Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Govindhudu movie deffinatly reach century

ఈ సంచికలో >> సినిమా >>

పుత్రోత్సాహం చాలా గొప్పది

great son

కోట్లు ఖర్చుబెట్టి సినిమా చేసినా, అవి తిరిగొస్తాయో లేదో అన్న టెన్షన్‌ ఉంటుంది నిర్మాతలకి. హీరో తన కుమారుడే అయితే డబ్బుతోపాటు, తన కొడుకు కెరీర్‌ ఏమవుతుందోననే ఇంకో బెంగ నిర్మాతను వెంటాడుతుంటుంది. కాని బెల్లంకొండ సురేష్‌ అలా అనుకోలేదు. కుమారుడు హీరోగా సక్సెస్‌ అయితే చాలనుకున్నాడు. అందుకే డబ్బు గురించిన ఆలోచన చేయలేదు. అతని తెగింపు మంచి ఫలితాన్నిచ్చింది.
బెల్లంకొండ సురేష్‌ కుమారుడు శ్రీనివాస్‌ తొలి ప్రయత్నంగా చేసిన ‘అల్లుడు శీను’ విజయవంతం కాగా, అతని మరో సినిమాకి అన్ని ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. తొలి సినిమాని వినాయక్‌తో చేసిన శ్రీనివాస్‌, రెండో సినిమాని బోయపాటి శ్రీనుతో చేస్తున్నాడు. బోయపాటి, బాలకృష్ణతో ‘సింహ’, ‘లెజెండ్‌’ వంటి గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు. ఈ సినిమా కూడా ‘అల్లుడు శీను’ తరహాలోనే భారీ బడ్జెట్‌ చిత్రమట.
వయసుకు మించిన బరువైన పాత్రలో శ్రీనివాస్‌ తొలి సినిమాలో నటించాడు కాబట్టి, రెండో సినిమాలో ఆ బరువు ఇంకా ఎక్కువైనా, అది పెద్దగా తెలియదని బెల్లంకొండ సురేష్‌ కూడా అనుకుంటున్నాట్ట. పుత్రోత్సాహం చాలా గొప్పది. అందుకే ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు బెల్లంకొండ సురేష్‌. ఆ డేరింగ్‌ని మెచ్చుకోవాలి ఎవరైనా.

మరిన్ని సినిమా కబుర్లు
bunny tries well...