Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Pesarattu 'Movie  start ..!

ఈ సంచికలో >> సినిమా >>

ఆగడు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి

agadu songs creating sensation

గతంలో లహరి మ్యూజిక్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ ఆడియోలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కొంత గ్యాప్ తరువాత మళ్ళీ ఈ ఏడాది '1' (నేనొక్కడినే), లెజెండ్, రేసుగుర్రం, దృశ్యం వంటి సూపర్ హిట్ ఆడియోలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మహేష్ ఆగడు ఆడియోను లహరి విడుదల చేసింది. ఈ ఆడియో విడుదలైన రోజునుంచే సేల్స్ పరం గా కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

ఈ సందర్భం గా లహరి మ్యూజిక్ అధినేత మనోహర్ నాయుడు మాట్లాడుతూ- "ఈ సంవత్సరం మా సంస్థ విడుదల చేసిన ఆడియోలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా మహేష్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ నిర్మిస్తున్న ఆగడు ఆడియో ఇటీవల విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది. థమన్ సంగీత సారధ్యం లో రూపొందిన ఈ ఆల్బం లోని అన్ని పాటలూ ఆదరణ పొందుతు న్నాయి .  'ఆగడు టైటిల్ , నారి నారి..., జంక్షన్ లో .. తు ఆజా సరోజా .. పాటలు శ్రోతల్ని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. ఈ సంవత్సరం థమన్ చేసిన ఆడియో కొత్త రికార్డులు సృష్టిస్తోందని అన్ని ఏరియాల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే డిజిటల్ గా కూడా చాలా హై రేంజ్ లో డౌన్ లోడ్స్ జరుగుతున్నాయి. వరుసగా మూడు చిత్రాల ఆడియోలు మా లహరి ద్వారా విడుదల చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు రాం, గోపీ, అనిల్ లకు మరియు కొర్రపాటి సాయి. ఆగడు దర్శకుడు శ్రీను వైట్లకు, సంగీత దర్శకుడు థమన్ కు ఈ సంధర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సంస్థ ద్వారా త్వరలో మల్టీస్టారర్ గోపాల గోపాల, మరో భారి బడ్జెట్ చిత్రం ఆడియోలు విడుదల కాబోతున్నాయి అన్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam