Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
great  kobbarimatta

ఈ సంచికలో >> సినిమా >>

లారెన్స్‌ సినిమాలు: ముసలోడు, ది లేటెస్ట్‌

Lawrence Movies: musalodu, The Latest

ఒక్క టిక్కెట్‌ మీద రెండు సినిమాలు చూపిస్తానని కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ లారెన్స్‌ రాఘవేంద్ర చెప్పాడు. డిసెంబర్‌లో ఈ సినిమాలు నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఒక టిక్కెట్‌కి రెండు సినిమాలూ ఒకేసినిమా టైమ్‌లో పూర్తయిపోవడం ఇక్కడ ప్రత్యేకత. ఇంటర్వెల్‌కి ముందు ఒక సినిమా, ఇంటర్వెల్‌ తర్వాత ఇంకో సినిమా అనే కొత్త కాన్సెప్ట్‌కి లారెన్స్‌ శ్రీకారం చుట్టాడు.
టైటిల్‌ కూడా వెరైటీగా పెట్టిన లారెన్స్‌, ఒక సినిమాలు ‘ముసలోడు’గానూ రెండో సినిమాలో ‘ది లేటెస్ట్‌’గానూ కనిపించడం ఇంకో విశేషమ్‌. ఒక సినిమా యాక్షన్‌, ఇంకో సినిమా ఎంటర్‌టైనర్‌. ‘నేను చేస్తున్న ఈ ప్రయోగం విజయం సాధిస్తే, సినిమా ట్రెండ్‌ మారిపోతుంది’ అని లారెన్స్‌ అన్నాడు. ‘ముని`2’కి సీక్వెల్‌ అయిన ‘గంగ’ సినిమా కబుర్లు చెబుతూ ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాల కాన్సెప్ట్‌ని ఆయన వివరించాడు.

‘గంగ’లో రాయ్‌ లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. ‘గంగ’ తరువాతే ‘ముసలోడు’, ‘ది లేటెస్ట్‌’ ప్రాజెక్ట్స్‌ టేకప్‌ చేసి, అవి పూర్తయ్యాక హిందీలో ‘కాంచన’ చేస్తానని అన్నాడు లారెన్స్‌. ఒక్క టిక్కెట్‌కి ఒకేసారి రెండు సినిమాలు అనే ఓ ప్రయోగాత్మక సినిమా(ల)కి శ్రీకారం చుట్టిన లారెన్స్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెబుదాం.

మరిన్ని సినిమా కబుర్లు
agadu movie records