Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
save temple short  flim celebrations

ఈ సంచికలో >> సినిమా >>

Happy Vinayaka Chavithi

‘పవర్‌’ శాటిలైట్‌ రికార్డ్‌

pawer satilite record

రవితేజ హీరోగా నటించిన ‘పవర్‌’ సినిమా విడుదలకు ముందే సినీ వర్గాల్లో సంచలనాలకు కారణమవుతోంది. సినిమాపై భారీ అంచనాలుండగా, సినిమా బాగా వచ్చిందన్న ఇన్‌సైడ్‌ టాక్‌తో సినిమాకి రిలీజ్‌కి ముందు బిజినెస్‌ సూపర్బ్‌గా జరిగిందట. తెలుగు సినిమా శాటిలైట్‌ మార్కెట్‌ కూడా విస్తరించడంతో, అక్కడా ‘పవర్‌’ తన సత్తా చాటిందని చెబుతున్నారు ఇండస్ట్రీలో.

సినీ వర్గాల్లో నడుస్తున్న టాక్‌ని బట్టి, రవితేజ ‘పవర్‌’ సినిమాని ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ ఏడు కోట్ల పాతిక లక్షలకు సొంతం చేసుకుందట. అది మాటీవీ అని సమాచారం. టాప్‌ ఫైవ్‌ హీరోస్‌కి మాత్రమే ఈ స్థాయి మార్కెట్‌ ఉంది. ఆ మార్కెట్‌కి ధీటుగా రవితేజ తన మార్కెట్‌ని విస్తరించుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవడం సహజమే.

కర్నాటకలో ప్రముఖ చిత్ర నిర్మాత అయిన రాక్‌ లైన్‌ వెంకటేష్‌ నిర్మిస్తున్న ‘పవర్‌’ చిత్రానికి కె.ఎస్‌. రవీంద్ర దర్శకుడు. థమన్‌ సంగీతం అందించిన ఈ ‘పవర్‌’ చిత్రంలో రవితేజకి జోడీగా హన్సిక, రెజినా నటించారు.

మరిన్ని సినిమా కబుర్లు
three movies for anushka adter arumdhati