Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
padya mandapam book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Vinayaka Chavithi

వారఫలం (ఆగష్టు 29 నుండి సెప్టెంబర్ 4 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

 ఈ వారం మొత్తంమీద కుటుంభంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట వలన నలుగురిలో ఆశించిన విధంగా మంచి పేరును సంపాదించుకొనే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో చేసిన ఆలోచనలు ఆశించిన విధంగా మార్పులను కలుగజేయుటకు అవకాశం ఉంది. దూరప్రదేశాలు  చేయునపుడు స్వల్ప జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చు సూచనల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. స్త్రీల మూలాన కొత్త కొత్త సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. శుభకార్యముల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. పెద్దలనుండి వచ్చు సూచనలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయుట మంచిది.   

 

వృషభ రాశి

ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో చేపట్టిన పనులలో ఆశించిన ఫలితాలు పొందుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో అధికారుల నుండి సహాయసహకారాలు లభించట వలన సంతోషకరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. పెద్దలతో కలిసి చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇస్తాయి ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయకండి వీలైతే వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. వారంచివరలో విందులలో మిత్రులతో కలిసి పాల్గొనే ఆస్కారం కలదు. కుటుంభంలో మార్పులను కోరుకుంటారు ఆ దిశగా చర్చలు చేయుటకు అవకాశం కలదు. స్త్రీ సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన అలాగే మిత్రులతో కలిసి చేయుపనుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. నూతన పరిచయాలు పొందుటకు అవకాశం ఉంది వారితో సమయం గడుపుతారు.

 

మిథున రాశి
ఈవారం మొత్తంమీద ఇష్టమైన పనులను చేపట్టుటకు ఇష్టం చూపిస్తారు వారితో సమయం గడుపుతారు. నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అధికారుల నుండి పనిఒత్తిడి తప్పక పోవచ్చును ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు స్వల్ప ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలు కలుగుతాయి వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టినపనులకు సంభందించిన విషయాల్లో పెద్దల అభిప్రాయాలు మీకు ఉపయోగపడే ఆస్కారం కలదు. కుటుంభంలో సభ్యుల ద్వార నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రయత్నం పెంచుట వలన మేలుజరుగుతుంది

 

కర్కాటక రాశి
ఈవారం మొత్తంమీద అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు అధికారులకు అనుగుణంగా నడుచుకొని పనిలో శ్రమను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉండే అవకాశం కలదు. దూరప్రదేశ ప్రయాణాలు చేయవలసి రావోచ్చును కాకపోతే ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చును. స్త్రీ పరమైన విషయాలలో నూతన సమస్యలు వచ్చిపడుతాయి జాగ్రత్త. వ్యాపారపరమైన విషయాల్లో వారం మధ్యలో కొంత ధననష్టం వచ్చే అవకాశం కలదు కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. అనవసరమైన ఆలోచనలకు అవకాశం ఇవ్వకండి మానసికంగా దృడంగా ఉండుట సూచన.

 

సింహ రాశి

ఈవారం మొత్తంమీద అధికారులతో అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది సూచన. ప్రయాణాలు చేయకండి వీలయితే వాయిదా వేయుట మంచిది. ఒకవార్త మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది కావున మానసికంగా దృడంగా ఉండుట అనేది సూచన. వ్యాపారపరమైన విషయాల్లో చాలాజాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళుట అనేది సూచన. అనవసరమైన వివాదములకు దూరంగా ఉండుట అనేది సూచన. కుటుంబసభ్యులతో చేయుచర్చల విషయంలో పెద్దల అభిప్రాయలను తీసుకొని ముందుకువెళ్ళుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశప్రయాణాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.   

 

 

కన్యా రాశి
......ఈవారం మొత్తంమీద ఆరంభంలో మిత్రులనుండి ఆశించిన విధంగా సహకారం పొందుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనుల విషయంలో సరైన అవగాహన ఉన్నచో విజయంను పొందుటకు ఆస్కారం కలదు కావున ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. శత్రువుల నుండి వచ్చు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మాటలు పొదుపుగా వాడుట అనేది సూచన. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. అనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. ఉద్యోగంలో మీయొక్క ప్రయత్నాలు పూర్తీస్థాయి ఫలితాలు ఇవ్వకపోవచ్చును. వ్యాపారంలో పెద్దల నుండి వచ్చు సూచనల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది

తులా రాశి
ఈ వారం మొత్తంమీద ప్రయాణాలు చేయునపుడు వాహనముల మూలాన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారంలో మిశ్రమఫలితాలు పొందుతారు అనుభవజ్ఞుల సూచనలు మీకు సహయపడుతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట వలన మేలుజరుగుతుంది. ఇష్టమైనవారిని కలుస్తారు వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. విదేశీప్రయత్నాలు చేయుట మంచిది గత కొంతకాలంగా ఆగిఉన్న పనులు ముందుకు కదులుటకు అవకాశం ఉంది. అధికమైన ఆలోచనల మూలాన సతమతమయ్యే అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి తీసుకొనే నిర్ణయాలు కీకమైనవిగా ఉండే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన.  

 

వృశ్చిక రాశి

ఈ వారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు. వ్యాపారంలో నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాల విషయంలో తొందరపాటు ఆలోచనలు చేయకండి,పనిలోశ్రమను పొందుటకు అవకాశం ఉంది ప్రణాళికా బద్దంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో సభ్యులతో చర్చల్లో పాల్గొనేటప్పుడు అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. సంతానపరమైన విషయాల్లో అబివృద్దిని పొందుటకు అవకాశం కలదు వారిమూలన గౌరవాన్ని పొందుతారు. విందులలో పాల్గొంటారు దూరప్రదేశం నుండి నచ్చిన వార్తలను వినేఅవకాశం ఉంది. వారం చివరలో వ్యాపారంలో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో బాగానే ఉంటుంది.  

 

 

ధనస్సు రాశి
ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట వలన అధికారుల నుండి మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ది ఉంటుంది కాకపోతే ప్రయత్నం చేయుట మంచిది. బంధుమిత్రుల నుండి వచ్చు సూచనలు మీలో కొంత మార్పులకు దోహదపడే అవకాశం ఉంది కావున బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. వారంచివరలో ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది ఈ విషయంలో కట్టడికి ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఎవరికి ప్రమాణం చేయకండి అప్పులు ఇవ్వకపోవడం అలాగే తీసుకోకపోవడం అనేది మంచిది. తండ్రితరుపు బంధువుల నుండి నూతన సమాచరం తెలుసుకొనే అవకాశం ఉంది మంచి ఆలోచనలు అవసరం.      

 

మకర రాశి

ఈ వారం మొత్తంమీద ఆరంభంలో కొంత ఇబ్బందులు పొందినను వాటిని ఎదుర్కొని నిలబడడం ద్వార మంచిఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. స్వల్పఅనారోగ్యసమస్యలు తప్పకపోవచ్చును కావున అరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట వలన లబ్దిని పొందుతారు. వారంచివరలో మిత్రుల ద్వార ఇబ్బందులు కలుగుటకు అవకాశం  ఉంది జాగ్రత్త. నూతన ప్రయత్నాల విషయంలో పెద్దలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. అధికారుల నుండి వచ్చు సూచనలు అభివృద్దిని కలుగజేయుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో కలిసి వ్యాపారపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట అనేది మంచిది. దూరప్రదేశాలు కలిసి వస్తాయి ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు.           

 

 

కుంభ రాశి

ఈ వారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం కలదు ఈ విషయంలో వారిసూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. సొంతనిర్ణయాలు తీసుకొనేముందు బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి లేకపోతే నూతన సమస్యలు పొందుటకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. బంధువులతో  సమయం గడుపుతారు వారికి నచ్చిన విధంగా వ్యవహరించుట సూచన. తల్లితరుపు బంధువుల నుండి వచ్చు సమాచరం మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయాణాలు చేయవలసి రావొచ్చును మిత్రుల సహకారం తీసుకోవడం మంచిది. వ్యాపారంలో తీసుకొనే నిర్ణయాలు ముక్యమైనవిగ ఉండే అవకాశం కలదు.       

 

 

మీన రాశి
ఈ వారం మొత్తంమీద  నలుగురిలో ఆశించిన విధంగా మంచి గుర్తింపును పొందుతారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. అధికారుల నుండి సేకరించిన సమాచరం మీకు బాగా ఉపయోగపడుతుంది. బంధుమిత్రులతో కలిసి తీసుకొనే నిర్ణయాలు కుటుంభంలో మార్పులకు అవకాశం ఇస్తుంది. మిత్రులనుండి విలువైన సమాచరం సేకరిస్తారు వారితో కలిసి తలపెట్టిన పనులలో చిన్న చిన్న మార్పులకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది  అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. కొన్ని కొన్ని విషయాల్లో అనవసరమైన చర్చలకు అవకాశం ఉంది కాకపోతే విభేదాలకు అవకాశం ఇవ్వకండి నిదానం అవసరం.       

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
sahiteevanam