Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
That's balayyaa's dedication

ఈ సంచికలో >> సినిమా >>

సప్తగిరి సునీల్‌ రేంజ్‌కి వెళ్తాడా?

can saptagiri reach sunil stage?

బ్రహ్మానందంతో ఈ తరం కమెడియన్లను పోల్చలేం. ఎందుకంటే బ్రహ్మానందం ఓ స్టార్‌ హీరో సినిమాకి కూడా ‘కిక్‌’ ఇవ్వగలడు. ఓ పెద్ద హీరో నటించిన యావరేజ్‌ సినిమాని సూపర్‌ హిట్‌ చేయగల సత్తా ఉన్న కమెడియన్‌ బ్రహ్మానందం అంటే ఒప్పుకోవాల్సిందే. అందుకే స్టార్‌ హీరోలు బ్రహ్మానందంను పెట్టుకుని, యాక్షన్‌ ఎంటర్‌టైనర్లను చేస్తున్నారు. హీరో తర్వాత సినిమాలో అంత లెంగ్త్‌ వున్న క్యారెక్టర్లు బ్రహ్మానందంకు దర్శకులు ఇస్తున్నారు.

యంగ్‌ కమెడియన్ల విషయానికి వచ్చినట్లయితే సునీల్‌, కమెడియన్‌లలో బ్రహ్మానందం తర్వాత అంత స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు హీరోగానూ మారాడు. సునీల్‌తో పోల్చదగ్గ కమెడియన్‌గా సప్తగిరి పేరు విన్పిస్తోంది సినిమా రంగంలో. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు సప్తగిరి. బేస్‌ వాయిస్‌ అతనికి పెద్ద ఎస్సెట్‌.

తాగుబోతు రమేష్‌ లాంటివారు కమెడియన్లుగా ఎక్కువ పేరు సంపాదించినా, సప్తగిరి చాలా వేగంగా స్టార్‌ కమెడియన్‌ అయిపోయాడు. ఈ మధ్యనే వచ్చిన ఓ చిన్న సినిమాలో సప్తగిరి పాత్రే ఆ సినిమాకి హైలైట్‌ అయ్యిందని అందరూ అనుకోవడంతో సప్తగిరి మార్కెట్‌ కూడా పెరిగిపోయింది. అలీ లాంటి సీనియర్లు కొన్ని సినిమాలకే పరిమితమవుతుండగా, పెద్ద సంఖ్యలో యంగ్‌ కమెడియన్లు తెరపైకొస్తున్నారు. అలా వచ్చిన వారిలో ఒకడైన సప్తగిరి, సునీల్‌ రేంజ్‌ని అందుకుంటాడా? అనే చర్చ జరుగుతోందంటే అది సప్తగిరి గొప్పతనమే కదా.

మరిన్ని సినిమా కబుర్లు
ever charming shilpa shetty