Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

Happy Vinayaka Chavithi

మాస్‌ రాజా ‘పవర్‌’ఫుల్‌ అంచనాలు

maas raja power full expectations

మాస్‌ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘పవర్‌’ విడుదలకు సిద్ధమైంది. ‘మాస్‌ అంటే బస్‌ పాస్‌ కాదురా..’ అని టీజర్‌తోనే సినిమాపై అంచనాల్ని పెంచేశాడు రవితేజ. ముందు మాస్‌ లుక్‌తో టీజర్‌లో కనిపించినా ట్రైలర్‌కొచ్చేసరికి క్లాస్‌ లుక్‌తో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించి అభిమానుల్ని రవితేజ అలరించేశాడు. అందుకే ‘విక్రమార్కుడు’ తరహాలో ఈ సినిమా ఉంటుందనే అంచనాకి సినీ వర్గాలూ వచ్చేశాయి.

ఇప్పటివరకు రవితేజ హీరోగా నటించిన ఏ సినిమాలకు జరగనంతగా గొప్ప బిజినెస్‌ సినిమా విడుదలకు ముందే ‘పవర్‌’కి జరిగిందని సినిమా వర్గాల్లో చెప్పుకుంటున్నారు. రవితేజతో తొలిసారి ఈ సినిమాలో హన్సిక జత కడుతోంది. హీరోయిన్‌గా వరుస సక్సెస్‌లతో దూసుకెళుతున్న రెజీనా ఈ సినిమాలో ఇంకో కథానాయకి.

మినిమమ్‌ గ్యారంటీ హీరో అనే రేంజ్‌ ఎప్పుడో దాటేసిన రవితేజ, ఓ మోస్తరు హిట్‌తో దాన్ని కమర్షియల్‌గా గొప్ప విజయంగా మలచగలడనే స్థాయికి ఎదిగాడు. ‘పవర్‌’ సినిమా విడుదలకు ముందు పోజిటివ్‌ బజ్‌ ఉండటం వలన సినిమాకి సూపర్బ్‌ ఓపెనింగ్స్‌ వస్తాయని అంచనా వేస్తున్నారు సినీ ట్రేడ్‌ వర్గాల్లోనివారు. బెస్టాఫ్‌ లక్‌ మాస్‌ రాజా.

మరిన్ని సినిమా కబుర్లు
raviteja, kona very very special