Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bunny tries well...

ఈ సంచికలో >> సినిమా >>

టిఎస్‌ఆర్‌ మనవడి నిశ్చితార్ధం

TSR grand son engejment

కాంగ్రెసు పార్టీ నాయకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డికి తెలుగు సినిమా పరిశ్రమతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన్ను సినిమా పరిశ్రమలో అందరూ గౌరవిస్తారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దానికి సినిమా పరిశ్రమ వారు హాజరై, ఆ కార్యక్రమానికి గ్లామర్‌ అద్దుతారు. అలాంటి సుబ్బిరామిరెడ్డి మనవడి నిశ్చితార్ధం 17వ తేదీన హైదరాబాదులో జరుగుతుంది.తన మనవడి నిశ్చితార్ధ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా సినిమా ప్రముఖులకు సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు. చిరంజీవి, శ్రీదేవి, జయప్రద, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి హేమాహేమీలు ఈ నిశ్చితార్ధ కార్యక్రమానికి హాజరవుతారని తెలియవస్తున్నది.సినిమా రంగంలో ఉన్నవారితోపాటుగా రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులూ పెద్ద సంఖ్యలో హాజరై, సుబ్బిరామిరెడ్డి మనవడి నిశ్చితార్ధ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ కానున్నారు. సుబ్బిరామిరెడ్డి మనవడి పేరు రాజీవ్‌ కాగా, ఆయనకు కాబోయే భార్య పేరు కావ్య కోటారెడ్డి, సుప్రజ దంపతుల కుమార్తె

మరిన్ని సినిమా కబుర్లు
no.2 movie completed except one song