Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

Happy Vinayaka Chavithi

రభస చిత్ర సమీక్ష

Rabhasa Movie Review

చిత్రం: రభస
తారాగణం: ఎన్టీయార్‌, సమంత, ప్రణీత, బ్రహ్మానందం, జయసుధ, అజయ్‌, షయాజీ షిండే, సీత, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, తదితరులు
చాయాగ్రహణం: శ్యామ్‌ కె నాయుడు
సంగీతం: ఎస్‌ ఎస్‌ తమన్‌
నిర్మాణం: శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: సంతోష్‌ శ్రీనివాస్‌
నిర్మాత: బెల్లంకొండ సురేష్‌
విడుదల తేదీ: 29 ఆగస్ట్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే
ధర్మా (షయాజీ షిండే) సామ్రాజ్యాన్ని కూల్చాలని హైదరాబాద్‌కి వస్తాడు ఎనర్జిటిక్‌ యంగ్‌స్టర్‌ కార్తీక్‌ (ఎన్టీయార్‌). తన మిషన్‌ సక్సెస్‌ అవ్వాలంటే ధర్మా కూతుర్ని లైన్‌లో పెట్టాల్సి వుంటుందని గ్రహిస్తాడు కార్తీక్‌. అయితే ధర్మా కూతురు ఇందు (సమంత)ని లైన్‌లో పెట్టే క్రమంలో కొత్త కొత్త సమస్యలు ఎదురవుతుంటాయి కార్తీక్‌కి. ధర్మా సామ్రాజ్యాన్ని కూల్చడానికి కార్తీక్‌ ప్రయత్నిస్తుంటే, కార్తీక్‌ని అంతమొందించడానికి ఇంకొందరు ప్రయత్నిస్తారు. వారికీ కార్తీక్‌కీ సంబంధమేంటి.? కార్తీక్‌ తాను అనుకున్నది సాధించాడా? ధర్మా కూతుర్ని లైన్‌లో పెట్టాడా? ఇవన్నీ తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే
నటుడిగా ఎన్టీయార్‌లో వంక పెట్టడానికేం లేదు. సహజంగానే పాత్రలో ఒదిగిపోయాడు. నటనా ప్రతిభతో కార్తీక్‌ పాత్రలో రాణించాడు. ఎనర్జిటిక్‌ సీన్స్‌లో ఎనర్జీని ప్రదర్శిస్తూ, సెంటిమెంట్‌ సీన్స్‌లో వాటికి తగ్గట్టుగా నటించి మెప్పించాడు. సమంత గ్లామరస్‌గా కన్పించింది. నటిగా సమంత ఇప్పటికే ప్రూవ్‌ చేసుకుంది గనుక, ఇందు పాత్రతోనూ ఆకట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాలేదామెకి. ప్రణీత కాస్సేపు కన్పించిన పాత్రలో బాగానే నటించింది.

బ్రహ్మానందం కన్పించినంతసేపూ నవ్వించాడు. బ్రహ్మానందం నవ్వులు సినిమాకి అదనపు ఆకర్షణ. జయసుధ మామూలే. రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి రొటీన్‌. అజయ్‌, షయాజీ షిండే కొత్తదనం ఏమీ చూపించలేదు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర నటించారు.
బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. రెండు పాటలు బాగున్నాయి. టోటల్‌గా మ్యూజిక్‌ బాగానే వుంది. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. కామెడీ డైలాగ్స్‌ కొన్ని చోట్ల కడుపుబ్బా నవ్విస్తాయి. ఎడిటింగ్‌లో ఇంకా జాగ్రత్తలు తీసుకుని వుంటే సినిమాకి బాగా హెల్పయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి రిచ్‌ లుక్‌ తేవడంలో సహకరించాయి.

రిస్క్‌  అనవసరం అనుకున్నాడేమో రొటీన్‌ కమర్షియల్‌ సినిమా ఫార్ములాని నమ్ముకుని, అందులో ఎంటర్‌టైన్‌మెంట్‌ని వీలైనంత ఎక్కువగా కలిపేశాడు దర్శకుడు. దాంతో, ఎక్కడా బోరింగ్‌గా అనిపించదు. ఇప్పుడున్న ట్రెండ్‌ ప్రకారం ఆడియన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇష్టపడ్తుండడంతో సినిమా అంతా సరదా సరదాగానే సాగిపోతుంది. అక్కడక్కడా జర్క్‌లు సినిమా వేగానికి నిరోధకాలుగా మారాయి. ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌, ట్విస్ట్‌లు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అన్నీ బాగానే కుదిరాయి. ఇంటర్వెల్‌ తర్వాత సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్‌ పెరుగుతుంది. టోటల్‌గా సినిమా చూసే ప్రేక్షకుల్ని డిజప్పాయింట్‌ అయితే చెయ్యదు. కానీ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కొంతవరకు నిరాశ కలిగిస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
ఎన్టీయార్‌ మాస్‌ అభిమానులు కోరుకునే రభసే

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka