Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

ఆ హీరో ఏం చేసినా సంచలనమే

every thing is sensation

సిక్స్‌ ప్యాక్‌ అయినా, బోడి గుండు అయినా ఇంకేదైనా అతనేం చేసినా అదో ట్రెండ్‌ అవుతుంది. హిందీ చిత్ర రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువు అయిన అతగాడే అమీర్‌ఖాన్‌. ‘పి.కె.’ అనే సినిమాలో నటిస్తున్నాడు అమీర్‌ఖాన్‌ ఇప్పుడు. ఆ సినిమా టైటిల్‌ నుంచి సినిమాలోని తన పాత్ర వరకు అన్నిటా చాలా ప్రత్యేకతలు చూపిస్తున్న అమీర్‌ఖాన్‌, ఆ సినిమా కొత్త పోస్టర్‌తో అభిమానుల్ని అలరించాడు.

ఇదివరకు ఓ స్టిల్‌ లీక్‌ అవడం కారణంగా అదో వివాదంగా మారింది. కావాలనే లీక్‌ చేశారో, సినిమా యూనిట్‌కి తెలియకుండా లీకైందోగాని అందులో అమీర్‌ఖాన్‌ నగ్నంగా కనిపించేసరికి ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు, అమీర్‌ఖాన్‌పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ. కాని ఆ వివాదం, సినిమా యూనిట్‌కి ఇబ్బందిగా మారలేదు. నగ్నంగా ఉన్న ఫొటో ప్రపంచ వ్యాప్తంగా సర్కులేట్‌ అయి, ఇంటర్నెట్‌లో కొత్త సంచలనాలు నమోదు చేసింది.

లీక్‌ ఫొటో వివాదం అలా ఉంచితే కొత్తగా సినిమా యూనిట్‌ ఇంకో ఫొటోని అధికారికంగా విడుదల చేసింది. ఇందులో నగ్నత్వం ఏమీ లేదు. కాని డిఫరెంట్‌ లుక్‌తో ఉంది. అమీర్‌ఖాన్‌ వేసుకున్న దుస్తులూ కొత్తగా ఉన్నాయి. అందుకనే నగ్న ఫొటోకంటే ఈ ఫొటోకి ఇంకా ఎక్కువ స్పందన లభిస్తోందంట. అక్కడున్నది అమీర్‌ఖాన్‌, అతనేం చేసినా సంచలనమే. ఎందుకు రాదూ స్పందన?

మరిన్ని సినిమా కబుర్లు
big heroine for small movies