Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 11 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

 

ఈ వారం మొత్తంమీద బాగానే ఉంటుంది అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలకు సమయం ఇస్తారు కాకపోతే పెద్దల సూచనలు పాటించే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతస్థాయి నుండి ప్రశంశలు లభించే అవకాశం కలదు. నలుగురిలో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది కాకపోతే ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం అనేది సూచన సూచన. కుటుంబసభ్యులతో నూతన చర్చలు చేయుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది వాటిమూలన శ్రమను పొందుతారు స్వల్ప ఇబ్బంది తప్పక పోవచ్చును. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం మూలాన మేలుజరుగుతుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన.      

 

 

వృషభ రాశి

ఈ వారం మొత్తంమీద బంధుమిత్రులతో సమయాన్ని సరదగా గడుపుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాల విషయంలో ఆసక్తిని చూపిస్తారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుట వలన నలుగురిలో ఆశించిన విధంగా పేరును సంపాదించుకొనే అవకాశం ఉంది. సోదరులకు అనుగుణంగా వ్యవహరించుట సూచన ఆర్థికపరమైన విషయాల్లో వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు చర్చాసంభందమైన విషయాలకు అధికసమయం ఇస్తారు. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన అవకాశాలు పొందుటకు అవకాశం కలదు వారి నిర్ణయాలను సమర్తించుట వలన మేలుజరుగుతుంది. సొంతనిర్ణయాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీస్కోవడం వలన మేలుజరుగుతుంది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రయత్నం పెంచుట మంచిది.   

 

మిథున రాశి
ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన నిర్ణయాల విషయంలో తొందరపాటు ఆలోచనలు చేయకండి బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అధికారులనుండి వచ్చు ఆలోచనల విషయంలో సందిగ్దత వీడుతుంది ప్రయత్నం పెంచుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశం నుండి వచ్చు వార్తలు మీకు కొంత సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. శుభకార్యముల విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొనే అవకాశం కలదు. నచ్చిన వ్యక్తులకు సమయం ఇస్తారు వారితో కలిసి సమయం గడుపుతారు. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుతాయి కావున తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెద్దలతో చేయు ఆలోచనలు మీలో స్వల్ప మార్పులను తీసుకోనివచ్చే అవకాశం కలదు.  

 

కర్కాటక రాశి

ఈ వారం మొత్తంమీద ఉత్సాహంను కలిగి ఉండి పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట వలన మేలుజరుగుతుంది. నలుగురిలో చేపట్టిన పనుల వలన మంచిపేరును తెచ్చుకొనే అవకాశం ఉంది. అధికారులతో వారంచివరలో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున మాటలు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. మిత్రులకు సహకారం అందిస్తారు తోటివారితో మంచి సంభందాలు కలిగిఉండే అవకాశం ఉంది. పనిఒత్తిడిమూలాన శ్రమను పొందుతారు అలాగే స్వల్ప అనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును. సమయానికి భోజనం చేయుట అనేది సూచన. విలువైనవస్తువులను లేదా భూమిసంభందమైన విషయాలకు ధనమును వెచ్చించే అవకాశం కలదు. బంధువులతో చేయుపనుల మూలాన అధికమైన శ్రమను పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త.   

 

 

సింహ రాశి

ఈ వారం మొత్తంమీద ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు కలిగినను రాను రాను వాటిలో అనుకున్న ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుతాయి వారితో సమయాన్ని సంతోషంగా గడిపే అవకాశం ఉంది. పనులలో శ్రమను పొందినను మిత్రులసహకారంతో వాటిని అదిగమిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సూచన. కుటుంబసభ్యుల నుండి మీరు ఆశించిన మేర సహాయసహకారాలు రాకపోవడం మూలాన కొంత అసంతృప్తిని కలిగి ఉండే అవకాశం కలదు. పెద్దలనుండి వచ్చు సూచనలు పాటించుట మంచిది. ఉద్యోగంలో అధికారులకు అనుగునంగా నడుచుకోండి అలాగే ధనమునకు సంభందించిన విషయాలలో వారోతో చర్చలు జరుపుటకు అవకాశం ఉంది.      

 

 

 

కన్యా రాశి

ఈ వారం మొత్తంమీద వారం చివరలో ఉద్యోగప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కలదు కావున ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేస్తారు. తలపెట్టిన పనులలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి కావున ఈవిషయంలో నిదానంగా ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయండి. ఒకవార్త కొంత నిరుత్సాహంను కలిగిస్తుంది కాకపోతే మానసికంగా దృడంగా ఉండి మున్డుకువెళ్ళు ప్రయత్నం చేయుట ఉత్తమం. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది కాకపోతే దూరప్రదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. జీవితభాగస్వామి మూలాన కొంత చిరాకును పొందుతారు సర్దుబాటు విధానం మంచిది అనవసరమైన విభేదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట ఉత్తమం. వారం చివర్లో నలుగురిలో ఆశించిన గుర్తింపును పొందుటకు అవకాశం కలదు.     

 

తులా రాశి

.......ఈ వారం మొత్తంమీద ఇష్టమైన పనుల విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను కాస్త అటుఇటుగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులనుండి సంతృప్తికరమైన ఫలితాలు వచ్చుటకు ఆస్కారం కలదు. మాటపట్టింపులకు పోకండి అనవసరమైన వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట అన్నివిధాల మంచిది. బద్ధకం వీడి ముందుకు వెళ్ళుట వలన మరింత అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. ఒకటికి రెండు సార్లు పనిని చేస్తే గాని అవి పూర్తికాకపోవచ్చును ఈ విషయం దృష్టిలో పెట్టుకోవడం మేలు. వ్యాపారంలో మీరు ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చును సర్దుకుపొండి. నలుగురిలో ఉన్నప్పుడు మాటతీరు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది లేకపోతే కొత్త సమస్యలు వస్తాయి.   

 

 

వృశ్చిక రాశి

ఈ వారం మొత్తంమీద ఆశించిన ఫలితాలు కొంత నిదానంగా వచ్చుటకు అవకాశం కలదు. ఆప్తులను కలుస్తారు వారితో చేయు చర్చలు పురోగతిని కలిగి ఉంటవి. చేపట్టిన పనులను కొంత ఇబ్బందికి లొనయినను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి. పెట్టుబడులు అలాగే వ్యాపారపరమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన లబ్దిని పొందుటకు అవకాశం కలదు. వాహనములు అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో శ్రమతప్పక పోవచ్చును అలాగే తోటివారితో ఊహించని విధంగా విబేదాలు కలిగే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంబంలో మీయొక్క ఆలోచనలను వ్యతిరేకించే అవకాశం ఉంది సర్దుబాటు విధానం మేలుచేస్తుంది తొందరపాటు కూడదు

 

 

ధనస్సు రాశి
ఈ వారం మొత్తంమీద ఆరంభం బాగుంటుంది పనుల విషయంలో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరలో ఉండకపోవచ్చును. ప్రణాళికా బద్దంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన మేర లాబాలు రాకపోవచును నిదానం అవసరం. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు కాకపోతే అందరిని సంప్రదించట మంచిది. ప్రయాణాలు చేయకండి వీలయితే వాయిదా వేయుట మంచిది. దూరప్రదేశం నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం సూచన. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మూలాన నష్టపోయే అవకాశం కలదు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంది ఈవిషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సూచన.    

 

మకర రాశి

ఈ వారం మొత్తంమీద ఆరంభంలో మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళుట మంచిది. పెద్దలతో మీకున్న పరిచయాలు లాభిస్తాయి కాకపోతే మాటతీరును మెరుగుపరచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది కుటంబసభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. అనారోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు తీసుకోండి మంచిది. సంతానపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది.    

 

కుంభ రాశి

......ఈ వారం మొత్తంమీద బందువులతో సమయాన్ని సరదగా సంతోషంగా గడుపుటకు అవకాశం కలదు. విందులు,వినోదాల్లో మిత్రులతో కలిసి పాలుపంచుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులను సమయానికి పూర్తిచేస్తారు చివరినిమిషంలో ఫలితాలు అనుకూలంగా వచ్చుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుతాయి వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. తోటివారితో స్వల్ప విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది వివాదములకు అవకాశం ఇవ్వకండి. కుటుంబంలో జీవితభాగస్వామి మూలాన ఊహించని ఖర్చులు పెరుగుతాయి సర్దుకుపొండి అలాగే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. అనారోగ్యసమస్యలు కలుగుతాయి తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే సమయానికి భోజనం చేయుట మంచిది.  

 

 

మీన రాశి
ఈ వారం మొత్తంమీద ఆరంభం బాగుంటుంది తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుట వలన మంచి పేరునుసంపాదించుకొనే అవకాశం కలదు. మిత్రులతో కలిసి చేపట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయా ల్లో సొంత నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట ఉత్తమం.శుభకార్యముల విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. రాజకీయపరమైన విషయాల పట్ల  ఆసక్తిని కలిగి ఉంటారు.ఉద్యోగంలో సంతృప్తికరమైన వాతావరణం ఉండుట వలన సంతోశంను కలిగి ఉంటారు. కొన్ని కొన్ని విషయాల్లో మానసికంగా దృడంగా ఉండుట సూచన.  వాహనముల విషయంలో అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.       

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Bachelors Fried Rice!