Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope (august 15 to  august 21th)

ఈ సంచికలో >> శీర్షికలు >>

సమరంలో మహిళామణులు. - హైమాశ్రీనివాస్

women power in freedom fight
ఫూర్వం భారత దేశంలో అనేకమంది స్వతంత్రరాజులు తమ రాజ్యాలను, పరగణాలనూ పరిపాలించుకునేవారు. రాను రానూ రాజుల మధ్య విద్వేషాలు, అనైక్యత, అసూయ చోటుచేసుకుని పాశ్చాత్యులకు వ్యాపారార్ధం ప్రవేశం కల్పించి , మనదేశాన్ని దోచుకునే అవకాశం కల్పించారు. ఆతర్వాత వారు ఏకులు మేకులై ,పాలకులై మనలను బానిసలుగాచూసి అనేక కష్టనష్టాల పాలు చేయగా, మనదేశాన్ని మనమే ఏలుకోవాలనే భావనను భారతీయులంతా కలిగి ఉండటంతో, అనేకమంది నాయకుల నాయకత్వంలో స్వతంత్య్రానికై పోరాటాలు జరిగాయి. పురుషులతోపాటుగా మహిళలూ ధైర్య స్థైర్యాలతో పోరాటం సలిపారు. ఈ రోజు ముఖ్యంగా వీరవనితలైన కొందరు మహిళా మతల్లుల గురించీ చెప్పుకుందాం.16వ  శతాబ్దములో పోర్చుగీసు వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా’ అబ్బక్కరాణి ‘చేసిన పోరాటాలు తొలిమహిళా నాయకురాలి పోరాటంగాచెప్పుకోవచ్చు.

జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాలలో ఉద్యమిం చింది.గాందీజీ ఇచ్చిన పిలుపుమేరకు  పురుషులతో సమానంగామహిళలు సైతం స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న తెలుగు మహిళామతల్లులు, డా.దుర్గాబాయ్ దేశ్ ముఖ్, ఆరుట్ల కమలాదేవి, ఆంధ్రాఅనిబి సెంటు గా పేరుగాంచిన శ్రీమతి బత్తుల కామాక్షమ్మ, కనప ర్తి వరలక్ష్మమ్మ, చుండూరి రత్నమ్మ , సూర్యదేవర రాజ్యలక్ష్మీ దేవమ్మ,సరోజినీ నాయుడు,దువ్వూరిసుబ్బమ్మ, కొల్లాకనక వల్లి తాయారమ్మ,అచ్చంటరుక్మిణీ,మాగంటిఅన్నపూర్ణమ్మ, ఉన్నవలక్ష్మీబా యమ్మ, పాకుర్తి సుందరమ్మ,శ్రీమతి వేదాంతంకమలాదేవి,సంగం లక్ష్మిబాయమ్మ, దర్శిఅన్నపూర్ణమ్మ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ దేవులపల్లి సత్యవతి, ,ఙ్ఞానకుమారి , ఎల్లా ప్రగడా సీతాకుమారి ఇంకా అనేకులు. వీరంతా తమకుటుంబానికి దూరమై, వంటి మీది బంగారునగలను గాంధీగారికి సమర్పించి,ఖద్దరు ధరించి, స్వాతంత్య్ర సమర గీతాలు పాడుతూ ,త్యాగాలు చేసి పోలీసు చేతిలోలాఠీదెబ్బలు  తింటూచిత్ర హింసలకుగురై, స్వాతంత్య్ర సమరధీర లుగా చరిత్రలో నిలిచారు.    దుర్గాబాయ్ దేశ్ముఖ్ 12వ ఏటనే రాజమండ్రిలో గాంధీమహాత్ముని పిలుపుకు ఉత్తేజితు రాలై , ఖద్దరు ధరించి, 1930 లో మద్రాసులో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించింది.1920న పిఠాపురం రాష్ట్ర మహిళా సభలో కంఠమెత్తి ఆవే శంగా పాడిన పాటలు భారతీయులందిరిని ఉద్వేగంతో ఊపేసాయి.

కొల్లాయి. గట్టితేనేమి మా గాంధీ- కోమటై పుట్టితే నేమి మా గాంధీ-, ఆపాట విన్నవారందరు ఆ చిన్నపాపను ఎంతో మెచ్చుకున్నారు. ఆమే దుర్గాబాయ్దేశ్ముఖ్. 1896 బాపట్లలో జన్మించిన కనుపర్తి వరలక్ష్మి  స్వయం కృషితో తెలుగుసాహిత్యాన్ని ,సంస్కృతం, హిందీ భాషలను అభ్యసించారు. సహాయ నిరాకరణోద్య మం ముమ్మరం గా సాగుతున్న ఆరోజుల్లో వరలక్షమ్మగారు ఆమె సహచరమహిళలందరు ‘స్వరాజ్యం లక్ష్మీ’ వ్రతం,’ రాట్న లక్ష్మీ’  పూజలు చేసి స్వదేశీ దీక్షా సూత్రాలు కట్టుకున్నారు. నాటి నుండి ఆమె గాంధీ గారి సూచన మేరకు ఖద్దరు ధరించి,బాపట్లలో ‘హీతైషిణీ మండలి’ అనే సంస్థను1931లోస్థాపించి మహిళలకుఆధ్యాత్మిక సాహిత్య విషయాలతో పాటు రాజకీయ క్రియాశీలతను ప్రభోధించిన మేధావి.ఆంధ్రా ఆనిబిసెంటుగా పేరుగాంచిన శ్రీమతి బత్తుల కమాక్షమ్మ, బాలంగంగాధర తిలక్ అన చరుడు ఉన్నవలక్ష్మీ నారా యణను పెళ్లి చేసుకుని సంఘ సేవలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్లొన్నారు .ఉప్పుసత్యాగ్రహం లో పాల్గొని ఉప్పును గ్రామాలలో వండి శాసనదిక్కారం చేశారు. 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 3వసారి ఈమెను అరెస్టు చేసి రాయవేలురు జైలులో 3 నెలలు ఉంచారు. తెలుగు మహిళలకు గుంటూరు ఝాన్సీరాణీ గాకీర్తి పొందిన సూర్యదేవర రాజ్యలక్ష్మీ దేవమ్మ,పత్రికారచయిత గా పేరు పొందారు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు సం.ఫాటు జైలు శిక్ష, విధించిందిం తెల్లదొరతనం. క్విట్ఇండియా ఉద్యమం లో పాల్గొన్నందుకు 1932 నుండి నెల్లూరు,మద్రాసు జైళ్లలో శిక్ష అనుభవించారు.

చుండూరి రత్నమ్మ గాంధీజీ ప్రబోధ న లకు ఆకర్షితులైన నిరాకరణ కార్యక్రమాలను చేపట్టి స్వాతంత్య్ర పాల్గొని జైలుకు వెళ్ళారు. మల్లు స్వరాజ్యం నిజాం నిరంకుశ పాలనపై కత్తికట్టి, కొండజాతి, కోయజాతి, అడవి జాతి వారిని ప్రోగుచేసివారిలో చైతన్యం కలుగజేసింది.ఆరుట్ల కమలాదేవి-మద్య పాన నిషేధానికి ఎంతగానో కృషి చేశారు. స్త్రీలకు ఆదర్శ ప్రాయమయ్యారు.చాకలి ఐలమ్మకులవృత్తి చేపట్టి బట్టలు ఉతికి, జీవితం గడిపేది. అక్షరం ముక్కరాని ఒక చాకలి మహిళ సాహసంతో దొరలను, రజాకార్లను ఎదిరించి, భయపెట్టి ముందుకు సాగింది. ఆమెపోరాటంభూపోరాటాలకునాంది అయ్యింది. మద్దూరి వెంకట రమణమ్మస్వా తంత్య్ర సమరంలో భాగంగా విదేశీవస్త్ర దుకాణాల ముందుపికెటింగ్నిర్వహించి  వెల్లూరు, కన్ననూరు జైళ్లలో ఆరునెలలపాటు శిక్షను అనుభవించిన ధీరురాలు.శివరాజుసుబ్బమ్మ క్విట్‌ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. బారు అలివేలమ్మ బహు భాషా కోవిదు రాలుగా గుర్తింపు పొంది, మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశారు.అలహాబాద్‌లో కమలా నెహ్రూతోకలిసివిదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, కఠిన కారాగారశిక్షను అనుభవించినజాతీయ నాయకురాలు. యువజనసమా వేశాలు నిర్వహించి వారిలో ఉద్యమస్ఫూర్తిని వెలిగించిన తెలుగు దివ్యె పాల కోడేటి శ్యామలాంబ. విదేశీవస్తు బహిష్కరణలోపాల్గొ ని పికెడింగ్‌ నిర్వహించారు. 1932 శాసనోల్లంఘనంలోనూ, 1941లో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలోనూ పాల్గొని కఠిన కారాగార శిక్ష ననుభవించారు. గూడూరి నాగరత్నంగారు వర్ణ వివక్షను రూపుమాపే పంథాలో బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ రంగయ్యను వర్ణాంతర వివాహం చేసుకొని- 'మాటలు కాదు చేతలుండాలి' అని నిరూపించిన నిరుపమాన స్వాతంత్య్ర సమరయోధురాలు! 1926-32లలో శాసనోల్లంఘన ఉద్య మంలో పాల్గొని చాగల్లు పరిసరాలలో హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టి ఖద్దరు ప్రచారం, స్వదేశీ ప్రచారం నిర్వహించిన చేవగల వీరవనిత .

సరోజనీనాయుడుగారి కుమార్తె పద్మజానాయుడు. ఖాదీ వస్త్రాలనువాడమని, విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించమని ఆమె బోధించారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్య మంలో జైలుకెళ్లి, శిక్షను అను భ వించారు. కొడాలి కమలమ్మస్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వీరవనిత. ఖైదీగా రాయ వెల్లూరు సెంట్రల్‌ జైలులోవుంటూ, బ్రిటిష్‌  కాపలాదార్ల కళ్లుగప్పి జాతీయ జెండాను ఎగువేశారు. భూదానోద్యమంలో పాల్గొన్నారు. హరి జనవాడలలో గ్రంథాలయా లు స్థాపించారు. హరిజన మహిళలకు ఉచితంగా రాట్నాలు పంచారు. క్విట్‌ ఇండియా ఉద్యమం లో పాల్గొన్నారు.స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నతెలుగింటిప్రథమమహిళామణి'దువ్వూరిసుబ్మమ్మ'. నిర్భీతికి మారు పేరుగా చెప్పుకునే సుబ్బమ్మనాటి బ్రిటిష్‌ కలెక్టర్‌ ఉద్యమంలో పాల్గొన్నందుకు క్షమాపణ చెప్పమంటే 'నా కాలిగోటికి సైతం నువ్వంటే అసహ్యం' అనిచెప్పినసాహసి!  1922, 30, 32, 42 ప్రాంతాలలో జరిగిన ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న ధీరవనిత దువ్వూరి సుబ్బమ్మ. దుర్భరమైన దారి ద్య్రాన్ని అనుభవించినా తలవంచని వ్యక్తిత్వం గలవారు. రాజమండ్రిలో సనాతన స్త్రీ విద్యాలయాన్ని నెలకొల్పారు. 'దేశబాంధవి' గాపేరుపొందారు.తల్లాప్రగడవిశ్వసుందర మ్మగారు సామూహిక హక్కుల కోసం సమర సంకల్ప సిద్ధురాలై, బ్రిటిష్‌ పాలనకు వ్యతి రేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న సాధ్వీమాత. సామాజిక చైతన్యంతోనే స్వాతంత్య్ర సమరం సజావుగా సాగి, సత్ఫలితాల నిస్తుందనే మార్గంలో రాజమండ్రి ఆర్యాపురం లో 'ఆనంద నికేతన్‌' ఆశ్రమాన్ని స్థాపించి స్త్రీ జనాభ్యుదయం కోసం పాటు పడ్డారు. ఈమె ఉప్పు సత్యాగ్రహం, ఖద్దరు ధారణ, శాసనోల్లంఘన ఉద్య మాల్లో పాల్గొని జైలు శిక్షను అనుభవించిన స్థిరచిత్తురాలు . చేబియ్యం యశోదమ్మ 1932లో శాసన ధిక్కారం చేసి, తన చూలింత తనాన్ని సైతం లెక్కచేయక రామచంద్రా పురం సబ్‌ జైలు లో శిక్షను అనుభవిస్తూ, అక్కడే మగపిల్ల వాణ్ణి కన్నారు. కుల వ్యవస్థను నిర్మూలించాలనే ధ్యేయంతో అగ్రవర్ణాల ప్రాంతమైన రాజమండ్రి ఇన్నీసుపేటలోఉన్నతమసొంత ఇంట్లో 'గాంధీ హరిజన హాస్టల్‌'ను ప్రారంభించిన మహోన్నత వ్యక్తిత్వం కల్గినమహిళా మణి . 930లో ఉప్పు సత్యాగ్రహాల్లో పాల్గొనటమే కాకుండా పోలవరంలో 'స్వరాజ్యఆశ్రమాన్ని' స్థాపించి గిరిజను ల అస్పృశ్యతా నివారణ, అక్షరాస్యత కోసం, ఖాదీ ప్రచారంకోసం విశేషంగా పనిచేశారు. శాసన ధిక్కారం చేసి వెల్లూరు, కన్ననూరు జైళ్లలో కఠిన కారాగార శిక్షను అనుభవించిన అకుంఠిత స్వాతంత్య్ర పిపాసి. స్వాతంత్య్రోద్యమంలో ప్రథమ శ్రేణి నాయకులు జైల్లో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకురాళ్లతో పెద్దాపురం తోటల్లో రహస్య సమావేశాలు నిర్వ హిస్తూ బ్రిటిషు పోలీసుల లాఠీ దెబ్బలను చవి చూసిన ప్పటికీ మడమ త్రిప్పక ముందుకు సాగిన సాహసవంతురాలు.

పెద్దాడ కామేశ్వరమ్మ930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ కాన్ఫ రెన్సులో ప్రముఖ పాత్ర వహించా రు.విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమంలో పనిచేసి, భర్త వెంకటరావుతో కలిసి రాజమండ్రి మెయిన్‌ రోడ్డులో ఖద్దరు దుకాణం నిర్వహించింది. గుజ్జు నాగరత్నం యువతలో స్వాతంత్రో ద్యమ స్ఫూర్తిని కలిగించే కార్యకలాపాలు నిర్వహించినం దుకు 16 నెలలు ఏలూరు, గుంటూరు, వెల్లూరు, కన్ననూరు జైళ్లలో శిక్ష ననుభరించారు. సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవిముతక సైను గుడ్డలతో జైలు గోడల మధ్య జీవించడానికి కూడా వెనుకాడని రాజ్య లక్ష్మి స్వాతంత్య్రోద్యమానికి జీవితాన్ని అంకితం చేశారు. 1శాసనోల్లం ఘనం చేసినందుకు పొన్నూరు జైలులో శిక్షన నుభ వించారు. జైలు రూల్సు ప్రకారం నడుచుకో వాలని గాంధీజీ ఆదేశాన్ని పాటించేవారు.                               
                                         సరోజినీ నాయుడు భారత కోకిలగా (నైటింగేల్ ఆఫ్ ఇండియా)ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరయోధురాలు,కవయిత్రి.చిన్నతనం నుంచే కార్యదీక్షా, పట్టుదలా, విద్యపైపట్టుగలది. మహిళాభివృద్దికి ఎంతో కృషిచేసింది. 1906లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావ డానికి ఎంతో పాటు పడింది. భారత దేశములో గల ముఖ్యమైన, నగర, పట్టణాలు తిరుగుతూ స్వాతంత్రోద్యమ ఉపన్యాసాలిచ్చి, ప్రజలతో భాష విప్లవము వచ్చేందుకు కారకురాలయినది. మృదువుగా మాట్లాడుతూ, ఎంత కఠినమైన విషయాలైనా, శ్రోతల గుండెలను హత్తుకుని యదార్థ స్థితిని అర్థమయ్యే విధంగా ఆమె గంభీరమైన ఉపన్యాలిచ్చేది. "జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు జరిగితే దేశనికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసతనం నీవూ అనుభవించవలసినదే" అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరిపోసిన వీరతిలకం.ఈ విశ్రాంతి లేని ప్రయాణాలతోనూ ,ఉపన్యాసాలతోనూ ఆమెఆరోగ్యంపాడైంది. లండన్ లో చికిత్సకోసం వెళ్ళేసరికే ఆమె గుండె జబ్బుబాగా ముదిరిపోయినదని చెప్పారు వైద్యులు. స్వాతంత్రోద్యమ చరిత్రల పుస్తకాలను అమ్మకూడదనే బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞలుధిక్కరించి శాసన ధిక్కారం చేసి, ఆ పుస్తకాలన్నింటినీ ప్రతివీధిలోనూ అమ్మింది.పురోగతినీ, స్వచ్చమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్య జీవితాలను వాంఛించిన పురుష కవి రవీంద్రనాథ్ ఠాగూర్ వలె స్త్రీయైన ఈమె జాతి విమోచనానికి శాయశక్తులా కృషి చేసిన త్యాగ పూరిత కవయిత్రి శ్రీమతి సరోజినీనాయుడు.1930 వ సంవత్సరంలో ఈమెను అరెస్టు చేసింది. 

సమర్థురాలైన నాయకురాలినిదాదాపు 1945 వరకు దుర్బర కారాగారవాస జీవితం నవ్వుతూ అను భవించింది.  అనారోగ్యంగా ఉన్న కారణంగా ఆమెను విడుదల చెయ్యవలసి వచ్చింది. ఆనాటి వీరనారీమణూలను నేటి వారితో పోల్చుకుంటే వారెంత ఘనులో తేటతెల్లమవుతుంది.ఈ స్వతంత్య దినోత్సవం సందర్భంగా ఈవీరనారీమణులకు మనహృదయ పూర్వక అంజలులుఘటించి కృతఙ్ఞతలు తెలుపుకుందాం. --
మరిన్ని శీర్షికలు
okkasaari T.V  lo chooste chaalu