Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
TSR grand son engejment

ఈ సంచికలో >> సినిమా >>

ఒక్క పాట మినహా సిరి సినిమా ప్రొడక్షన్ నెం. 2 పూర్తి..!!

no.2 movie completed except one song

.వి.వి సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెం. 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి "వీడు తేడా" ఫేం బి. చిన్ని దర్శకుడు. సుడిగాడు ఫేం మొనాల్ గజ్జర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం లో అల్లరి నరేష్ సోదరి పాత్రను ప్రముఖ సీనియర్ నటీమణి రాధిక కుమార్తె కార్తీక పోషిస్తోంది. ఇటీవలే అల్లరి నరేష్  - మొనాల్ గజ్జర్ లపై.. శేఖర్ చంద్ర స్వర సారధ్యం లో రూపొందిన " రాయే...రాయే...మనసుని లాగకే, లాగకే... మాయ చేసి నన్ను చంపకే పిల్లా " అనే పల్లవితో సాగే పాటను వైజాగ్, గంగవరం పోర్ట్, యారాడ, తంతిడి, భీమలి వంటి ఆహ్లదకరమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు.

చంద్రబోస్ సాహిత్యమందించిన ఈ యుగళ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ దాదాపు పూర్తయిన ఈ  చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఈ నెల చివరి వారం లో విడుదల చేసి, సెప్టెంబర్ మొదటి వారం లో ఆడియోను విడుదల చేయనున్నారు.

హర్షవర్ధన్ రాణె, బ్రహ్మానందం, ఆలి, జయప్రకాష్ రెడ్డి, నాగినీడు, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడి, అభిమన్యు సింగ్, కెల్లీ డార్జ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : శేఖర్ చంద్ర , సాహిత్యం : చంద్రబోస్, ప్రెస్ రిలేషన్స్: వంశీ - శేఖర్, ఎడిటర్ : గౌతం రాజు, పోరాటాలు : రాం - లక్ష్మణ్, చాయాగ్రహణం : విజయ్ కుమార్ అడుసుమిల్లి, కథ : విక్రం రాజు, కార్య నిర్వాహక నిర్మాత : వల్లూరిపల్లి వెంకటేశ్వర రావు, నిర్మాత: అమ్మిరాజు కానుమల్లి, చిత్రానువాదం - దర్శకత్వం : బి. చిన్ని!

మరిన్ని సినిమా కబుర్లు
as soon as early  compleat ice cream - 2 movie shooting