Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
every thing is sensation

ఈ సంచికలో >> సినిమా >>

చిన్న సినిమాలకి ‘పెద్ద’ హీరోయిన్‌

big heroine for small movies

తేజ దర్శకత్వంలో వచ్చిన ఫ్లాప్‌ సినిమా ‘నీకు నాకు డాష్‌ డాష్‌’ హీరోయిన్‌ నందితకి తొలి సినిమా. అది ఫ్లాపయ్యాక, నందిత హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం కష్టం అని సినిమా పరిశ్రమలో కొందరు అనుకున్నారు. కాని మారుతి రూపొందించిన ‘ప్రేమ కథా చిత్రం’ సినిమా ఆమె అదృష్టాన్ని మార్చేసింది. అంతే నందిత పెద్ద హీరోయిన్‌ అయిపోయింది చిన్న సినిమాల వరకూ.

‘ప్రేమ కథా చిత్రం’ తర్వాత ఆచి తూచి అడుగులేస్తోన్న నందిత నటించిన కొత్త సినిమా ‘లవర్స్‌’ సినిమా కూడా బాగానే ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. చేతిలో బోల్డన్ని సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న నందితను, చిన్న సినిమాల ‘సమంత’ అని కూడా పిలుస్తున్నారట. తెలుగమ్మాయిల్లో అర్చన, స్వాతి, బింధు మాధవి వంటివారు తెలుగులోనే కాక, ఇతర భాషల్లోనూ నటించి, గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలానే నందిత కూడా పొరుగు సినిమాల్లో నటించేందుకు అవకాశాలు దక్కించుకుంటోంది.

మలయాళంలో ‘లండన్‌ బ్రిడ్స్‌’ అనే సినిమాలో నటిస్తోంది నందిత. తమిళం నుంచి, కన్నడ నుంచి కూడా నందితకు ఆఫర్లు వస్తున్నాయి. పొరుగు సినిమాలపై ఫోకస్‌ పెట్టి, తెలుగు సినిమాల్ని వదులుకోకుండా, కెరీర్‌ జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటే చిన్న సినిమాలకు పెద్ద హీరోయిన్‌ అనే గుర్తింపు నుంచి, పెద్ద సినిమాల్లో పెద్ద హీరోయిన్‌ అనే గుర్తింపు దాకా ఎదిగే అవకాశం నందితకు ఉంది.

మరిన్ని సినిమా కబుర్లు
That's balayyaa's dedication