Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Breast Tumors, Ayurveda Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ay)

ఈ సంచికలో >> శీర్షికలు >>

పెట్టుబడి - ఖర్చు - బన్ను

Investment Vs Expense

పెట్టుబడి వేరు... ఖర్చు వేరు! రెండూ మన చేతిలోంచి వెళ్ళిపోయేవే... ఐనా తేడా ఏమిటంటే... మనం దేనిమీదైనా పెట్టుబడి పెడితే దాన్నుంచి లాభం ఆశిస్తాం. ఖర్చు ఐనదాన్నుంచి సుఖాన్ని ఆశిస్తాం. ఉదాహరణకి మనం బంగారం కొన్నామనుకోండి... అది పెరుగుతుందని కొంటాం. అది పెట్టుబడి! మనం ఫామిలీతోనో లేక స్నేహితులతోనో ఒక రెస్టారెంటు కెళ్ళితే అది ఖర్చు.

సాధారణంగా సంపాదనలో కొంత పెట్టుబడి, కొంత ఖర్చు పెడుతుంటాం. నేను చెప్పేదేమిటంటే 'పెట్టుబడి' ఖర్చుకాకూడదు. ఉదాహరణకి మీరొక మంచి కంపెనీ షేర్లని 'పెట్టుబడి' అనుకొని కొన్నారు. ఆ కంపెనీ మూతబడితే అది ఖర్చుగా మిగులుతుంది. 'షేర్లు' కానివ్వండి... 'మ్యూచువల్ ఫండ్స్' కానివ్వండి లేక 'రియల్ ఎస్టేట్' కానివ్వండి... పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి... అవసరమైతే సలహా తీసుకొని పెట్టుబడి పెట్టండి లేదా అది 'ఖర్చు'గా మిగిలిపోతుంది. 'ఖర్చు' తిరిగిరాదు. గుర్తు పెట్టుకోండి! మనం పెట్టే 'ఖర్చు'లో ఆత్మ సంతృప్తి మిగులుతుంది... కానీ పెట్టుబడి 'ఖర్చు'గా మారితే ఏమీ మిగలదు!

ఇహపోతే... ఫేమిలీతో ఒక ట్రిప్ ప్లాన్ చేశారు. దాన్ని మీరు ఖర్చుగా భావిస్తారు. కానీ... ఒక్కోసారి మీకది పెట్టుబడిగా మారుతుంది. మీరు ఫేమిలీ మెంబర్స్ నుంచి మీరూహించని రిటర్న్ ('ప్రేమ') దక్కుతుంది. అలాగే మీరో స్నేహితుడికి అత్యధికంగా సహాయం చేశారు. కానీ మీకు అతడు హాండిచ్చెళ్ళిపోతే... ఆ పెట్టుబడి 'ఖర్చు'గా పరిగణించాల్సిందే!

మీ సంపాదనలో పెట్టుబడి - ఖర్చుకి '%' మీరే నిర్ణయించుకోవాలి!

మరిన్ని శీర్షికలు
weekly horoscope (august 15 to  august 21th)