Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : నీ జతగా నేనుండాలి

Movie Review - Nee Jathaga Nenundali

చిత్రం: నీ జతగా నేనుండాలి
తారాగణం: సచిన్‌ జోషి, నజియా హుస్సేన్‌, శశాంక్‌, రావు రమేష్‌ తదితరులు
చాయాగ్రహణం: వసంత్‌
సంగీతం: మిధున్‌, జీత్‌ గంగూలీ
నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌
దర్శకత్వం: జయ రవీంద్ర
నిర్మాత: బండ్ల గణేష్‌
విడుదల తేదీ: 22 ఆగస్ట్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే :
ఓ బార్‌లో రాఘవ్‌ జయ్‌రామ్‌ (సచిన్‌ జోషి)కి గాయత్రి (నజియా) పరిచయమవుతుంది. తొలి పరిచయంలోనే నజియాలోని సింగింగ్‌ టాలెంట్‌ని గుర్తిస్తాడు రాఘవ్‌. ఆమెను పెద్ద సింగర్‌ని చేయాలనుకుంటాడు. అన్న మాట ప్రకారం గాయత్రిని సింగర్‌గా మలచుతాడు రాఘవ్‌. తనను సింగర్‌గా మార్చిన రాఘవ్‌ని ప్రేమిస్తుంది గాయిత్రి. ఇద్దరూ సహజీవనం చేస్తారు. సింగర్‌గా ఉన్నత శిఖరాల్ని అధిరోహించేందుకు దూసుకుపోతోన్న గాయత్రికి, రాఘవ్‌ బిహేవియర్‌ ప్రతిబంధకంగా మారుతుంది. తాను ఇష్టపడ్డ గాయత్రిని గొప్ప సింగర్‌గా మార్చిన రాఘవ్‌, తనకారణంగా గాయత్రి కెరీర్‌ ఇబ్బందిలో పడుతోంటే ఏం చేశాడు? తాగుడుని వదిలేశాడా? లేదా గాయత్రిని వదిలించుకున్నాడా? అనేది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే :
నటుడిగా మంచి పాత్ర దక్కినా, సాదా సీదా పెర్ఫామెన్స్‌తోనే సరిపెట్టాడు హీరో సచిన్‌. తానెంతో ఇష్టపడి హిందీ నుంచి ‘ఆషికి`2’ని తెలుగులోకి తీసుకొచ్చిన సచిన్‌, తెలుగు వెర్షన్‌లో మెచ్యూర్డ్‌ నటనను ప్రదర్శించాల్సి వుంది. ఎన్ని సినిమాలు చేసినా, అతనిలో ఎక్స్‌ప్రెషన్స్‌ మాత్రం పలకడంలేదు. హీరోయిన్‌గా నజియా ఫర్వాలేదు. బరువైన పాత్ర కావడంతో ఆమె కూడా తేలిపోయినట్లే అనిపిస్తుంది నటన విషయంలో. రావు రమేష్‌, శశాంక్‌ తమ ఉనికి చాటుకున్నారు. ఇతర పాత్రధారులు పెద్దగా సినిమాకి ఉపకరించిందేమీ లేదు.

హిందీలో మ్యూజికల్‌ హిట్‌ అయిన ‘ఆషికి`2’ని తెలుగులోకి తీసుకొచ్చిన కారణంగా, మ్యూజిక్‌కి తెలుగులోనూ ఇంపార్టెన్స్‌ ఇచ్చారు. పాటలు బాగున్నాయి. ఖర్చు విషయంలో వెనుకాడలేదనే విషయం తెలుస్తుంది. సినిమాని రిచ్‌గానే తెరకెక్కించారు. దర్శకుడు పెద్దగా కథలో మార్పులు చేయకుండానే నెట్టుకొచ్చేశాడు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. ఎడిటింగ్‌ బాగానే వుంది. కాస్ట్యూమ్స్‌ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. ఫొటోగ్రఫీ రిచ్‌గా వుంది. అదొక్కటీ ఈ సినిమాకి ఎస్సెట్‌.

మంచి ఫీల్‌ వున్న లవ్‌ స్టోరీకి దాన్ని పండించగల నటులైతే ఇంకా అందంగా ఉంటుంది. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్‌. ఫీల్‌ మిస్‌ అవడంతోపాటు, నెరేషన్‌ కూడా స్లోగా సాగింది. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ దాదాపు ఒకేలా సాగాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే : ఒరిజినల్‌లో ఫీల్‌, రీమేక్‌లో కనిపించలేదు

అంకెల్లో చెప్పాలంటే : 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with aadi