Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
no.2 movie completed except one song

ఈ సంచికలో >> సినిమా >>

శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఐస్ క్రీం సీక్వెల్ ఐస్ క్రీం-2

as soon as early  compleat ice cream - 2 movie shooting

'ఐస్ క్రీం' సినిమాతో తెలుగు సినిమా మేకింగ్ లో ఓ సరికొత్త ఒరవడిని సృష్టించిన దర్శక సంచలనం రాం గోపాల్ వర్మ... తాజాగా ఆ చిత్రానికి సీవెల్ రూపొందిస్తుండడం తెలిసిందే. ఐస్ క్రీం టూ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగం గా షూటింగ్ జరుపుకుంటోంది. భామవరం టాకీస్ పతాకం పై తుమ్మల పల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం లో జె.డి . చక్రవర్తి, జీవా, నందు (గీతా మాధురి ), భూపాల్, సిద్ధు, ధన్ రాజ్, శాలిని, గాయత్రి, రాం గుప్తా, ప్రభాకర్, బినోజి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంటర్నెట్ లో తన ఫోటోలతో యువత ను ఉర్రూతలూగిస్తున్న  "నవీన " అనే అందాల భామ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతోంది. సెప్టెంబర్ లో విడుదల అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. రాం గోపాల్  వర్మ నూతనం గా ఏర్పాటు చేసిన "ఎన్. టి. ఎఫ్. ఐ" (న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ) ద్వారా నిర్మాణమవుతున్న తొలి చిత్రం ఐస్క్రీం - 2   కావడం గమనార్హం. అత్యంత ఆధినిక సాంకేతిక పరిజ్ఞానంతో.. సరికొత్త నిర్మాణ పద్దతులతో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలయ్యాక ఇంకెన్ని అద్భుతాలను ఆవిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే!  ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్: నవీన్ కళ్యాణ్ - కాశి, ప్రెస్ రిలేషన్స్: ధీరజ అప్పాజీ, టెక్నికల్ ఇంచార్జ్: అరుణ్ ఇక్బాల్, నిర్మాత : తుమ్మల పల్లి రామసత్యనారాయణ, కథ- మాటలు- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: రాం గోపాల్ వర్మ!!

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam