Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

Happy Vinayaka Chavithi

ఎన్టీఆర్ అభిమానిగా తీసిన సినిమా ఇది! - సంతోష్ శ్రీ‌న్‌వాస్

interview

సంతోష్ శ్రీ‌నివాస్‌.... కుర్రాడు చ‌క్క‌గా ప‌క్క‌పాపిడి దువ్వి, లేత రంగు దుస్తులు వేసుకొని.. అప్పుడే కాలేజీ నుంచి ఇంటికొచ్చిన కుర్రాడిలా ఉంటాడు. కానీ తీసేవ‌న్నీ మాస్ సినిమాలే. మొన్న కందిరీగ‌. ఇప్పుడు... ర‌భ‌స‌. తొలి సినిమాతోనే హిట్ కొట్టి, రెండో సినిమాకే ఎన్టీఆర్ తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. మ‌ధ్య‌లో జాండీస్ వ‌చ్చి మంచం ప‌ట్టాడు. ఇక ఈ సినిమా ఆగిపోయిన‌ట్టే అనుకొన్నారంతా. అయితే అనారోగ్యం నుంచి మ‌ళ్లీ కోలుకొని... ర‌భ‌స‌ని దిగ్విజ‌యంగా పూర్తిచేశాడు. ర‌భ‌స ఇప్పుడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా సంతోష్ శ్రీ‌నివాస్‌తో గో తెలుగు ప్ర‌త్యేకంగా సంభాషించింది. ఆ క‌బుర్లు ఇవీ..

* ర‌భ‌స‌... భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వ‌స్తున్నారే....
- (న‌వ్వుతూ) ఎన్టీఆర్ సినిమా క‌దా. త‌ప్ప‌దు. దానికి తోడు పాట‌లు, ప్ర‌చార చిత్రాలూ ఆ రేంజులో ఉన్నాయ్‌.

* రెండో సినిమాకే ఎన్టీఆర్‌తో డైరెక్ష‌న్‌.. భ‌లే ఛాన్స్ కొట్టేశారు..
- మ‌రే... నాలుగైదు హిట్లు కొడితే గానీ రాని ఛాన్స్ ఇది. నిజంగా ఇది నా ల‌క్‌..

* ల‌క్‌తో పాటు.. బాధ్య‌త కూడా ఉంటుందిగా...
- అవును. ఆ సంగ‌తి మ‌ర్చిపోలేదు. ఎన్టీఆర్ అభిమానుల‌కు ఓ పండ‌గ‌లా ఉంటుందీ చిత్రం...నేనూ ఎన్టీఆర్‌కి పెద్ద అభిమానిని. వాళ్ల‌కు ఏం కావాలో నాకు బాగా తెలుసు. ఆ అంశాల‌న్నీ ఉండేలా కేర్ తీసుకొని మ‌లిచిన సినిమా ఇది

* ర‌భ‌స‌... పేరులోనే బోలెడు యాక్ష‌న్ ఉంది. మ‌రి సినిమాలో... ?
- యాక్ష‌న్‌తో పాటు అన్నీ ఉంటాయ్‌. ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ సినిమా అంటే పెద్ద కాన్వాస్ కావాల్సిందే. అందుకు త‌గిన క‌థ ఇది.

* ట్రైల‌ర్ చూస్తుంటే సెంటిమెంట్‌నీ పిండేసిన‌ట్టున్నారు..
- మ‌ద‌ర్ సెంటిమెంట్‌కి చోటున్న క‌థ ఇది. ఎన్టీఆర్ లాంటి కొడుకుంటే బాగుంటుంద‌ని ప్ర‌తి త‌ల్లీ అనుకొంటుంది..

* బ్ర‌హ్మానందాన్ని ట్రంప్ కార్డ్‌లా వాడేసిన‌ట్టున్నారు...
- ఔనండీ.. బ్ర‌హ్మానందం- ఎన్టీఆర్ మ‌ధ్య పండిన కామెడీ ఈ సినిమాకి హైలెట్‌. మ‌రోసారి అదుర్స్ గుర్తొస్తుంది...

* స‌మంత‌, ప్ర‌ణీత‌.. గ్లామ‌ర్‌కి కొద‌వ‌లేద‌న్న‌మాట‌..
- క‌మర్షియ‌ల్ లెక్క‌ల ప్ర‌కారం వెళ్లాం. అయినా ఈ క‌థ‌కు ఇద్ద‌రు క‌థానాయిక‌లు కావాలి. స‌మంత పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది..

* కందిరీగ - ర‌భ‌స.. మ‌ధ్య‌లో మూడేళ్ల గ్యాప్‌... ఎందుకింత విరామం?
- మంచి క‌థ కోస‌మేనండి. ఎన్టీఆర్‌లాంటి పెద్ద స్టార్‌తో సినిమా అంటే అన్నిర‌కాలుగానూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. కొంచెం టైమ్ ప‌డుతుంది మ‌రి..

* మ‌ధ్య‌లో కందిరీగ 2 అన్నారు...
- ఆ సినిమా లేదు... మ‌ర్చిపోండి...

* మీ అనారోగ్యం వ‌ల్ల సినిమా మ‌ధ్యలో ఆగిపోయింది. అప్ప‌టి మీ మాన‌సిక ప‌రిస్థితి ఏమిటి?
- అదో బ్యాడ్ టైమ్‌. అయితే ఎన్టీఆర్‌, బెల్లంకొండ సురేష్ ల స‌హ‌కారంతో మ‌ళ్లీ కోలుకొన్నా..

* సినిమా చేతులు మారిందన్న వార్త‌లు వినిపించాయి...
- అదంతా ఉత్తిదే. బెడ్ మీద ఉండే ఈ సినిమాకి ప‌నిచేశా.. ఆ స‌మ‌యంలో నాలుగు పాట‌ల్ని తెర‌కెక్కించాం..

* మీరు చూస్తే అప్పుడే కాలేజీ నుంచి వ‌చ్చిన స్టూడెంట్‌లా ఉంటారు... తీసేవ‌న్నీ మాస్ సినిమాలే...
- అలా క‌నిపిస్తానా.. (న‌వ్వుతూ) ధ్యాంక్సండీ. నేను ఎలాంటి సినిమాల్ని చూడ్డానికి ఇష్ట‌ప‌డ‌తానో, అలాంటివే తీస్తాను. కందిరీగ‌, ర‌భ‌స అలాంటి క‌థ‌లే..

* కెమెరామెన్ గా పనిచేసి.. డైరెక్ట‌ర్ అయ్యారు. ఆ అనుభ‌వం ఎంత వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డింది..?
- చాలా హెల్ప్ చేసింది. పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న‌ప్పుడు ఎలా డీల్ చేయాలో...కాంబినేష‌న్ సీన్స్ ఉన్న‌ప్పుడు ఎలా న‌డుచుకోవాలో తెలిసింది. మూడు త‌రాల ద‌ర్శ‌కుల సినిమాల‌కు ప‌నిచేశా. ఏ ఎమోష‌న్‌ని ఎలా పండించాలో క్షుణ్ణంగా అర్థ‌మైంది.

* త‌ర‌వాతి సినిమా ఏంటి?
- ఇంకా ఏమీ అనుకోలేదు.. ప్ర‌స్తుతం ర‌భ‌స రిజ‌ల్ట్‌పైనే దృష్టి పెట్టా.

* ఓకే... ఆల్ ది బెస్ట్‌...
 థ్యాంక్యూ...

 

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
Rabhasa Movie Review