Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondi chooddam

ఈ సంచికలో >> సినిమా >>

రియల్‌ లెజెండ్‌ బాలచందర్‌

బాలచందర్‌ ఇక లేరన్న వార్త ‘సినిమా’ రంగాన్ని కుదిపేసింది. ప్రతి ఒక్కరూ కన్నీరుమున్నీరయ్యారు. తెలుగులో విలన్‌ వేషాలు వేసే జీవా అనే నటుడి నుంచి విశ్వ నటుడు కమల్‌హాసన్‌ వరకూ ఆయన ‘స్కూలు’ నుంచి వచ్చిన ఎందరో నటనా రంగంలో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించారు. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌లకు నటనా పాఠాలు నేర్పించింది ఆయనే.

తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా, కన్నడ సినిమా అని కాదు. ఏ సినిమా అయినా బాలచందర్‌ని చూసి చాలా నేర్చుకోవాలి, నేర్చుకుంది కూడా. రచన, దర్శకత్వం, నిర్మాణం ఇలా అన్ని విభాగాల్లోనూ రాణించిన గొప్ప సినీ జీవి బాలచందర్‌. అతని సినిమాల్లో సహజత్వం వుంటుంది. అతని సినిమాలు చూస్తే ప్రశ్నించేతత్వం పెరుగుతుంది. అతను ఓ నిఘంటువు.

సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఎక్కువగా తీసిన బాలచందర్‌, స్త్రీ పక్షపాతి. ‘అంతులేని కథ’ అయినా, ‘ఆకలి రాజ్యం’ అయినా, ‘రుద్రవీణ’ అయినా ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం. దానికన్నా గొప్పది ఇది, దీనికన్న గొప్పది ఇంకొకటి. అది బాలచందర్‌కి మాత్రమే సాధ్యమైంది. ఎందరో మహనీయులు, అందులో బాలచందర్‌ కూడా ఒకరు. ఆయన ఇక లేరు. భౌతికంగా మాత్రమే. తన సినిమాల ద్వారా ‘సినిమా’ ఉనికి ఉన్నంతవరకూ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ జీవించే వుంటారాయన.

మరిన్ని సినిమా కబుర్లు