Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cheekati

ఈ సంచికలో >> కథలు >> లక్ష్మమ్మబామ్మ-లక్షట్లనోము.

lakshamamma baamma - lakshatla nomu

"ఒరే! మనవడా! ఇంకొక్క రెండట్లు తినరా! మానాయనకదే! మాబాబుకదే! చచ్చినీకడుపునపుడతారా! "

" ఇపుడే నీ బాధపడలేకున్నా, ఇంకా నాకడుపున పుట్టిచంపుకు తింటానంటావుటే ! వద్దే వద్దు బామ్మా!ఐనా నీ ‘ లక్షట్లనోము’ పూర్తి కానుఇంకాఎంతకాలం పడుతుందే! ఇలా రోజూ నాకు ఉదయం సాయంకాలం  మధ్యాహ్నం లంచికీ మూడొందలరవై రోజులూ అట్లు పెట్టి ఎందుకు తిట్లు తింటావే! ఈరోజు నుంచీ నావల్లకాదు. నేను తినను.తినలేను." అంటూ లేచి చెయ్ కడుక్కుని ఇంట్లోంచీ  బయట పడ్డాను . మా బామ్మ లక్షట్ల నోముపట్టిందిట! దాన్నిపూర్తిచేయటం కోసమని ఇంటికొచ్చినవారి కందరికీ, అట్లుపోసి తిని పిస్తున్నది. మాఇంటికి నా స్నేహితులు రాను భయపడుతున్నారు.బంధువులు రావటం మానేశారు.

ఆఫీస్ లో నాలంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే మొదట్లో అంతా వాసనపీల్చుకునేవారు రాను రానూ అంతానవ్వటం మొదలెట్టారు., ఇంతకు ముందు చాటుగా నవ్వుకునేవారు  ,ఇప్పుడు పైకే నవ్వుతున్నారు.ఈ అవమానం బాధ భరించలేక మాబామ్మ లక్షట్ల నోము ఎలాపూర్తి  చేయాలా అని ఆలోచించసాగాను. నాపక్క సీటులో ఉన్న సీతామహాలక్ష్మిని పేరు పురాతనంగా ఉంది కదా,ఆమాత్రం అట్ల గురించిన నాలెడ్జ్ లేకపోతుందాని అడిగాను .

" ఏమండీ సీతగారూ! ఒక  లక్ష అట్లకు ఎన్ని బియ్యంకావాలి? " అని ఆమె స్పృహ తప్పి నంత పనై తేరుకుని " ఓమైగాడ్ ! లక్ష అట్లా! "  అంది .

" ఔనండీ ! మాబామ్మ లక్ష అట్ల నోము పట్టింది . అదిపూర్తి కావాలనే రోజూ అట్లు తినిపిస్తున్నది. కాదంటే తాను నరకానిపోతానని ఏడుస్తున్నది. పైగా ఆమె నన్ను పెంచి పెద్దచేసింది. ప్లీజ్ కాస్తంత లెక్కకట్టి ఎన్ని బియ్యం ,మినప్పప్పుకావాలో చెప్తే ఒకరోజున అట్ల సంతర్పణ చేయిస్తానండీ!" అని బ్రతిమాలాను.

" నాకసలు అట్లుపోయటమే రాదండీ! ఐనా జీవితాంతం తిన్నా లక్ష అట్లు పూర్తికావనుకుంటా  ." అంటూ నవ్వసాగింది.

" ప్లీజ్ సీతగారూ! కాస్తంతా సాయంచేయరూ!"అన్నాను దిగాలు మొహంతో ." రేపుమా అమ్మ నడిగిచెప్తాన్లెండి " అనిహామీ ఇచ్చింది.

మర్నాడు రాగానే అడిగాను. " ఒక వందగ్రాముల బియ్యానికి 25గ్రా.మినప్పప్పు తో చేస్తే మూడు అట్లు వస్తాయిటండీ , దాని ప్రకారం మీరే లక్ష అట్లకు ఎన్ని బియ్యం పప్పుకావాలో లెక్కేసుకోండి." అని తన ఫైల్స్ తెరిచి  పనిలోపడింది .

నేను వెంటనే ఆఫీస్ కాయితాలే అనుకోండి , తీసుకుని లెక్కలు కట్టడం మొదలెట్టాను.  పదికాయితాలు  పూర్తయ్యాయి , ఐనా లెక్క తేలలేదు. నేనసలే లెక్కల్లో పూరు. ఇంతలో మా ఆఫీసర్ గారు నా ఫైల్ పూర్తైతే తీసుకు రమ్మని కబురంపగానే నేను లక్ష అట్లకు కట్టి న లెక్కల లెడ్జర్ తీసుకుని లోపలికెళ్ళి ఆయన ముందుంచాను.

ఆయన ఫైల్ తెరిచి చూసి ఏమీ అర్ధంకాక ,ముఖం పైకెత్తినా వేపు చూసి  " ఏమిటయ్య! ఇదేంటీ! బియ్యమేంటీ , మినప్పప్పేంటీ, నూనేంటి.. ఈక్యాలికులేషన్సేంటీ.? ఉద్యోగం మానేసి  హోటలేమైనా  పెట్టబోతున్నావా?" అన్నారు.అప్పుడుగానీ నేను చేసినతప్పేంటో తెలీలేదు.

"పొరబాటైందిసార్ ! ఇదోపరధ్యానం లో ఇంకోటితెచ్చాను. ఒక్క నిముషంలో తెస్తాను ." అంటూ ఆయనచేతిలో ఫైల్ గుంజుకుని అసలు ఫైల్ తీసుకెల్ళాను.

ఎలాగో గండం  గడిచింది.   మాబామ్మను మనసారా  తిట్టుకుంటూ  ఇంటి కెళ్ళాను.

అసలు మీకూ మా బామ్మ గురించీ కొంచెంచెప్పాల్సిఉంది. మా అమ్మానాయనా రైల్ యాక్సిడెంటలో ఒక్కమారే పోతే, ఎక్కడో బెర్తుల చాటున పడివున్న నన్ను వెతికి తెచ్చుకుని ,  కంటికి రెప్పలాకాపాడుకుని పెంచిపెద్దచేసి చదువు సంస్కారం నేర్పి ఉద్యోగస్తుడ్ని చేసి, ప్రాణాలన్నీ నామీద ఉంచుకుని బ్రతుకు తున్నది బడుగుబామ్మ.ఐతే ఆమె కు పిత్రార్జితంగా అంటే వాళ్ళనాన్నకు ఆమెక్కొర్తే ,ఆమెకు మానాయ ఒక్కరే , అందువల్ల కోట్లు  చేసే ఆస్థినీ నన్నూ కాపాడుకుంటూ , నేను బాగుండటంకోసం ఎన్నెన్నో నోములూ వ్రతాలూ చేస్తున్నది.చిన్నతనంలో బామ్మ వాళ్ళబామ్మ దగ్గరుండి పట్టిచ్చిననోములన్నీ పూర్తిచేసి , చివరకు ' లక్షట్ల నోమూ పట్టింది. అదినా ప్రాణానికొచ్చింది.

బామ్మ కుపెద్ద లంకంత బంగళాఉంది, దానిచుట్టూ అన్నిరకాలపళ్ళచెట్ల తోట , పూలతోట దానికి ఇద్దరు తోటమాలులు మాఇంటి వెనకే గెస్ట్ హౌస్ లో ఉంటారు కుటుంబాలతో.ఆఇంటినంతా నవీకరించి అన్నిసౌకర్యాలతో పోర్షన్స్ గామార్చి , పదికాపురాలకు అద్దె కిచ్చింది, ఆసొమ్ముతో తోట నుండీ వచ్చే ఆదాతో, పొలంలో పండే పంటతో నన్నొక చిన్నపాటిజమీందార్నుచేసింది. కోట్లకు వారసుడ్ని చేసింది. మరీపెద్ద చదువులు చదివిస్తే దేశాలుపట్టిపోతానని  ఎంకాం చదివించింది. నేనేమో ఎలాగో పోటీపరీక్షలురాసి LIC. లో ఉద్యోగం సంపాదించుకున్నాను.   ఐనా చాలా సాదాసీదాగా తానుంటూ  వృధావ్యయంచేయక .జీవనంసాగిస్తూ నాకోసమే నొములన్నీ , నాచదు వు కు కొన్నినోములూ ,నా ఆరోగ్యానికి కొన్ని నోములూ, నా ఉద్యోగానికి కొన్ని నోములూ ఇలా పాపం మాబామ్మ నాకోసం నోము లు పడు తూనే ఉంది. అలాంటి బామ్మను కాదనలేను.

మీకింకోవిషయం చెప్పాలి.మా ఇంట్లో అద్దెలకుండే వాళ్లకంతా  అట్లు రోజూ వ్యక్తుల్ని లెక్కేసి పంపుతుంటుంది. మాఇంట్లో అద్దెలకుండే వారు , బామ్మాఅట్లుపోసి తెచ్చేలోగా ఇంట్లోంచీపారిపోయి ఏరాత్రికో వస్తుంటారు. మాఇంటికి  ‘అట్లవారిల్ల ‘నిపేరుకూడా వచ్చింది.ఆ అట్ల ఇంట్లో పోర్షన్ ఖాళీగా ఉంది , అట్లకు భయపడకపోతే వెళ్ళిచేరండి" అనికూడాచెప్పు కుంటారు. దేవుకిని నివేదన చేసిన అట్లు పారేయ కూడదని వారి బాధన్నమాట! మాఇంటిముందు బిచ్చగాడి కేక ఏంటంటే " అమ్మా! అట్లుతప్ప ఏమున్నా పెట్టమ్మా!"  అని ఆకేక విని  అంతా నవ్వుకుంటారు.

మా బామ్మంటే నాకూ ప్రాణమే ! ఐనా ‘ఈ లక్షట్ల నోమునెలా పూర్తిచేయాలీ’ అనేదే నాముందున్న సమస్య.

ఒకరోజుని మా బామ్మనే అడిగాను.  "బామ్మా! ఇంతవరకూ ఎన్ని అట్లు పూర్తయ్యాయే! లెక్కకట్టిచెప్పు.మొత్తం పూర్తిచేసే మార్గం ఆలోచిద్దాం. అట్లునోము పూర్తైతేగానీ నాపెళ్ళి జరిగేలాలేదే!అసలింతకూ ఈ పిచ్చినోములేంటే !" అని నేనడిగినదానికి మా బామ్మ  ఇలాచెప్పింది." మీ అమ్మ ఏనోమూ నోయక ఉద్యోగమని తీరికలేదని అనేది అలా అర్ధాంతరంగా పోయిందిరా! నీవైనా బావుం డా లని , నావంశాంకురానివి అందుకేరా నాయనా ఈ నోములన్నీనీ. "

“ ఐనా ఎన్ని నోములునోస్తావేబామ్మా! నీం జీవితం అంతా నోములతోనే గడిచి పోతున్నది ! ఎన్ని నోములు నోచావే ఇప్పటికి?" అని పొరబాటున అడిగినందుకు , “16 కుడుముల తద్దె నోము,అక్షయ బొండాల నోము,అన్నం ముట్టని ఆదివారాల నోము,బచ్చల గౌరీ నోము, అట్ల మీద ఆవ పూల నోము,అట్ల తద్దె నోము,ఆపద లేని ఆదివారము నోము,చిలక ముగ్గుల నోము, చిత్ర గుప్త నోము,కన్నె తులసమ్మ నోము ,ఉప్పు గౌరీ నోము, చిట్టి బొట్టు నోము,దీప దాన నోము,కుందేటి అమావస్య నోము, ధైర్య లక్ష్మీ నోము,గడప గౌరీ నోము,లక్ష పసుపు నోము,కైలాస గౌరీ నోము,కళ్యాణ గౌరీ నోము, కంద గౌరీ నోము,మాఘ గౌరీ నోము,మాఘ సప్తమి నోము,మార్గశిర లక్ష్మి వారాల నోము,మహాలక్ష్మి నోము , లక్ష వత్తులనోము , ముప్పైమూడు పౌర్ణాలనోము  ఇంకా….”

“ ఆపవేతల్లీ ఆపిహ . ఇంతకూ ఈ ‘లక్షట్లనోము’ ఎందుకోసమే బామ్మా! ఈ నోముతో మన ఇంటి పేరేమారిపోయిందికదే!"

" ఓరీ! కడుపు చలవకు అట్లు పెడతారురా!  తిన్నవారు దీవిస్తారు."

" కానీ మనంపెట్టే అట్లుతినేవారు విసుక్కుంటున్నారే! లోలోపల తిట్టుకుంటున్నారుకూడా! "

" అదేమోనాకు తెలీదు కానీ , డెబ్భై  ఏళ్ళదాన్ని ఇంకా ఎన్నాళ్ళుంటానుగా ! నీపెళ్ళిచూసిపోవాలి, దానికి ముందే ఈ లక్షట్లనోము, ఉద్దేపనా పూర్తవాలి. దానికి దారిచూడు." అంది. ఇహ నేను ఆలోచన్లోపడ్డాను.

మా స్నేహితుడు రామాచారిని  సాయమడిగాను. వాడికి నాటకానుభవమూ ఉందిలెండి. వాడుచక్కగా పురోహితుని వేషం ధరించి మాఇంటికి పంచాంగంతో వచ్చాడు. మాబామ్మ కు ఉద్దేపనతీర్చను ముహూర్తం నిర్ణయించను వచ్చిన పూజారిగా పరిచయం చేశా ను. మాబామ్మ వాడికి తగుమర్యాదలు చేసి," పంతులుగారూ! ఈనోము పూర్తిచేయించి నేను నరకం పాలుగాకుండా కాపాడి, మా వాడి పెళ్ళికూడా మీ చేతులమీదుగా జరిపించండి.పెద్దముండాదాన్ని ఎంతోకాలం బ్రతకలేను." అనిబ్రతిమాలసాగింది. మావాడు

" మీరింతగాచెప్పాలాబామ్మగారూ!ఐతే మీరు నామాట శ్రధ్ధగావినండి. వినాయక చవితికీ సత్యనారాయణ వ్రతానికీ బంగరు ప్రతిమ గానీ, వెండిప్రతిమగానీ, చివరకు పంచలోహప్రతిమ గానీ అదీలభ్యంకానిచో పసుపుతోనైనాచేసి పూజిస్తాం కదా!అలాగే ప్రత్యామ్నాయం గా అట్లపిండి అంతామీరు రుబ్బలేరు గనుక , ఒక గ్రైండర్ తెప్పిస్తాను,దాన్నిమీరు స్విచ్ వేసి ఆంచేయండి , నా ఎరికలో ఒక వసతి గృహముంది.అక్కడికి వెళదాం , మరో విషయం అట్ల సైజ్ తగ్గించి చిట్టిగారె ప్రమాణం చేశామంటే మీ నొము ఒక్క వారంలో పూ ర్తై  ఉద్దేపన కూడా తీర్పిస్తాను. హాస్టల్లో  మీరు స్టవ్ వెలిగిస్తే అక్కడివంటవారు దోసెలుపోసి బాగా ఆకలిమీదున్న అక్కడి ఐదొందలమంది పిల్లలకూ ఇస్తారు.మీ నోము ఒక్కవారం లో ఫినిష్.  ఇహ ఉద్దేపన విషయానికోస్తే ,ఇదీనీ అవసరాన్ని బట్టి లభ్యతను అనుసరించి ఒక చిన్నఅరచేతిలో పట్టే  సూక్ష్మమైన రోలు పత్రాన్నిచీరమడతలో ఉంచి,చిట్టిగారె ప్రమాణపు అట్లు,వెయ్యికి ఒకటిచొప్పున మీ లెక్కప్రకా రం పదీపోసి ఆరోట్లో ఉంచి ఒక ముత్తైదువకు ఇప్పిస్తాను. మీ నోము,ఉద్దేపనా కూడా తీర్చేఏర్పాటు చేస్తాను." అని బామ్మను ఒప్పిం చా డు. లేకపోతే బామ్మ రోలు ఒళ్ళోపెట్టుకుని ఉద్దేపన తీసుకోవాలని పట్టుదలతో ఉందిలెండి.మా వాడి పధకం ప్రకారం ఒక్క వారం లో ఆవసతిగృహ విద్యార్ధులంతా, చిట్టిగారె ప్రమాణపు అట్లు తలో ఇరవై హాయిగాతిని  త్రేన్చారు. మావాడు వాళ్ళచేత  " బామ్మగారికీ జై, లక్షట్లనోముకూజై " అని నినాదాలుకూడా చేయించాడు. అంతా వరసగా వచ్చి బామ్మకు నమస్కరించారు. ‘లక్షాట్లనో’ మేమోగానీ పాపం ఆవసతిగృహ విద్యార్ధులకు ఒక్క వారం రోజులైనా కమ్మని  ఆహారం అందించి నందుకు నేను మాబామ్మను మెచ్చుకోకుండా ఉండలేక పోయాను. ఇదండీ మామా నోముల బామ్మ ,లక్షట్ల నోము.’  

మరిన్ని కథలు
samayaspoorti