Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Investment Vs Expense

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (ఆగష్టు 15నుండి ఆగష్టు 21 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

ఈవారం మొత్తంమీద దూరప్రదేశప్రయాణాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. చేపట్టిన పనుల్లో మిశ్రమఫలితాలు తప్పక పోవచ్చును. చిన్న చిన్న విషయాలకే హైరానాపడే అవకాశం కలదు. నూతన ప్రయత్నాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మిత్రులతో కలిసి చేపట్టు పనుల విషయంలో అవగాహన కలిగి ఉండుట మంచిది లేకపోతే అనవసరమైన వివాదములలో ఎరుక్కొనే అవకాశం కలదు జాగ్రత్త. ఉద్యోగంలో సమయాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా కార్యచరనపైన దృష్టిని పెట్టుట వలన మేలుజరుగుతుంది. కుటుంభసభ్యలతో కలిసి ఆర్థికపరమైన విషయాలలో ఒక నిర్ణయానికి వస్తారు అందరితో మీ ఆలోచనలను పంచుకొనుట వలన మేలుజరుగుతుంది

వృషభ రాశి

ఈవారం మొత్తంమీద బంధుమిత్రులను కలుస్తారు వారి నుండి విలువైన సమాచరం సేకరించే అవకాశం కలదు. చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినను వాటిని విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. నూతన ప్రయత్నాల విషయంలో పెద్దలను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం అనేది మంచిది. కుటుంభసభ్యులను కలుస్తారు వారితో నూతన విషయంలో ఒక అవగాహనకు వస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉన్న మీ జాగ్రత్తలు మీరు తీసుకోవడం అనేది ఉత్తమం. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారులతో సత్సంభందాలు కలిగి ఉండుట మేలుచేస్తుంది. దూరప్రదేశ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి


మిథున రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభం బాగుంటుంది కావున ప్రణాళికా ప్రకారం ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. సాంకేతిక రంగంలో ఉన్న వారు మీ ఆలోచనల మూలాన లబ్దిని పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయకండి వీలయితే వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. మానసికంగా కొన్ని కొన్ని విషయాలు మీపైన ప్రభావం చూపించే అవకాశం కలదు కావున దృడంగా ఉండుట మేలుచేస్తుంది. నూతన ప్రయత్నాలు ఆరంభించే అవకాశం కలదు అయితే మిత్రుల సహాకారం తీసుకోవడం అనేది మంచిది. కుటుంభసభ్యులతో చర్చలలో పాల్గొనేటప్పుడు నిదానంగా వ్యవహరించుట సూచన ఉద్యోగంలో స్వల్ప అసంతృప్తి తప్పక పోవచ్చును సర్దుకుపోవడం మంచిది.

 

కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద  బాగుంటుంది ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. అధికారులతో చర్చాసంభందమైన విషయాలకు సమయాన్ని కేటాయించే అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం కలదు. ప్రయాణాలు మాత్రం చికాకును కలిగించె అవకాశం ఉంది కావున చేయకపోవడం ఉత్తమం. ఉద్యోగంలో ఒత్తడి మాత్రం ఉంటుంది నలుగురితో మీకుగల మంచి సంభందాలు ఉపకరిస్తాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం కలదు. స్వల్ప అనారోగ్య ;సమస్యలు తప్పక పోవచ్చును కావున తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది

 

సింహ రాశి

ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు కలవు కావున కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. నూతన ప్రయత్నాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఖర్చులు అడుపుతప్పుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారుల నుండి ఇబ్బందులు కలిగినను తొటిఉద్యొగుల సహాయం వలన కొంత ఊరట లభిస్తుంది. ప్రయాణాలు తప్పకపోవచ్చును వాటికి సమయాన్ని ఇస్తారు. కుటుంభంలో మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం కలదు ఈ విషయంలో చాలావరకు మీరే భాద్యులుగా ఉండే అవకాశం కలదు. అనారోగ్యం మూలన కాంత్ విశ్రాంతిని కోరుకొనే అవకాశాలు కలవు. పెద్దల నుండి వచ్చిన సూచనలను అశ్రద్దచేయకండి మంచిది.  

కన్యా రాశి

ఈవారం మొత్తంమీద చేపట్టిన పనుల్లో శ్రమను పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాల విషయంలో బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. మొండితనంతో వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశం ప్రయాణించుటకు అవకాశం కలదు. మీ ఆలోచనలు తోటివారికి నచ్చక పోవచ్చును సర్దుకుపోవడం మంచిది. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. వ్యతిరేకవర్గం నుండి వచ్చు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం కలదు. కుటుంభసభ్యుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు

తులా రాశి

ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుతారు. ఆరంభం బాగుంటుంది ముందుచూపు లేకపోతే సమస్యలు తప్పకపోవచ్చును జాగ్రత్త. ప్రతివిషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అధికారులకు లేక పెద్దలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మూలాన మేలుజరుగుతుంది. సమయానికి భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది లేకపోతే అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు. స్త్రీ/పరుష సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే వివాదాల్లో ఇరుక్కొనే అవకాశం కలదు. కుటుంభసభ్యులతో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం కలదు. ఇష్టమైన వ్యక్తులను కలిసే అవకాశం కలదు వారితో చర్చల్లో పాల్గొంటారు.

 


వృశ్చిక రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభంలో స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నా రాను రాను బాగుంటుంది.  తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. పెద్దలను కలుస్తారు నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం కలదు. మీ ఆలోచనలు కొన్ని తోటివారికి ఉపయోగపడే అవకాశం కలదు. ప్రయాణాల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును తగిన జాగ్రత్తలు తీసుకోండి మంచిది. వాహనముల వలన ఇబ్బందులు అలాగే ఖర్చులు కలుగుతాయి. కుటుంభసభ్యులతో కలిసి చర్చల్లో పాల్గొనేటప్పుడు నిదానంగా వ్యవహరించుట సూచన లేకపోతే మనస్పర్థలు పెరుగుటకు అవకాశం కలదు. అనుభవజ్ఞుల సూచనలు పెడచెవిన పెట్టడం మూలాన నష్టపోయే అవకాశం కలదు జాగ్రత్త.

 

ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను కొంత ఆలస్యం అయినను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. నలుగురిలో ఆశించిన విధంగా మంచి గుర్తింపును ఆలోచనల ద్వార పొందు ప్రయత్నం చేస్తారు అందులో సఫలీకృతులు అవుతారు. ఒకవార్త మిమ్మల్ని నిరుత్సాహానికి గురిచేస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో సర్దుబాటు మేలుచేస్తుంది. ప్రయాణాలు చేయకపోవడం సూచన వీలైతే వాయిదా వేయుట శ్రేయస్కరం. అధికారులతో రహస్య చర్చల్లో పాల్గొనే అవకాశం కలదు,రాజకీయ పరమైన విషయాలకు సమయం ఇవ్వడం అంత మంచిది కాదు ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగంలో మాత్రం ఎదురుదెబ్బలు తగులుతకు అవకాశం కలదు జాగ్రత్తగా వ్యవహరించుట సూచన

మకర రాశి

ఈవారం మొత్తంమీద పెద్దలను కలుస్తారు వారితో కలిసి సమయం గడుపుటకు అవకాశం కలదు. రాజకీయ పరమైన విషయాల పట్ల అమితమైన ఆసక్తిని చూపించే అవకాశం కలదు. ప్రయాణాల మూలాన ఒత్తిడి పెరుగుటకు అవకాశం కలదు. ఇష్టమైన పనుల యందు ఉత్సాహంను చూపిస్తారు మిగితా విషయాల్లో పెద్దగా స్పందించరు. అనారోగ్యసమస్యలను అశ్రద్ధ చేయకండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో క్రమశిక్షణ మేలుచేస్తుంది లేకపోతే మాట పడవలసి రావోచ్చును. నూతన నిర్ణయాల విషయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది మంచిది. మిత్రుల నుండి నూతన సమాచరం అందుటకు అవకాశం కలదు వారితో కలిసి విందులలో పాల్గొంటారు.

 


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద నచ్చిన పనుల విషయంలో మొండిగా వ్యవహరించే అవకాశం కలదు. జీవితభాగస్వామి నిర్ణయాలు కొంత భాదిస్తాయి వారితో జాగ్రత్తగా వ్యవహరించుట మేలుచేస్తుంది. మాటతీరు ఇతరులకు నచ్చదు కొంత వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో కొంత నష్టం ఎదుర్కొంటారు కావున నూతన పెట్టుబడులు పెట్టక పోవడం మంచిది. అశుభవార్తను వింటారు కొంత మానసికంగా ఒత్తడి తప్పదు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్తగా ఉండుట సూచన. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు రావు కావున నిదానం మంచిది తోటిఉద్యోగులను కలుపుకొని వెళ్ళుట సూచన.  

 

మీన రాశి

ఈవారం మొత్తంమీద సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వినోదాల పట్ల మక్కువను కలిగి ఉంటారు మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. ప్రతిపనిలో ఆచితూచి వ్యవహరించుట సూచన. గతకొంతకాలంగా సాఫీగా సాగుతున్న జీవితంలో కొంత సమస్యలు రావడానికి ఆస్కారం కలదు జాగ్రత్త. నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. పెద్దలతో చర్చలు చేయునపుడు వారి యొక్క అభిప్రాయలను తెలుసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ల;లేకపోతే ఖర్చులు అదుపు తప్పుటకు అవకాశం ఉంది జాగ్రత్త. వ్యాపారంలో కొంత నూతన సమస్యలను ఎదుర్కొంటారు


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
women power in freedom fight