అంటూ ఆయన తన గదికేసి వడివడిగా నడిచారు.
రంగారావు గారి వెనుక నలుగురూ ఆయన గదిలోకి వెళ్ళారు. థియేటర్ యజమాని రంగారావు గారు కుర్చీలో కూర్చుంటూనే అటెండర్ ని పిలిచి అయిదుగురికీ కూల్డ్రింక్ లు తెమ్మన్నారు

నమస్తే సార్! వీరు మా శ్రీ రాం చిట్స్ రీజనల్ మేనేజర్ గారు సార్! వీరు బ్రాంచి మేనేజరు కరీం గారు! ఇద్దర్నీ రంగారావు గారికి పరిచయం చేసింది నూకరత్నం.

ఏకాంబర్ మౌనం గా కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ  అతనికి పరిచయం లేదు. తను రెండు, మూడు ప్రైవేట్ కంపెనీలకు తీసుకెళ్ళి నూకరత్నాన్ని పరిచయం చేసాడు. అవి స్థానికం గా వున్న వాళ్ళవి. ఎవరైనా చీటీ పాడుకున్నా జామీను విషయం లో అంతగా పట్టుబట్టరు. ఇలాంటి రాష్ట్ర వ్యాప్త కంపెనీల్లో అయితే నూకరత్నం నెగ్గుకురాగలదో లేదోనని నీటి జోలికే వెళ్ళలేదు.

కానీ, తన కంటే రెండడుగులు ముందుకేసి శ్రీ రాం చిట్స్ లోనూ, మార్గదర్శి చిట్స్ లోకూడా ఏజెంటుగా జాయిన్ అయ్యానని చెప్పింది. ఆమెను నిరుత్సాహ పరచకూడదని మూనంగా అర్ధాంగీకారం గా తల ఊపేసాడు తను. ఈ రెండు నెలల్లో రెండు చోట్లా బాగానే వ్యాపారం చేస్తోంది. తనకి కూడా నూకరత్నం మీద నమ్మకలిగింది.

చాలా మంది ఈ రెండిటిలోనైతేనే చిట్స్ కడతామని మిగతావి అయితే వద్దని అంటున్నారు. అందుకే నీకు చెప్పకుండానే ఈ రెండు కంపెనీల్లో  ఏజెంటు గా జాయిన్ అయ్యాను. క్షమిచ్.అండి అంది ఆ తరువాత

"నిజమే రత్నం! నేను నీకు స్విమ్మింగ్ ఫూల్ లో ఈత నేర్పాలనుకున్నాను. నువ్వు ఏకంగా సముద్రం లోనే ఈత కొడతానంటావ్! అది నీమీద నీకున్న నమ్మకం. ఆల్ దిబెస్ట్ అంటూ ఆమెని వెన్ను తట్టాడు.

ఆ తరువాత తనూ ఐదు లక్షల రూపాయల చిట్ కట్టాడు. ఆమెలో ఆత్మ విశ్వాసం మెండుగా వుంది.

దానికి ప్రోత్సాహం కావాలి. అందుకే జగదాంబ థియేటర్ యజమాని రంగారావుగారు డబ్బు అవసరం వుందని ఎలా అని అడిగితే ఈ చీటీ సలహా తనే ఇచ్చాడు. అయన కూడా వెంటనే నీకు బాగా తెలిసిన ఏజెంటుని పట్టుకురా అని చెప్పాడు. వెంటనే నూకరత్నాన్ని తీసుకువచ్చాడు.

"ఏకాంబర్ నాకు బాగా కావలిసినవాడు. నాకు వెల్ విషర్! ఆయన తరుపున వచ్చారు కనుక మిమ్మల్ని నేను విశ్వసిస్తున్నాను. నాకు అర్జెంటుగా డబ్బు అవసరముంది. బ్యాంకులకు వెళ్తే అంత తొందర అయ్యేది కాదు. అందుకే మీ దగ్గర చీటీ కట్టాలనుకున్నాను" అన్నారు రంగారావుగారు.

రంగారావుగారు ఏమన్నారో ఏకాంబర్ వినలేదు. పక్కనే కూర్చున్న నూకరత్నం ఏకాంబర్ తొడ మీద గట్టిగా గిల్లేసరికి ఇహానికి వచ్చి సర్దుకు కూర్చున్నాడు.

అవునా ఏకాంబర్ మళ్ళీ రంగారావుగారే అన్నారు.

ఆ1.. ఆ!.. అవును సార్! తడబడుతూ అనేసాడు ఏకాంబర్.

"సార్! మా కంపెనీలో కోటి రూపాయల చిట్ ఉంది. కానీ ఇక్కడ మన వైజాగ్ జోన్ లో ఎక్కడా లేదు. మీకు అభ్యంతరం లేకపోతే హైద్రాబాద్ జోన్ లో ఈ నెల్లోనే స్టార్ట్ చేస్తారు. అందులో చేరండి " చెప్పాడు రీజినల్ మ్నేజర్.

"ఎక్కడైతే నాకేంటి! అది మీ కంపెనీ నాక్కావలసింది మనీ... రెండు నెలల్లో చిట్ పొడి ఇప్పించగలరా? అడిగారు రంగారావుగారు.సార్! కమిట్మెంట్ అయితే మా చేతుల్లో లేదు. హైద్రాబాద్ జోనల్ ఆఫీసులో మాట్లాడి చెబుతాను.జస్ట్ ఫైవ్ మినిట్స్" అంటూనే రీజినల్ మేనేజర్ వెంటనే హైద్రాబాద్ కి ఫోన్ చేసాడు. ఫోన్ కలవగానే గది బయటకు వెళ్ళి మాట్లాడి వచ్చాడు

సార్! మాట్లాడాను. ఒక్క చిట్ కడితే కమిట్ మెంట్ ఇవ్వడం జరగదట సార్! డ్రాలో వస్తే మీ లక్. కానీ, అది కష్టం. రెండో నెలలోనే చిట్ కావాలంటే కనీసం మీ ద్వారా మూడు చిట్ లు వుంటేనే గానీ కమిట్మెంట్ ఇవ్వలేమంటున్నారు. సార్!' చెప్పాడు ఆర్.ఎం.
రీజినల్ మేనేజర్ అలా అనేసరికి నూకరత్నం గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఇలా అయితే ఆయనెందుకు చిట్ కడతాడు.. మనసులోనే డీలా పడిపోయింది నూకరత్నం.

మూడు చిట్ లంటే కట్టాలి కదా సార్! ఒక చిట్ కి నెలకు రెండు చిట్లు కట్టాలి[' ఆలోచిస్తూ అన్నాడు రంగారావుగారు.నెలకు రెండు లక్షలైనా మీకు డెభ్భైవేల వరకూ డివిడెండ్ వస్తుంది కదా సార్1 లక్షా ముప్ఫై వేల వరకూ కట్టాల్సి వస్తుంది. ఇది ఇలా ఓ ఇరవై నెలల వరకూ గ్యారెంటీగా వుంటుంది. మళ్ళీ ఆర్.ఎం గారే అన్నారు.

"రెండు చిట్స్ అయితే నేను కట్టగలనండి. నాకు వేరే ఇంకా చాలా కమిట్ మెంట్లు వుంటాయి కదా! ఒక చిట్ రెండో నెల ఇప్పిస్తే రెండోది మీ ఇష్టం! ఎప్పుడు తక్కువగా వెళ్తే అప్పుడు పాడుకుందాం. మీ వాళ్ళతో మాట్లాడి చెప్పంది.! హుందాగా అన్నారు రంగారావుగారు.

రంగారావు గారు రెండు చిట్ లనేసరికి నూకరత్నం గుండెల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. భగవంతుడా ఆయన అడిగినట్టు రెండో నెల కమిట్మెంట్ ఇచ్చేలా చూడు స్వామి అంటూ దేవుళ్ళందరికీ మొక్కుకుంది నూకరత్నం మనసులోనే.

సార్! హైద్రాబాద్ ఫోన్ చేసి చెప్తాను. సార్ మీ గురించి కూడా చెప్పాను. మీ ప్రొఫైల్ అడిగారు చెప్పాను. అంటూ సెల్ పట్టుకుని గది బైటకు వెళ్ళాడు రీజినల్ మేనేజర్.

  సార్! మీలాంటి వాళ్ళు మా కంపెనీ కస్టమర్లయితే ఎంతో అదృష్టం సార్! మీకు తప్పకుండా కమిట్ మెంట్ ఇప్పించి తీరుతారు. మా ఆర్.ఎం. సార్! మీకు అభ్యంతరం లేకపోతే ఈ గ్రూప్ లో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా చిట్ కడతారేమో పేర్లు చెప్తే మేము వెళ్ళి కలుస్తాము సార్! నమ్రతగా అడిగాడు బ్రాంచి మేనేజర్ కరీం.కడతారు. చాలామంది కడతారు. వెళ్ళి అడగండి! నా పేరు చెప్పండి పర్వాలేదు. నేను కూడా కడుతున్నానని చెప్పండి! పర్వాలేదు. ఇందులో దాపరికం ఏముంది? నవ్వుతూ అన్నారు రంగారావు గారు.

థేంక్యూ సార్! ఆనందంగా అన్నాడు కరీం. ఇంతలో రీజనల్ మేనేజర్ వచ్చాడు గదిలోకి.సార్ వాళ్ళను ఒప్పించాను సార్! మీలాంటి పెద్ద కస్టమర్ ని ఒదులుకోలేం కదా సార్1 కానీ చిన్న రిక్వెస్ట్! రెండో నెల చిట్ పాడితే మూడో నెలలో పేమెంట్ అందుతుంది. లిక్విడ్ షూరిటీ మాత్రం తప్పనిసరి కావాలి సార్! అలాగే ఇంకంట్యాక్స్ రిటన్స్ కావాలి. ఇవి రెడీ చేసుకోండి సార్. నవ్వుతూ చెప్పాడు రీజినల్ మేనేజర్.

ఆ మాట వింటూనే జగదాంబ థియుఏటర్ రంగారావు కంటే అమితంగా ఆనందపడింది నూకరత్నం.అయితే తన హావభావాలను ఎక్కడా బయటపెట్టకుండా కూర్చుంది.నేనిప్పుడు మీకెంతకు చెక్ ఇవ్వాలి? చెక్ బుక్ తీస్తూ అడిగారు థియేటర్ ఓనర్ రంగారావు గారు.

సార్! ఈ రెండు చిట్స్ అప్లికేషన్స్ నింపాలి సార్! రెండు చిట్స్ కు విడివిడిగా రెండు చెక్కులు రాసి ఇవ్వండి. అంటూనే ధరఖాస్తులు తీసి గబగబా నింపేసాడు ఆర్.ఎం.

సార్! మీరు చిట్ లు అయితే తీసుకుంటామన్నారు . అంత గౌరవంగానే చిట్ పాట కాగానే మా సార్ కి అనుకున్న సమయానికి చెక్ పేమెంట్ చెయ్యాలి. మళ్ళీ మాకు మాట రాకూడదు. అంతవరకూ మౌనం గా ఉన్న ఏకాంబర్ గొంతు విప్పి అన్నాడు.

అదేం లేదు సార్! మీకు,మేడం గారికి మాట రాకుండా చూసే భాద్యత మాది అన్నాడు బ్రాంచి మేనేజర్ కరీం.|

చిట్ ధరకాస్తు నింపిన వెంటనే వారు చెప్పినట్లు శ్రీరాం చిట్స్ కంపెనీ పేర రెండు చెక్కులురాసి ఇచ్చేసారు జగదాంబ థియేటర్ ఓనర్ రంగారావుగారు.

రంగారావు గారు చెక్కులు రెండూ రాసి సంతకం చేసి నూకరత్నం చేతికే ఇచ్చారు. ఆయన అంత గౌరవం గా తన చేతికే చెక్కులు ఇవ్వడంతో ఎంతో సంతోషం గా అవి అందుకుని "థేంక్యూ సార్" అంది అప్రయత్నం గానే.సార్! వస్తాం సార్! మీకెలాంటి అవసరం కలిగిన మా మేడం కి చెప్పండి సార్! మేం వెంటనే వస్తాం సార్! చిన్న రిక్వెస్ట్ మీకు తెలిసిన వాళ్ళెవరైనా వుంటే పేర్లు చెప్తే మేమే వెళ్ళి కలుస్తాం! ప్లీజ్" మర్యాదగా షేక్ హేండ్ ఇస్తూ అడిగారు రీజినల్ మేనేజర్.

ఇప్పుడె మీ బ్రాంచి మేనేజర్ కూడా అడిగారు. చెప్పాను. ఈ వైజాగ్ లో ఏ థియేటర్ వారినైనా, షాపిగ్ మాల్ వాళ్ళనైనా సరే నా పేరు చెప్పి అడగండి. కావాలంటే మీరు కలిసాక నాకు ఫోన్ చెయ్యండి

నేను చెప్తాను. అంటూ ఆయన ముగ్గురికీ షేక్ హేండ్ ఇచ్చి నూకరత్నం తో అన్నారు.

"నీ గురించి  మా ఏకాంబర్ చెప్పాడమ్మా! కష్టపడితే ఫలితం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అన్నారు.

"చాలా థాంక్స్ సార్! అంది నూకరత్నం.

సార్! మళ్ళీ కలుస్తాం" ఏకాంబర్ అన్నాడు. నలుగురూ ఉత్సాహంగా, ఆనందంగా ఆ గదిలోనుండి బయటకి వచ్చారు. థియేటర్ ఆవరణ దాటి రోడ్డు మీదకి వచ్చారు.

మేడం కంగ్రాట్స్! మీరింకా ఇలాంటి పెద్ద పెద్ద చిట్స్ చాలా చెయ్యాలి. మన జోనల్ లో అయితే పాతిక లక్షలు వరకే వున్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి. సార్ పేరుతో మనం మిగతా థియేటర్ వాళ్ళని, షాపింగ్ వాళ్ళని కలుద్దాం. మీకు వీలయితే రోజుకు ఒకరిద్దరినీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అంటూ రీజినల్ మేనేజర్ నూకరత్నానికి అభినందనలు రెలిపాడు.

అలాగే సార్! మీ సహాయ సహకారాలు వుంటే ఇంకా బాగా చేస్తాను. సార్! థేంక్యూ సార్! శ్రమ అనుకోకుండా వచ్చారు" ఆనందం గా అంది నూకరత్నం.

ఇది మా డ్యూటీ మేడం అన్నారిద్దరూ ఒక్కసారే. కలుద్దాం సార్! వుంటాను అంటూ వాళ్ళిద్దరికీ ఏకాంబర్ కూడా థేంక్స్ చెప్పి షేక్ హేండ్ ఇచ్చాడు. రీజినల్ మేనేజర్, బ్రాంచి మేనేజర్ అలా వెళ్ళగానే ఏకాంబర్ బైక్ వెనుక కూర్చుంటూనే ఆనందం గా ఏకాంబర్ మీద వాలిపోతూ బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది నూకరత్నం.

నూకరత్నం బైక్ మీద కూర్చుంటూ మీద పడి స్లిఫ్ట్ సెకండ్ లో అంత తియ్యగా ముద్దిస్తుందని ఏకాంబర్ ఊహించనైనా ఊహించలేదు. ఆశ్చర్యం ఓ షాకయ్యాడు.

ఏంటిది? చిన్న పిల్లలా! పట్టపగలు... నడిరోడ్డుమీద... జనాలతో రద్దీగా వుండే జగదాంబ జంక్షన్ లో పబ్లిక్ గా బైక్ మీద ఒక మగాన్ని ఒక ఆడపిల్ల ఇంత ధిర్యం గా ముద్దుపెట్టుకుంటూనే ఎంతమంది చూసుకుంటారో కదా! ఔరా! నీకు సిగ్గు లేదా? బైక్ స్టార్ట్ చేసినా బ్రేకు మీద కాలేసి నూకరత్నం కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఏకాంబర్.

ఈ క్షణం ..... ఈ ఆనందం.... ఈ తన్మయత్వం... నువ్వే కదరా నా జేంస్ బాండ్! బెస్ట్ బాయ్ ఫ్రెండ్! అందుకే సంతోషం పట్టలేక చిన్న కిస్... అదీ బుగ్గ మీదే కదా ఇచ్చాను. ఎవరూ లేకపోతే ? చుట్టేసుకుంటూ అంది నూక రత్నం.

'సరి సరి! జాగ్రత్తగా కూర్చో ! అంటూ బైక్ ని ముందుకు ఉరికించాడు ఏకాంబర్.

రెండు కోట్లు... రెండు లక్షలు... రెండు కోట్లు... రెండు లక్షలు మనసులో ఉబ్బితబ్బిబవుతూ.....  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
28th episode