Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
abba inkaa time vundi leddoo

ఈ సంచికలో >> శీర్షికలు >>

దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!


న్యూజెర్సీ లోని నివార్న్ అనే ఊరికి చెందిన దొంగ జాన్ ఫజ్జోలా ఓ బార్ లో కూర్చుని తాగుతూ .32  రివాల్వర్ లా కనిపించే సిగరెట్ లైటర్ తో సిగరెట్ల్ అంటించుకోసాగాడు. కొన్ని రౌండ్లు తాగాక ఓ జేబు బదులు ఇంకో జేబులోంచి రివాల్వర్ ను తీసి వెలిగించుకోబోతూ తనని తనే కాల్చుకోబోతున్నాడు. ఆ జేబులో నిజం రివాల్వర్ వుండడంతో, పోలీఎసులు వచ్చి చూస్తే క్రితం రోజు రాత్రి ఓ దుకాణం లోంచి దొంగిలింపబడ్డ  .32 రివాల్వర్  లా కనిపించే సిగరెట్ లైటర్ల దొంగ ఇతనే అని తేలింది
 


ఇడాహో రాష్ట్రం లోని త్విన్ ఫాల్స్ కి చెందిన ఓ దొంగ తను ముదించిన దొంగ నోట్లని ఓ బేంకులో డిపాజిట్ చేస్తూ పోలీసులకి దొరికిపోయాడు. ఒకో నోటు  విలువ 10 లక్షల డాలర్లు! ఇలాంటివి 999 నోట్లని డిపాజిట్ చేయడానికి బేంకు కి తెచ్చాడు. 1923 లో యు.కె.. కెనెడాలలో ముద్రించిన హోల్స్ బ్లాంకెట్ సిల్వర్ సర్టిఫికెట్ నోట్లకి అవి డూబ్లికేట్లు. వాటిలో ఏవీ ప్రస్తుతం సర్క్యులేషన్ లో లేవు. 

మరిన్ని శీర్షికలు
tanguturi prakasam pantulu