Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
great son

ఈ సంచికలో >> సినిమా >>

మంచి ప్రయత్నం చేసిన బన్నీ

bunny tries well...

‘ఆర్య’ లాంటి సినిమా ఇంకో హీరో ఎవరూ చెయ్యరేమో. ఎందుకంటే ఆ సినిమాలో హీరో పాత్ర కొంత నెగెటివ్‌గా ఉంటుంది. ‘ఆర్య`2’ కూడా అంతే. ఆ రెండు సినిమాలూ ఒప్పుకోవడం అనేది సాహజం. అది అల్లు అర్జున్‌ చేసి చూపించాడు. కొత్త దనం కోసం తానెంత తపిస్తాడో నిరూపించాడు అల్లు అర్జున్‌. ఆ రెండు సినిమాల దర్శకుడు సుకుమార్‌, అల్లు అర్జున్‌తో ఓ షార్ట్‌ ఫిలిం తీశాడు.స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ ప్రయత్నం జరిగింది. ఇది వీక్షకులకు అందుబాటులోకి కూడా తెచ్చారు. ఓ చిన్న ప్రయత్నం, సమాజం కోసం అని అల్లు అర్జున్‌, సుకుమార్‌ చెప్పారు. ఎవరి బాధ్యతలు వారు నిర్వహించడం కూడా సమాజానికి మేలు చేయడమే అన్న మంచి ఆలోచనతో ఈ షార్ట్‌ ఫిలిం రూపొందించబడిరది. షార్ట్‌ ఫిలిం అయినా పాతిక లక్షలకు పైన తీసుకునే సుకుమార్‌, ఈ షార్ట్‌ ఫిలింని ఉచితంగా చేశాడంట.పెద్ద హీరోలతో సినిమాలు చేసే సుకుమార్‌, పెద్ద పెద్ద డైరెక్టర్లతో కమర్షియల్‌ సినిమాలు చేసే అల్లు అర్జున్‌ ఓ మంచి ప్రయత్నంగా షార్ట్‌ ఫిలిం తీయడం గొప్ప విషయం. ‘ఐ యామ్‌ దట్‌ ఛేంజ్‌’ పేరుతో వచ్చిన ఈ షార్ట్‌ ఫిలింని అందరూ అభినందిస్తున్నారు. మంచి ప్రయత్నమని కొనియాడుతున్నారు. కీపిటప్‌ అల్లు అర్జున్‌ అండ్‌ త్రివిక్రమ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
TSR grand son engejment