Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
28th episode

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ ఏ ఎస్ పాస్

జరిగిన కథ:
కిట్టు  దిగ్విజయం గా ఇంటర్వ్యూ పూర్తిచేసి, తరువాత బయటకు వచ్చి తన భార్య అనితకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ బాగా చేసాను. ఏదో ఒక సర్వీస్ వస్తుంది అని చెప్తాడు. కిట్టు హైద్రాబాద్ కు చేరడం తరువాత ఆఫీసుకు వెళ్ళడం షరామామూలే......

 వీడికి చాలా గర్వం, పాసైపోతాడంట...

కొమ్ములు తిరిగిన వాళ్ళు.. బోలెడన్ని సార్లు ఇంటర్వ్యూ చేసి వచ్చిన వాళ్ళు ... మహా మేధావులు... నెత్తిమీద చెంగు వేసుకున్నారు... వీడెంత...? ఒకవేళ ఇంటర్వ్యూ బాగా చేసినా గానీ, మర్యాదగా, ఏమో బాగానే చేసాను, ఆ తర్వాత దేవుని దయ అనాలి... అంతేగాని, పాసైపోతానని చెప్పుకుంటాడా వీడు? ఇలా పరి పరి విధాలా అనుకున్నారు...

కాలం గడుస్తూ ఉంది...

కిట్టు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు...

ఫలితాలు రానే వచ్చాయి... లకడీకాపూల్ దగ్గర ఒక గవర్నమెంట్ ఆఫీసు వుంది... అక్కడకు వెళ్ళి గోడమీద అంటించిన ఫలితాలను చూసుకోవాలి. ఫ్రెండ్స్ తో కాకుండా ఒక్కడేవెళ్ళాడు కిట్టు. ఎంత వెతికినా కిట్టు నెంబర్ కనిపించటం లేదు... చూసి చూసి విసిగి వేసారిపోయాడు నిరాశగా... నిస్పృహగా...ఇంటి ముఖం పట్టాడు... కిట్టు ముఖం చూసిన అనిత అడిగింది. ఏమైందని? ఇంకేమైంది? ఇంతే సంగతులు అన్నాడు పోనీలెండి... పోతే పోయింది.. మరుసటి సంవత్సరం రాయండి అన్నది అనిత. ఇదే నా ఆఖరి చాన్స్. నాకింకా చాన్సులు లేవు. అన్నాడు కిట్టు. ఈ ఉద్యోగం కూడాఆ ళెణీ వాఆల్లు ఎంతమంది ఉన్నారో కదా.. దేవుడి దయ వల్ల మనకు ఈ ఉద్యోగమైనా వుంది. .. ఇది కూడా లేకపోతే ఎంత కష్టం.? దేవుడు మనకిచ్చింది ఇంతే అని సరిపెట్టుకుందాం... మన పిల్లాడిని బాగా చదివిచ్చుకుందాం. అంది అనిత. మళ్ళీ తనే అన్నది. అవును మీరు చెప్తుండేవారు కదా... ఎన్నయ్ ఐటీ వాడు రోజూ ప్రకటనలు వేస్తున్నాడు. కంప్యూటర్ కోర్సు చదివితే మంచి జీతం తో ఉద్యోగం వస్తుంది. అని అందులో చేరిపోండి. నెమ్మదిగా నేర్చుకోండి.. అని నువ్వు చెప్పింది నిజమే.. అన్నాడు కిట్టు. అదేవిధం గా గిరిధర్ దగ్గర డబ్బులు తీసుకుని ఎన్నయ్ ఐటీ వాళ్ళకి ఫీజు కట్టి చేరిపోయాడు కిట్టు. గిరిధర్ కిట్టుని ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. బాగా చదువు కిట్టు... అన్నాడంత్.. గిరిధర్ లాంటి ఇతృడు ఉన్నందుకు అహాలా ఆనందపడ్డాడు కిట్టు... ఇక ఆపీసులో షరా మామూలే ఏవేవో మాటలు... కిట్టు చెవులు పని చేయడం మానేసాయి.

ఒకరోజు ఆఫీసు పని ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు కిట్టు. ఎదురుగా టీపాయ్ మీద ఒక కవర్ వుంది. అనీ... ఏమిటీ కవర్ అన్నాడు కిట్టు ముఖం కడుక్కోవడానికి వెళ్తూ... ఏమో ... నేనూ చూడలేదు... రిజిస్టర్ పోస్ట్ లో వచ్చింది.... సంతకం పెట్టి తీసుకున్నాను. అంది అనిత. ముఖం కడుక్కిని వచ్చి హాల్లో కూర్చుని టీపాయ్ మీద ఉన్న కవర్ తీసాడు కిట్టు. డిల్లీ నుండి వచ్చిందది యూపీయస్సీ వాళ్ళకి మర్యాద కూడా ఎక్కువలాగా వుంది. నీవు ఫెయిలయ్యినందుకు చింతిస్తున్నాం అని రాసి ఉత్తరం పంపి వుంటారు. వీళ్ళ మర్యాద తగలెయ్య అనుకుంటూ... కవర్ చించి లోపలున్న లెటర్ బయటకు లాగాడు కిట్టు...

నీవు పొందిన ర్యాంకు ప్రకారం... నీకు రైల్వే అకౌంట్స్ సర్వీస్...  ఐయ్యారేఎస్ వచ్చింది. కంగ్రాడ్యులేషన్స్.తర్వాత కాగితాలలో ఏం రాసి వుందో పరిశీలించాడు కిట్టు.

మొట్టమొదటి ట్రైనింగ్ మసూరి లో జరగనుంది.రిపోర్ట్ చేయవలసిన తేదీ, తెచ్చుకోవలసిన సరంజామా... పూతిక పుల్లతో సహా రాసి వుంది. అందులో

ఒకసారి ... వంద ఆలోచనలు కిట్టుని చుట్టుముట్టాయి..ఆశ్చర్యం.. ఆనందం... అనుమానం... నిజమా... కాదా... నేను పాసయ్యానా..?ఎవరో నన్ను ఏడిపించడానికి ఫూల్ని చేయడానికి పంపించ లేదు కదా...? గవర్నమెంట్ కాగితాలు ఎలా వుంటాయో కిట్టుకి బాగ తెలుసు... ఔను డిల్లీ నుండి వచ్చిన కవరే..

చాలా సేపటినుంచి హాల్లోంచి సౌండ్ రాకపోయేసరికి బయటకొచ్చింది అనిత....టీ అని పెద్ద కేక వేస్తారు కదా... ఏసౌండ్ లేకుండా కూర్చున్నారేమిటీ? చాలాసేపయ్యింది అంటూ కిట్టు వైపు చూసింది. కిట్టు ముఖం లో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ, హిందీ, ఆంగ్ల సినిమాలన్నీ ఒక్కసారిగా ప్రదర్షించబడుతున్నాయి. ఏంటండీ... ఏమైంది...

అంటూ కిట్టు చేతిలోని కాగితాలను తెసుకుని నెమ్మదిగా లైన్ లైన్ చదివింది.విషయం అర్ధమైన తర్వాత ఆమె ముఖం ట్యూబ్లైట్ లాగా వెలిగిపోయింది...

ఏయ్...

పిచ్చి మొహం...

మనం పాసయ్యామే... అంటూ కిట్టుని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టింది. మరి... గోడమీద నెంబర్ కనబడలేదప్పుడు. అన్నాడు కిట్టు. వెంటనే అనిత

టెన్షన్ పెట్టుకుని వెళ్ళేముందు వున్నది కూడా కనబడదు... కావాలంటే చూడు.. ఇప్పుడు మనమిద్దరం వెళ్దాం... నేన్ను చూపిస్తాను నీ నెంబర్ గోడమీద... ఇన్ని రోజులూ పిచ్చి మొహం వేసుకుని తిరిగావ్ మెంటల్ అన్నది...

అప్పటికి సర్దుకున్నాడు కిట్టు. నువ్వు చెప్పింది నిజమే..

ఆ రోజు నాకు మైండ్ అస్సలు పనిచేయలేదు... అన్నాడు కిట్టు.

కిట్టుకి ఐ ఆర్ య్యెస్ వచ్చినట్లు అందరికీ తెలిపింది. కొందరు మెచ్చుకున్నరు. కొందరు లక్కన్నారు. నువ్వు ఇంజనీరువు కాదు, డాక్టర్ కాదు, ఐఏయ్యెస్ కూడా కాదు అంటున్నాడొకడు...

అని ఒక మిత్రుడు కిట్టుతో అన్నాడు ..నిజమే...

వాడు చెప్పింది నిజమే...

పాలిటెక్నిక్ చదివిన వాడు కంప్లీట్ ఇంజనీర్ కాదు... నేను ఇంజనీర్ ను కాదు...పీహెచ్ డీ లో చేరి డాక్టర్ అనిపించుకుందామని అనుకున్నాను... సివిల్స్ పరీక్ష కోసం పీహెచ్ డీ    మధ్యలో వదిలేసాను... అందుకని డాక్టర్ని కాదు కాదు... ఒక్క సంవత్సరం లా చదివిననేను లాయర్ని కాను...

ఐయ్యేయ్స్ పరీక్ష పాసయ్యాను గానీ ఐఏయెస్ కాకుండా ఐయ్యరేఎస్ సర్వీస్ లో పడ్డాను.కాబట్టి నేను ఐఏఎస్ కాదు...వాడు చెప్పింది అక్షర సత్యం...

కానీ ఒక మాట చెప్తాను...నేను ఇంజనీరింగ్ ని కాదు, డాక్టర్ ని కాదు, లాయర్ ని ఐఏఎస్ కూడా కాదు. కానీ... ఎ మాట చెప్పినవాడికంటే మాత్రం గొప్పవాడిని.. అన్నాడు కిట్టు.

ఇంట్లో పిల్లవాడిని భుజాల మీద ఎక్కించుకుని గుర్రం ఆట ఆడుతున్నాడు కిట్టు...వీడిని భుజాల మీద ఎక్కించుకుని బాగానే తిప్పుతున్నారు... ఇన్ని రోజులయ్యింది...

వీడికి పేరు పెట్టమని రోజూ పోరుపెడుతున్నా నా మాట పట్టించుకోవడం లేదు...అందరూ అడగడమే... ఏం పేరు మీ పిల్లవాడిదని... చెప్పలేక చస్తున్నాను..

మీ నాన్నగారు చెప్పిన పేర్లు మీకు నచ్చలేదు... పోనీ మీకు నచ్చిన పేరన్నా పెట్టవచ్చి కదా...వీడికి  పేరు పెట్టమంటున్నాను పిల్లవాడికి.. అన్నది అనిత.

పేరే కదా... పెట్టేద్దాం.. అన్నాడు కిట్టు. మరైతే పేరు పెట్టండి అన్నది అనిత...నాన్నగారు ఏమన్నారు? మొదటి అక్షరం ఏం రావాలన్నారు? వందసార్లు చెప్పాలా?

చ తో మొదలవ్వాలి అని తెలుసుకదా నీకు! అనితకు కోపం వస్తే న్నువ్వు నువ్వు అంటుంది.కిట్టు శాంతం గా నవ్వాడు. అనీ అది కాదమ్మా.. మళ్ళీ చెప్పు అన్నాడు కీట్టు.

చ అన్నది అనిత.అనిత వైపు సూటిగా చూస్తూ అన్నాడు కిట్టు...చరిత్

చరితా? ఇదేం పేరు? ఆడవాళ్ళకి పెట్టే పేరులా వుంది అన్నది అనిత.చరిత అనేది ఆడపిల్లలకు పెట్టే పేరులా వుంది. అన్నది అనిత.చరిత
అనేది ఆడపిల్లలకు... వీడు అబ్బాయి కాబట్టి చరిత్ అన్నాడు కిట్టు.

ఏ..ఏం బాగాలేదు.. ఏడిసినట్టుంది. ఇదేదో హిస్టరీ, జాగ్రఫీ..లాగా వుంది.ఎవరన్నా విన్నా నవ్వుతారు. ఇలాంటి పిచ్చి పిచి పేర్లు పెట్టకండి... అంది అనిత.

అనిత వైపు చూస్తూనే అన్నాడు కిట్టు...కరెక్ట్ గా చెప్పావు.. వీడు హిస్టరీయే... చరిత్రే... హిస్టరీయా.. చరిత్రా.. అదెలా... అంది అనిత.అనిత వైపు చూస్తూనే అన్నాడు కిట్టు.

కరెక్ట్ గా చెప్పావు.. వీడు హిస్టరీయే.. చరిత్రే.. హిస్టరీయా..చరిత్రా... అదెలా...అంది అనిత.

ఔను ఎలాగంటే...

నా ఇంటి వైపు గానీ, నీ ఇంటి వైపు గానీ పది తరాలు తిరిగేసినా, ఇలాంటి సర్వీసులో వున్నవాళ్ళు ఎవరూ లేరు. మనవి అతి సామాన్య కుటుంబాలు.. ఐఏయెస్ కాకపోయినా దరిదాపు అదే స్థాయి వున్న అయ్యారేఎస్ కు మొట్ట మొదటగా సెలెక్టయ్యాను నేను... మన సామాన్య ఫ్యామిలీ లకి ఇది చరిత్రే హిస్టరీయే... ఇది మన టైపు హిస్టరీ... మన వరకు పరిమితమైన హిస్టరీ... ఈ హిస్టరీ జరిగే సమయానికి వచ్చినవాడు మన పిల్లవాడు...

అందుకని వీడు హిస్టరీయే... అందుకనే వీడు చరిత్... అన్నాడు కిట్టు.అనిత వెంటనే మీరు చెప్పింది నాకు నచ్చింది... అన్నది.నాన్న చరిత్... నా బుల్లి చెర్రీఎ... అంటూ కొడుకుని ముద్దులాడాడు కిట్టు.

అబ్బో ... షార్ట్ కట్ లో ముద్దు పేరు కూడా పెట్టేసారే... అంటూ నవ్వింది అనిత.....

.శుభం. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్