Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ:
ఏకాంబర్ కోసం వచ్చిన వాళ్ళందరూ పీతాంబరం షాపులో ఏదో ఒక వస్తువైనా కొనుక్కుపోతుంటారు.  ఇదేదో బాగానే వుంది అని అనుకుంటాడు ఏకాంబర్ తండ్రి. కానీ ఏకాంబర్ నేం బోర్డ్ తన షాపు ముందర తగిలిస్తానంటే తను చేసిన గొడవ, ఏకాంబర్ కళ్ళల్లో తిరిగిన నీళ్ళు ఒక్కసారిగా గుర్తుచేసుకుంటాడు పీతాంబరం.

...................................................

శెహభాష్! ఈ రోజుల్లో అందరూ మీలా వుంటే వివాదాలు రావు. విభేదాలే వుండవు. ఆల్ ది బెస్ట్. ఇలాగే మీరిద్దరూ కలకాలం కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. పకపకా నవ్వుతూ అన్నాడు ఎమ్మెల్యే.

మీ అభిమానానికి ధన్యవాదాలు సార్! నమ్రతగా అన్నాడు ఏకాంబర్.

నాతో పనుందన్నారు కదా చెప్పండి. నా చేతనైన సహాయం చేస్తాను. అంటూ అడిగాడు ఎమ్మెల్యే మేడిపండు అబద్దాలరావు.

మీరు చెయ్యగలరు సార్! మీ చేతుల్లోనే వుంది. నర్మగర్భం గా అంది నూకరత్నం.

నీ పేరేంటమ్మా! నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావే! పనేం దో చెప్పకుండానే నాతో పని అయిందనిపించేస్తున్నావ్.. నవ్వుతూ అన్నాడు ఎమ్మెల్యే.

పనంటే పని కాదు సార్! టక్కున అన్నాడు ఏకాంబర్.

"పనో ... సహాయమో... ఏదో ఒకటి చెప్పండి! అంటూ బజర్ నొక్కాడు ఎమ్మెల్యే.

ఆ బజర్ శబ్ధం వినగానే తలుపు దగ్గర నిలబడ్డ గన్ మేన్ వినయం గా తలుపు తీసుకుని లోపలకు వచ్చాడు.

పీ.ఏని ఓసారి హుకూం జారీ చేసాడు ఎమ్మెల్యే.

ఏకాంబర్, నూకరత్నం ఇద్దరూ ఒకేసారి డీలా పడిపోయారు. తమ సోదంతా వినబుద్ధికాక పీ.ఏని పిలిచి తమని బయటకు వెళ్ళి పీ.ఏ తో మాట్లాడుకోమనడు కదా! ఇద్దరూ మనసులోనే దేవుళ్ళకు మొక్కుకున్నారు.

క్షణం లో పీ.ఏ గది లోకి వచ్చాడు.చేతిలో చిన్న నోట్ పేడ్ వుంది. వినయంగా నిలబడి ఎమ్మెల్యే కేసి చూసాడు.

నా కోసం బయట వున్నారా?? తీక్షణం గా అడిగాడు ఎమ్మెల్యే.

మిమ్మల్ని కలవాల్సిన వాళ్ళెవరూ లేరు సార్! బయట వున్న వాళ్ళంతా రేషన్ కార్డుల కోసం, ఇళ్ళ స్థలాల కోసం వచ్చిన వాళ్ళే వాళ్ళ పేర్లు రాసుకుని పంపిచేస్తున్నాను. వినయంగా చెప్పాడు పీ.ఏ.

వాళ్ళందరినీ పంపించేసే ముందు నాకోసారి కనిపించమను. లేకపోతే గదిలో వుండి కూడా తమని పట్టించుకోలేదని ప్రచారం చేస్తారు. వాళ్ళతో వినయంగా వుండు, వెళ్ళు అన్నాడు.

అలాగే సార్! వీళ్ళు వెళ్ళే వరకూ ఎవరినీ లోపలకు పంపించను సార్.. వెళ్తూ అన్నాడు పీ.ఏ.

అలాగే అని ఇక చెప్పండి ఏకాంబర్ ! అంటూ ఏకాంబర్ కేసి చూస్తూ అన్నాడు ఎమ్మెల్యే.

సార్! మీరు నా మాట కాదనకూడదు. సంశయంగా అన్నాడు.

మీ మాట నేనెందుకు కాదంటాను. చెప్పండి! ఏకాంబర్ మాట వింటూనే సస్పెన్స్ తట్టుకోలేక స్థిరంగా అడిగాడు ఎమెల్యే.

సార్! మీ పేర ఓ పాలసీ రాసుకుంటాను సార్! నెమ్మదిగా అన్నాడు ఏకాంబర్.

పాలసీయా? ఆశ్చర్యం గా అన్నాడు ఎమ్మెల్యే.

అవును సార్! ఈ నెలాఖరులోగా నా టార్గెట్ పూర్తి కావాలి. దాని కోసమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆశగా అన్నాడు

ఏకాంబర్.పాలసీలు నాకెందుకయ్యా! ఉద్యోగులకి, బీదవాళ్ళకి అవసరం గాని, ఇంటి యజమాని చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి భీమా కావాలి గానీ, నా లాంటి వాళ్ళకెందుకయ్యా! నేను పోయినా నా పెళ్ళాం పిల్లలు రోడ్డున పడే చాన్సే లేదు.. తరగని ఆస్థి ఉంది. నా తర్వాత నా కొడుకో, పెళ్ళామో ఎమ్మెల్యే అయిపోతారు. నాకెందుకు ఇన్స్యూరెన్స్ పాలసీలు ఏకాంబర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు ఎమ్మెల్యే మేడిపండు అబద్దాలరావు.

ఎమ్మెల్యే మాటలు వింటూనే ఏకాంబర్ కి మెదడు మొద్దుబారిపోయింది. ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాడు . ఏం చేయాలో.. ఏం మాట్లాడాలో అర్ధంకాక క్షణం కళ్ళు తేలేసాడు.

సార్! మీకు అక్కరలేకపోవచ్చు సార్! పోనీ మీ వద్ద పని చేసిన వాళ్ళచేతనైన చిన్న పాలసీ కట్టించి హెల్ప్ చెయ్యండి సార్ రిక్వెస్ట్ చేస్తూ అంది నూకరత్నం.

కరక్టేనమ్మా అంటూనే ఒక్కసారి కుర్చీకి జేరగిలబడి కళ్ళు మూసుకున్నాడు ఎమ్మెల్యే మేడి పండు అబద్దాలరావు.

నీకు మతిపోయిందా? ఈయన కాకపోతే వేరే వాళ్ళయితే మన టార్గెట్ ఎలా ఫుల్ ఫిల్ అవుతుంది. వాళ్ళు చిన్నా చితకా పాలసీలే కదా రాస్తారు. నూకరత్నం చెవిలో గుసగుసగా అన్నాడు ఏకాంబర్.

ఒక మనిషికి పాలసీ ఎంతవరకు రాయించొచ్చు..కుర్చీలో నుండి ముందుకు వంగి హఠాత్తుగా అన్నాడు ఎమ్మెల్యే.

ఆ మాటకు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఏకాంబర్ కి నోట మాట రాలేదు. ఆలోచిస్తే ఒక్క క్షణం కూర్చున్నాడు.

చెప్పండి! సార్ ఏదో అడుగుతున్నారు కదా! మౌనం గా కూర్చున్నా ఏకాంబరాన్ని చేత్తో తడుతూ అంది నూకరత్నం.

ఎంతో అంటే... ఆ మనిషి ఆదాయాన్ని బట్టి, ఆరోగ్య పరీక్షలను బట్టి పాలసీ ఇస్తాం సార్! బాగా పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు కోట్లలో ఇన్స్యూరెన్స్ కట్టినవాళ్ళున్నారు. అహెప్పాడు ఏకాంబర్.

నా దగ్గర పని చేస్తున్న వాళ్ళు ఓ ఇరవై మంది వున్నారు. మనిషికి ఓ పది లక్షలు ఇన్స్యూరెన్స్ చేయించాక చనిపోతే ఎంత వస్తుంది? సూటిగా ఏకాంబర్ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఎమ్మెల్యే.

ఒక రకం పాలసె అయితే పదిలక్షలకు మూడు రెట్లు అంటే ముప్పై లక్షల వరకూ పాలసీదారు చనిపోతే ఇస్తారు. పాలసీ కంప్లీట్ అయ్యేవరకూ రావచ్చు. తరగావచ్చు.. చెప్పాడు ఏకాంబర్.

పది లక్షల పాలసీకి ఎంత డబ్బు కట్టాల్సి వస్తుంది. కుతూహలం గా అడిగాడు ఎమ్మెల్యే.

ఇది పాలసీ కట్టే అతని వయసుని బట్టి ఎంత కట్టాలో చెప్పగలను సార్! ఉదాహరణకి పాతికేళ్ళ కుర్రాడికి అయితే నలభై వేల రూపాయలు ఏడాదికి కాట్టాల్సి వుంటుంది. బ్యాగ్ లో వున్న రెడీ రెల్ నార్ తీసి చూసి చెప్పాడు ఏకాంబర్.

సరే మా వాళ్ళందరినీ పిలిపిస్తాను. చూసి చెప్పండి. అన్నాడు ఎమ్మెల్యే.

వాళ్ళంతా ఏం చేస్తుంటారు సార్! కుతూహలం గా అడిగాడు ఏకాంబర్. ఇరవై మంది ఒక్కసారే పాలసీలు ఇస్తారనే సరికి ఆనందం గుందేల్లో నుండి తన్నుకొస్తున్నా బయటకి గుంభనం గా వున్నాడు.

వాళ్ళం తా ఎలా పాలసీ కట్టగలరు సార్! వారికి అంత ఆదాయం వుండాలి కదా? అనుమానంగా అన్నాడు ఏకాంబర్.

ఏకాంబర్ అలా అనడంతోనే ఎమ్మెల్యే మేడి పండు అబద్దాలరావు ఒక్కసారే పెద్ద పెట్టున పకపకా నవ్వాడు. ఆ నవ్వుకి చుట్టుపక్కల వున్నవాళ్ళు వచ్చెయ్యాలి. కానీ ఏసీ గది కావడం వలన ఎమ్మెల్యే నవ్వు గది దాటి బయటకు వెళ్ళలేదు.

అదేంటి సార్! అలా నవ్వేసారు? ఆశ్చర్యం గా అంది నూకరత్నం.

మా వాళ్ళ ఆదాయం గురించి అడిగితే నాకు నవ్వు ఆగలేదు. మీకు తెలుసా? మా వాడి ఒక్కొక్కడి ఆదాయం నెలకి రెండు, మూడు లక్షల్లకు పైనే వుంటుంది. అన్నాడు ఎమ్మెల్యే మేడిపండు అబద్దాలరావు.

ఇంతలో పీ.ఏ తలుపు తోసుకుని లోపలకు వచ్చాడు.ఏందయ్యా! ఏమిటి విశేషం? ఎవరైనా వచ్చారా? పీ.ఏ ని చూస్తూ అడిగాడు ఎమ్మెల్యే.

సార్!... వాళ్ళు...వాళ్ళు వచ్చారు సార్! ఎమ్మెల్యే కేసి చూస్తూ ఏకాంబర్ కేసి మార్చి చూస్తూ నీళ్ళు నములుతూ అన్నాడు పీ.ఏ.

చెప్పవయ్యా! వాళ్ళేనా? ఫ్లై ఓవర్ బ్రిడ్జి కాంత్రాక్టర్ కదా! అడిగాడు ఎమ్మెల్యే.

అవును సార్! అన్నాడు పీ.ఏ.

వాళ్ళని ఆ కోమా రూం లోకి పంపించు.. ఏకాంబర్! మీరు ఓ పది నిముషాలు కూర్చుంటారు కదా! ఏకాంబర్ కేసి చూసి అంటూనే

కుర్చీలోనుండి లేచి ఆ ప్రక్కనే ఉన్న మరోగదిలోకి వెళ్ళాడు ఎమ్మెల్యే.

పీ.ఏ బయటకి వెళ్ళి ఎవరో ఇద్దర్ని ఓ పెద్ద సూట్కేస్తో లోపలకు తీసుకువచ్చాడు. ఆ ఇద్దర్నీ ఎమ్మెల్యే గారు వెళ్ళిన కోమా రూం లోకి పంపించి బయటకు వెళ్ళిపోయాడు పీ.ఏ.

ఏకాంబర్ కి, నూకరత్నానికి ఆనందంగానే వుంది. పది నిముషాలు కాదు గంటైనా ఎదురుచూస్తూ కూర్చోగలరు

ఒకసారి ఇరవై మంది దగ్గర రెండు కోట్లు ఇన్స్యూరెన్స్ పాలసీ వస్తుందంటే మాటలా?! టార్గెట్ దాటి పోతుంది.

ఈ దెబ్బతో మనసులోనే అనుకున్నాడు ఏకాంబర్.

పావుగంటలో కోమా రూం న్నుండి ఎమ్మెల్యే, ఆయనతో పాటు ఆ పెద్దమనుషులిద్దరూ బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరి చేతుల్లో ఏమీ లేదు. లోపలకు వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళిన సూట్కేసు లేదు.

ఆ సూట్కేసు చూసి మురిసిపోయింది నూకరత్నం. ఎంతో అందంగా, కొత్తదనం గా, ఆకర్షణీయంగా ఉంది ఆ సూట్ కేసు. ఆ విషయమే ఏకాంబర్ చెవిలో చెప్పింది.

ఆఘమేఘాల మీద లోపలకు వచ్చాడు పీ.ఏ.

పీ.ఏ గారు! మన వాళ్ళందరికీ పాన్ కార్డులు, వాటి రిటన్స్ వీళ్ళకి చూపించండి. నా బాడీగార్డులు ఇరవై మందితో వీళ్ళు ఇచ్చిన ఫారాల మీద సంతకాలు చేయించండి. మన దగ్గర వున్న వాళ్ళ ఐ.డీ కార్డులు, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్స్ అనీ ఇవ్వండి. వీళ్ళు ఏమడిగితే అవి జిరాక్స్ చేసి ఇవ్వండి. అంటూ పీ.ఏ ని పంపించేసి ఏకాంబర్ కేసి తిరిగి అన్నాడు ఎమ్మెల్యే.

మీరు మావాళ్ళందరికీ పదేసి లక్షల ఇన్స్యూరెన్స్ చేయండి. దానికి కావలిసినవన్నీ మా పీ.ఏ మీకిస్తాడు. సరేనా? అన్నాడు ఎమ్మెల్యే.థాంక్యూ సార్!... థాంక్యూ ఆనందం గా అన్నారు ఏకాంబర్, నూకరత్నం లు ఇద్దరూ కోరస్ గా,

ఉండుండుండండీ! పాలసీలు పూర్తిగా రాయాలి, కంప్లీట్ కావాలి. అప్పుడు చెప్పండి ధన్యవాదలు. నవ్వుతూ చెప్పాడు ఎమ్మెల్యే.అంతంత ఆదాయం వున్న వాళ్ళకి ఇన్స్యూరెన్స్  ఇవ్వడం తప్పులేదు సార్! స్టాండర్డ్ ఏజ్ ప్రూప్ఫ్ వుండాలి అంతే! అన్నాడు ఏకాంబర్.

అవన్నీ మా పీ.ఏ తో మాట్లాడి మిగతా వర్క్ కంప్లీట్ చెయ్యండి నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను అంటూ గది బయటకు వచ్చాడు ఎమ్మెల్యే మేడిపండు అబద్దాల రావు.

ఆయన వెనుకే ఏకాంబర్, నూకరత్నం బయటకు వచ్చారు. ఇద్దరికీ మహదానందంగా వుంది. ఏకాంబర్కైతే గాల్లో తేలిపోతున్నట్టే వుంది. ఒక్కసారే టార్గెట్ ను మించి వ్యాపారం దొరికింది. ఇన్స్యూరెన్స్ అయితే టార్గెట్ మించిపోయింది. పాలసీల సంఖ్య తక్కువైనట్టుంది. మనసులోనే అనుకున్నాడు ఏకాంబర్.ఇన్స్యూరెన్స్ పోటీలో ఇన్స్యూరెన్స్ తోపాటు ప్రీమియం, పాలసీల సంఖ్య కూడా ఇంత వుండాలని నిర్దేశిస్తారు. ఆ మూడు కండీషన్స్ పూర్తయితేనే పోటీలో నెగ్గినట్టు. అవార్డులకు, రివార్డులకు అర్హత సాధించినట్టు.

ఎమ్మెల్యే మేడిపండు అబద్దాలరావు గదిలోనుండి బయటకు రావడం చూసి ఆ ఆవరణలో గుంపులు గుంపులుగా నిలబడ్డ జనమంతా ఒక్కసరి "దండాలండయ్యా" అంటూ అరిచాడు.

వాళ్ళందరికీ తిరిగి నమస్కారం చేస్తూ చిన్న చిరునవ్వు నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఎమ్మెల్యే.

ఏకాంబర్ నూకరత్నం నేరుగా వెళ్ళి పీ.ఏ రూం లో ఖాళీగా వున్న కుర్చీల్లో కూర్చున్నారు.

సార్! మీకు అభ్యంతరం లేకపోతే ఒక గంట పోయాక వస్తే మనం కూర్చుందాం. ఇక్కడ వున్న వాళ్ళందరినీ పంపించేస్తే నేను ఖాళీ అయిపోతాను చెప్పాడు పీ.ఏ.

అలాగే సార్! ముందా పని కానివ్వండి. మేము గంటలో బయటకు వెళ్ళి వస్తాం. అంటూ ఏకాంబర్ , నూకరత్నం ఎమ్మెల్యే ఇంటి ఆవరణలో నుండి రోడ్డు మీదకు వచ్చారు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
2nd episode