Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
there will be no movie complecations ?

ఈ సంచికలో >> సినిమా >>

‘గోవిందుడు..’ సెంచరీ కొట్టే సినిమా

Govindhudu movie deffinatly reach century

‘అత్తారింటికి దారేది’ సినిమా వంద కోట్ల వసూళ్ళకు దారి చూపించింది. పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌ ఆ సినిమా వసూళ్ళను వంద కోట్లకు దగ్గరదాకా తీసుకెళ్ళిందని చెప్పవచ్చు. క్లాస్‌ టచ్‌ ఉన్న సినిమా కావడంతోపాటు, సెంటిమెంట్‌, యాక్షన్‌, రొమాన్స్‌ అన్నీ కలిసి ఆ సినిమాని అంత పెద్ద విజయాన్ని చేశాయి. ఆ దారిలో వస్తున్న ఇంకో సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. రామ్‌చరణ్‌ ఇందులో హీరో. కృష్ణవంశీ దర్శకుడు.

టీజర్‌ చాలా క్లాస్‌గా ఉండడం వల్ల సినిమా అద్భుత విజయం సాధించవచ్చునని అంచనా వేస్తున్నారు సినీ జీవులు. ఒక దశలో సినిమా పట్ల వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరిగింది. సినిమా ఆలస్యం వల్ల కావచ్చు, లేదంటే ఇంకో కారణం కావచ్చు. ఆ కారణాలేవీ ఇప్పుడు వినిపించడంలేదు. టీజర్‌ వచ్చాక పరిస్థితి మారింది. తెలుగు సినిమా రికార్డులు తిరగరాసేలా ‘గోవిందుడు అందరివాడేలే’ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కృష్ణవంశీ దర్శకత్వంలో ఇదివరకు వచ్చిన ‘చందమామ’ సినిమాలో నటించిన కాజల్‌, ఆ సినిమాతోనే హీరోయిన్‌గా పాపులర్‌ అయ్యింది. ఆమె మళ్ళీ చరణ్‌తో నటిస్తోన్న సినిమా ఇది. చరణ్‌ నటించిన ‘మగధీర’లోనూ, ‘నాయక్‌’ సినిమాలోనూ కాజల్‌ కథానాయిక. ‘ఎవడు’ సినిమాలో కూడా కాస్సేపు కన్పించింది. అన్ని సెంటిమెంట్లూ కలిసి వచ్చి ‘గోవిందుడు అందరివాడేలే’ రోజుల పరంగా, వసూళ్ళ పరంగా కూడాసినిమా సెంచరీ కొట్టి, తెలుగు సినిమా ఖ్యాతి పెంచుతుందేమో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
great son