Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agadu movie records

ఈ సంచికలో >> సినిమా >>

ఈ తూనీగ కమిట్‌మెంటే వేరు

rhea chakraborty commitment

‘తూనీగా తూనీగా నీకు నాకు పడదీక..’ అనే పాటలో యువతకు గిలిగింతలు పెట్టిన ‘తూనీగ తూనీగ’ సినిమా హీరోయిన్‌ రియా చక్రవర్తి, తెలుగులో సినిమాలు చేయట్లేదుగానీ హిందీలో చేస్తుంది. సక్సెస్‌ ఎక్కడుంటే అక్కడే అవకాశాలొస్తాయి కాబట్టి, దక్షిణాది సినిమాలకు టైమ్‌ తగ్గించి, హిందీ సినిమాలకు ఎక్కువ టైమ్‌ కేటాయించిందీ బెంగాళీ భామ.

టీవీ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని, వెండితెరపైకి వచ్చిన రియా లేటెస్ట్‌గా ‘సోనాలి కేబుల్‌’ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. మహారాష్ట్ర అమ్మాయి పాత్ర చేస్తున్న రియా, క్యారెక్టర్‌లో పెర్‌ఫెక్షన్‌ కోసం, మరాఠా లాంగ్వేజ్‌ నేర్చుకోవడం మొదలు పెట్టింది. ఆమె మదర్‌ మహారాష్ట్రకు చెందినవారు కావడంతో, మరాఠీ నేర్చుకోవడం ఆమెకు కష్టం కాలేదు.

తల్లి వద్ద శ్రద్ధగా మరాఠీ నేర్చుకోవడమే కాకుండా, మరాఠీలో కొన్ని క్లిష్టమైన పదాల్ని అచ్చం మరాఠీ గర్ల్‌లా పలికేందుకు చాలా శ్రమిస్తోంది రియా చక్రవర్తి. ఎలాగోలా గ్లామర్‌తో నెట్టుకొచ్చేయాలని హీరోయిన్లు చూస్తారుగాని, ఇంత కమిట్‌మెంట్‌ ఉన్న హీరోయిన్‌ని ఎప్పుడూ చూడలేదని ‘సోనాలి కేబుల్‌’ రూపకర్తలు ఆశ్చర్యపోతున్నారు. కమిట్‌మెంట్‌ అంటే అలా ఉండాలి. ఆ కమిట్‌మెంట్‌ ఎప్పటికైనా సక్సెస్‌ ఇస్తుంది.

మరిన్ని సినిమా కబుర్లు
National merit awards to the new director