Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
can saptagiri reach sunil stage?

ఈ సంచికలో >> సినిమా >>

వయసు పెరిగినా వన్నె తగ్గలేదామెకి

ever charming shilpa shetty

వయసేమో 40కి దగ్గరవుతోంది. ఫిజిక్ చూస్తేనేమో ఇంకా పదహారేళ్ళ పడుచు పిల్లలా కనిపిస్తుంది. ఎందుకలా? అనగా ఆమె యోగా చేస్తుంది కాబట్టి అంత నాజూగ్గా శరీరాన్ని మెయిన్‌టెయిన్‌ చేయగలుగుతోంది. తెలుగు ప్రేక్షకులకు ‘సాగరకన్య’గా సుపరిచితురాలైన శిల్పాశెట్టి, పెళ్ళి అయిన తరువాత కూడా ఫిజిక్‌లో మార్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించకమానదు ఎవరికైనా.

యోగా పాఠాలు చెబుతూ ఓ డీవీడీ ఆమె పేరుతో వచ్చినప్పుడు, చెప్పడానికేం ఎన్నయినా చెప్తారు అని పెదవి విరిచారు కొందరు. ఆ యోగాతో శరీరాన్ని నాజూగ్గా, అందంగా ఎలా ఉంచుకోవాలో తనను చూసి నేర్చుకోండని ఇప్పటికీ చెబుతూ వస్తోంది శిల్పాశెట్టి. 39 ఏళ్ళ శిల్పాశెట్టికి సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నా, కుటుంబంతో గడపడం కోసమే సినిమాలు చేయడంలేదని అంటోందీ నాజూకు భామ.

అందం ఆనందాన్నిస్తుంది, ఆనందం ఆరోగ్యాన్నిస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే అందంగా ఉండటానికి ప్రయత్నించాలి. నాజూకైన దేహంతో ఆరోగ్యంగా ఉండొచ్చుగనుక, సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని యోగా నేర్చుకోమని సలహాలిస్తుంటుంది శిల్పాశెట్టి. చెప్పడం మాత్రమే కాదు, ఆచరించి చూపుతోన్న శిల్పాశెట్టి, నలభైల్లోనే కాక యాభైల్లోనూ ఇంతే నాజూగ్గా ఉంటుందేమో.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam